• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో పెరిగిన క్రయవిక్రయాలు!

VKB: జిల్లాలోని భూములు, ప్లాట్లు ఇతర విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నాటికి జిల్లాలో రూ. 54.56 కోట్లు ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్ లో రూ. 27.59 కోట్ల ఆదాయం సమకూరగా అత్యల్పంగా కొడంగల్‌లో రూ. 6.5 కోట్ల ఆదాయం సమకూరింది.

March 5, 2026 / 10:07 AM IST

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది: మంత్రి

AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోందని మంత్రి గొట్టిపాటి అన్నారు. అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘200కు పైగా 33/11 కేవీ సబ్‌స్టేషన్ల డిమాండ్ ఉంది. వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. విశాఖలో భూగర్భ కేబుల్‌పై ప్రతిపాదన పరిశీలిస్తున్నాం. పరిశ్రమలు, వ్యవసాయం కనెక్షన్లు పెరుగుతున్నాయి’ అని వెల్లడించారు.

March 5, 2026 / 10:06 AM IST

బిజ్వార్ జడ్పీహెచ్ఎస్‌లో స్వయం పరిపాలన దినోత్సవం

NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్ జడ్పీహెచ్ఎస్లో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తోటివారికి పాఠాలు బోధించారు. ఎస్బీఐ మేనేజర్ నర్సింహులు విద్యార్థులను పరీక్షల్లో మెలకువ పాటించమని.. ఉన్నత చదువులకు విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

March 5, 2026 / 10:06 AM IST

ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం.. భక్తుల ఆగ్రహం!

MBNR: కౌకుంట్ల మండలం ముచ్చింతల వాగు సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో గుర్తుతెలియని దుండగులు కలకలం సృష్టించారు. స్వామివారి విగ్రహం కాలును ధ్వంసం చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ అపచారానికి ఒడిగట్టిన వారిని తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

March 5, 2026 / 10:05 AM IST

ఈ నెల 26 నుంచి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

NDL: జూపాడుబంగ్లా మండలం తర్తూరులో వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 26న పూల సఫార ఉత్సవం, 27న సింహ వాహన, 28న హంస, 29న శేష, 30న హనుమద్వాహన, 31న గరుడ, ఏప్రిల్ 1న గజవాహన, 2న రథోత్సవం, 3న అశ్వవాహన, 4న వసంతోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

March 5, 2026 / 10:05 AM IST

లవర్ దూరమైందని ప్రియుడు సూసైడ్

SDPT: ప్రేమించిన యువతి దూరమైందని UPకి చెందిన ప్రదీప్ కుమార్ (మేనేజర్) ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మం. వెలికట్ట శివారులోని కంపెనీలో పనిచేస్తూ దుద్దెడలో ఉంటున్న ప్రదీప్, గతంలో తనతో పనిచేసిన యువతిని ప్రేమించాడు. ఏడాది క్రితం ఆమె కంపెనీలో ఉద్యోగం మానేసి వెళ్లినప్పటి నుంచి ఆందోళనగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

March 5, 2026 / 10:04 AM IST

బాణసంచా కేంద్రాలపై 3,219 కేసులు

AKP: రాష్ట్రంలో 2014-2025 వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బాణసంచా కేంద్రాలపై 3,219 కేసులు నమోదు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం శాసనసభలో ప్రకటించారు. వీటిలో 2,753 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.152 కేసులు దర్యాప్తులో ఉన్నాయన్నారు. అదే కాలంలో పోలీస్ శాఖ 26.56 కోట్ల విలువైన బాణసంచ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

March 5, 2026 / 10:03 AM IST

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో BLR

NLG: వేములపల్లి మండలం సల్కునూరులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 5, 2026 / 10:03 AM IST

రోడ్డుపై మురుగు నీరు.. ఇబ్బందుల్లో ప్రజలు

VKB: బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో బీసీ కాలనీ 2 వార్డులో రోడ్డుపై పారుతున్న మురుగునీరుతో పాదచారులు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయం పాలకులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

March 5, 2026 / 10:02 AM IST

చెరువుగట్టులో కొబ్బరికాయల విక్రయ వేలం

NLG: నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామపంచాయతీ పరిధిలో కొబ్బరికాయల విక్రయానికి నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ వేలంలో పాట దక్కించుకున్న వారు ఏడాది పాటు విక్రయ హక్కులు పొందుతారని సర్పంచ్ నేతగాని కృష్ణ, కార్యదర్శి రవీందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనాలని వారు కోరారు.

March 5, 2026 / 10:02 AM IST

కూటమి నేతలకు కాపీ కొట్టడమే తెలుసు: మేకపాటి

AP: కాపీ కొట్టడం తప్ప కూటమి నాయకులు ఒరిజనల్‌గా ఏమీ చేయలేరని YCP నేత మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శించారు. సమగ్ర భూసర్వే, తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించారని.. ఈ సారి అలా జరగదని, YCP మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఆత్మకూరు(నెల్లూరు) అభివృద్ధి కోసం ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకుంటూ, YCP ప్రభుత్వం వచ్చేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు.

March 5, 2026 / 10:01 AM IST

దరఖాస్తు గడువు పొడిగింపు..

SRPT: మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బూర సైదయ్యగౌడ్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతిలో 100 సీట్లకు, ఏడు నుంచి పదవ తరగతి వరకు ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

March 5, 2026 / 10:01 AM IST

బీటీ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ క్లియరెన్స్

KMR: నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం నుంచి టేకులచెరువు తండా వరకు బీటీ రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. 0.8625 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపునకు అటవీ శాఖ క్లియరెన్స్ లభించింది. గతంలో అనుమతుల లేమితో నిలిచిన పనులు మళ్లీ ప్రారంభంకానున్నాయి. సుమారు రూ.2 కోట్ల నిధులతో రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తండా వాసుల దీర్ఘకాలిక కోరిక నెరవేరనుంది.

March 5, 2026 / 10:01 AM IST

వేట్లపాలెం పేలుడు ఘటనలో మరో ప్రాణం బలి

KKD: వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న ఎం.శ్రీను (30) గురువారం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. ఆసుపత్రికి వచ్చిన తొమ్మిది మందిలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మరో ఇద్దరు క్షతగాత్రులు ప్రస్తుతం GGHలో చికిత్స పొందుతున్నారు.

March 5, 2026 / 10:00 AM IST

కలెక్టర్ చొరవ.. వృద్ధురాలికి ఇల్లు

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పని తీరుపై ఓ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే ఒక అర్జీని కలెక్టర్‌కు ఇవ్వడంతో తన కుమారుడి నుంచి తన ఇంటిని తనకు ఇప్పించారని చెప్పారు. సమస్య పరిష్కరించిన కలెక్టర్‌ను వృద్ధురాలు రమాజ్యోతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని కలెక్టర్ చెప్పారు.

March 5, 2026 / 10:00 AM IST