కర్నూలు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)కు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని, ప్రజల పాత్రే కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. ఆదివారం ఆయన ఏ.క్యాంపు మోంటెస్సోరి స్కూల్, కలెక్టరేట్ వెనుక ఇందిరా గాంధీ స్మారక మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ స్పెషల్ క్యాంపెయిన్‌ను పరిశీలించారు.
MDK: కౌడిపల్లి మండలం బుజరాంగ్‌పల్లిలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి, 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.28,296 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇరాన్ సంపదను దోచుకోవడం కోసమే యుద్ధం ప్రకటించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెరవెనుక ఉండి అమెరికా మొత్తం నడిపిస్తోందని తెలిపారు. ‘అమెరికాకు ఎదురుతిరిగితే హతమారుస్తున్నారు. యుద్ధం కారణంగా చమురుపై ప్రభావం పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా కాదు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా పోరాడాలి’ అని నారాయణ పేర్కొన్నారు.
WNP: జడ్చర్లలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్‌లో కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన విద్యార్థులు పతకాలతో మెరిశారు. అండర్-11 విభాగంలో వంశీ బంగారు, అండర్-12లో భార్గవి చంద్రకళ వెండి పతకం సాధించారు. మన్యంకొండకు చెందిన మహేష్ కూడా ప్రతిభ కనబరిచారు. విజేతలను క్రీడాభిమానులు అభినందించారు.
KDP: కొండాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మంగలి చౌడప్ప (50) అనే వ్యక్తి రైలు కింద పడడంతో మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. మృతుడు స్థానిక మండలంలోని గండ్లూరు నివాసి అనారోగ్య కారణంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: ఆలూరులోని శ్రీ శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి భక్తులు ఉదారంగా ఇవాళ విరాళాలు అందజేస్తున్నారు. మాజీ మంత్రి మారెప్ప అల్లుడు చినబాబు అజయ్ రూ.50,000, జోల్దరాసి నానీ మురళి కృష్ణ రూ.20,000 విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ATP: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న జిల్లా వాసుల సమాచారం కోసం బంధువులు 8500292992 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఆర్డీవో కార్యాలయాల నంబర్లు 9493188818 (అనంతపురం), 8309598111 (కళ్యాణదుర్గం), 9866646648 (గుంతకల్లు) సహాయం పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ముష్కే వెంకట్ కుటుంబానికి ఆయన మిత్రులు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. 2000 బ్యాచ్‌కు చెందిన వెంకట్ సహ ఉద్యోగులు సేకరించి, రూ.2 లక్షల చెక్‌ను వారి కుటుంబానికి అందించారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన పోలీసులు స్నేహ ధర్మం చాటుకున్నారు.
నాగర్కర్నూల్ మండల పరిధిని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తూడుకుర్తికి చెందిన బోనగళ్ల నాగ మశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గురించి హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: కనగానపల్లి మండలం నెమళివరం, పాతపాళ్యం గ్రామాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం పర్యటించారు. గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లను పరిశీలించి, కొత్త రోడ్డు మార్గాల అవసరాలపై గ్రామస్థులు, టీడీపీ నాయకులతో చర్చించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లతో సమావేశమై మీ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆమె హామీ ఇచ్చారు.
KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని YCP మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక YCP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గోడౌన్ నుంచే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అమ్ముకుంటున్నారని తెలిపారు. రేషన్ కార్డుదారులకు ప్రతినెల అరకిలో చక్కెర మినహా ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేదన్నారు.
ASF: కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి ఆలోచన మేరకు ఆదివారం “నా ఊరు – నా బాధ్యత” సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ యువత స్వచ్ఛందంగా పాల్గొని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో శ్రమదానం చేశారు. గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాల్గొన్న యువత తెలిపారు.
HNK: పట్టణ కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఇవాళ ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్ సహకారంతో వైద్య నిర్వహించారు. కాలనీలో ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా BRS రాష్ట్ర నాయకుడు, ఇండస్ ఫౌండేషన్ ఛైర్మన్ రాకేష్ రెడ్డి హాజరై, మాట్లాడారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం సమాచార హక్కు శాఖ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ లో వేరువేరుగా స్వామి అమ్మవాలను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు వచ్చిన అతిథులకు పూలమాలతో స్వాగతం చెప్పి గర్భాలయంలో స్వామి అమ్మ వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్ఐవో జోనల్ సీఐగా పని చేస్తున్న శ్రీరాం కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈయన జిల్లాలోని పొదిలి, దర్శి, కందుకూరు ప్రాంతాల్లో సీఐగా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన పలు కేసులను ఆయన పరిష్కరించారు. దీంతో సీఐ శ్రీరామ్ ప్రతిష్టాత్మమైన కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు.