• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎన్‌హెచ్ఏఐ అధికారులతో కలెక్టర్ సమీక్ష

NTR: విజయవాడలోని కలెక్టరేట్లో ఎంపీ కేసినేని చిన్నితో కలిసి నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా స్టేట్ హోల్డర్స్ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవే MH 65 ఆరు లైన్ల విస్తరించే పురోగతిపై సమీక్షించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం గురించి చర్చించారు.

February 27, 2026 / 06:35 AM IST

పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు

KDP: చెన్నూరు, రామనపల్లెల్లోని పాల కేంద్రాల్లో పశుసంవర్ధక శాఖ ఏడీ డా. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాలలో యూరియా, ఫార్మలిన్ కలపడం, పశువులకు ఆక్సిటోసిన్ ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు. పాల కల్తీకి పాల్పడేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

February 27, 2026 / 06:32 AM IST

రాష్ట్రంలో CJI జస్టిస్ సూర్యకాంత్ పర్యటన

AP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సూర్యకాంత్ 2 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం తిరుమలను శ్రీవారి సేవలో పాల్గొననున్న ఆయన.. ఆదివారం తిరుపతిలోని 16 కోర్టు భవనాల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. ఆపై అమరావతికి చేరకుని వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. అనంతరం AP జ్యుడిషియల్ అకాడమీ, HC హైకోర్టు భవనాలకు పునాది వేయనున్నారు.

February 27, 2026 / 06:30 AM IST

సీఎంను కలిసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ

KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ MLA వరుపుల సత్యప్రభరాజా గురువారం అమరావతిలో CM నారా చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై CM సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే.. పలువురు మంత్రులు, అధికారులను కలిసి నియోజకవర్గంలో పనులను వేగవంతం చేయాలని కోరారు.

February 27, 2026 / 06:30 AM IST

హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ATP: గుత్తి మండలం టీ.కొత్తపల్లి గ్రామ సమీపంలోని 63 హైవేపై శుక్రవారం తెల్లవారుజామున బైకు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈసురాళ్లపల్లి గ్రామానికి చెందిన బెస్త రంగస్వామి, బెస్త పవన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 27, 2026 / 06:30 AM IST

వీబీజీరామ్‌జీ ఉద్దేశం.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడం

కృష్ణా: వీబీజీరామ్‌జీ యాక్ట్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీబీజీరామ్‌జీ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించడం అని అన్నారు. ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలో అమలయ్యే పథకాల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

February 27, 2026 / 06:30 AM IST

అక్రమంగా ఇసుక తరలింపు.. ఇద్దరిపై కేసు

KNR: కరీంనగర్ రూరల్ పరిధిలో దుర్షేడ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పోలీసులు గురువారం పట్టుకున్నారు. గోపాలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా తనిఖీలు చేపట్టగా, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న పొన్నం లక్ష్మణ్, బిజిలి చందులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులను కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు

February 27, 2026 / 06:30 AM IST

‘ఒకే భవనంలో 2 విద్యా సంస్థలు’

MNCL: మంచిర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో నిర్వహిస్తున్న సూర్యతేజ పారామెడికల్ ఇన్‌స్టిట్యూట్, లక్ష్మీ నర్సింగ్ స్కూల్ విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని DMHOకు VJS జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కోర్సులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేకుండా ఒకే భవనంలో 2 విద్యా సంస్థల నిర్వహణ ఆందోళకరమన్నారు.

February 27, 2026 / 06:30 AM IST

నేడు ఫైనల్ మ్యాచ్

VSP: యూసీసీ క్రికెట్ పోటీల్లో భాగంగా శుక్రవారం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో గెలాక్సీ సీసీ జట్టు, వైజాగ్ కోల్ట్స్ జట్టు మధ్య ఫైనల్ పోరు జరుగుతుందని యూసీసీ అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, వెంకటేష్ సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా వాసులు మ్యాచ్‌ను తిలకించేందుకు తరలిరావాలని కోరారు.

February 27, 2026 / 06:30 AM IST

నేడు బాల్కసుమన్ పిటిషన్‌పై విచారణ

TG: BRS మాజీ MLA బాల్కసుమన్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఇటీవల మంచిర్యాల క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

February 27, 2026 / 06:28 AM IST

నేడు డిశ్చార్ కానున్న డిప్యూటీ స్పీకర్

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. స్పోర్స్ మీట్‌లో క్రికెట్ ఆడుతూ గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించారు. సర్జరీ పూర్తికావడంతో ఆయన ఇవాళ ఏపీ తిరిగి వచ్చే అవకాశం ఉంది.

February 27, 2026 / 06:28 AM IST

నేడు డిశ్చార్జ్ కానున్న డిప్యూటీ స్పీకర్

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. స్పోర్స్ మీట్‌లో క్రికెట్ ఆడుతూ గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించారు. సర్జరీ పూర్తికావడంతో ఆయన ఇవాళ ఏపీ తిరిగి వచ్చే అవకాశం ఉంది.

February 27, 2026 / 06:28 AM IST

నేడు దిశ కమిటీ సమావేశం

KMM: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించే జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఇవాళ ఖమ్మం కలెక్టరేట్‌లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.

February 27, 2026 / 06:27 AM IST

వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేడుకలో వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

February 27, 2026 / 06:26 AM IST

రేపు మత్స్యకారులకు బోట్లు, వలల పంపిణీ

W.G: పెదమైనవానిలంకలో  శనివారం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్లు, వలల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పంపిణీ ఏర్పాట్లను జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పర్యవేక్షించారు. సుమారు 100 బోట్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

February 27, 2026 / 06:25 AM IST