WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు బాలామృతం, గుడ్లు సోమవారం పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి. ఆమె మాట్లాడుతూ.. పిల్లలను ప్రతిరోజూ అంగన్వాడికి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆశా వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా గాజుల లింగన్న గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జన్నారంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా లింగన్న గౌడ్, జాడి వెంకట్‌లను ఎన్నుకున్నారు. ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్న చిలువేరు నరసయ్యను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
AP: టీడీపీ MLA దామచర్ల వ్యాఖ్యలపై జనసేన నేత బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలి. కూటమిలో ఉన్నా కాబట్టే 16 నెలలుగా ఓపిక పట్టా. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను. సైలెంట్‌గా ఉన్న నన్ను రెచ్చగొట్టారు. దామచర్ల అవినీతి వ్యవహారాలన్నీ బయటపెడతా’ అని వెల్లడించారు.
ప్రకాశం: సీఎం చంద్రబాబు పాలనలోనే అంగన్వాడీ కార్యకర్తలకు రెట్టింపు గౌరవం, ఆర్థిక భద్రత లభించిందని మంత్రి స్వామి అన్నారు. చరిత్రలో తొలిసారి రెండు సార్లు అంగన్వాడీ వేతనాలను పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అంగన్వాడీలకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదని విమర్శించారు. అంగన్వాడీ టీచర్లపై పనిభారాన్ని తగ్గించే యాప్లను కుదించినట్లు తెలిపారు.
ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెం చేవూరు పాలెం సెంటర్లోని వేంచేసి ఉన్న శ్రీ వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంగళవారం మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి శ్రీ స్వామివారి దర్శనాన్ని నిలిపివేసి తిరిగి బుధవారం 8 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు.
KRNL: వెల్దుర్తిలో AITUC ఆధ్వర్యంలో, ఏపీఅంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మహా ధర్నాకు బయలుదేరుతున్న కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు నాగమద్దయ్య మాట్లాడుతూ, శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
KMM: కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం పథకాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ ఐతగాని వెంకటరమణ నాగేశ్వరరావు, వార్డు సభ్యులు పెండ్ర అంజయ్య, ఐతగాని నవీన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌తో కలిసి మెనూ ప్రకారం భోజనం, కూరలు ఉన్నాయా అని వాటిని పరిశీలించారు.
JGL: జిల్లాలో హోలీ పండుగను ప్రజలు సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇతర మతాల వారిని గౌరవిస్తూ, మతసామరస్యంతో హోలీ పండుగ జరుపుకోవాలన్నారు. హోలీ పండుగ వేళ ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామన్నారు.
KMM: బీజేపీ సీనియర్ నాయకులు, సత్తుపల్లి వాజ్ పేయిగా ప్రజల్లో ప్రసిద్ధి చెందిన చెక్క మధుసూదన్ రావు సోమవారం సత్తుపల్లిలో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావుతో సహా పార్టీ శ్రేణులు సంతాపం ప్రకటించారు. మధుసూదన్ రావు మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
T20 WCలో భాగంగా 5న భారత్-ఇంగ్లండ్ సెమీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. సెమీస్ పోరులో ఇరుజట్లు ఢీకొనడం ఇది వరుసగా మూడోసారి. 2022లో తొలిసారిగా జరిగిన పోరులో ఇంగ్లండ్ 10 వికెట్లతో భారత్‌ను చిత్తుచేయగా.. గత టోర్నీలో ప్రత్యర్థిని టీమిండియా 68 పరుగుల తేడాతో ఓడించింది. నాటి 2 టోర్నీల్లోనూ జట్లను రోహిత్-బట్లర్ నడిపించగా.. ఈ సారి సూర్య-బ్రూక్ బరిలోకి దిగారు.
AKP: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సమస్యలపై అర్జీలను తీసుకొని వాటిని పరిశీలించి అర్జీదారులతో మాట్లాడుతున్నారు. ప్రజల సమర్పించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.
అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ప్రభుత్వ సహకారంతో 50 మందికి పైగా మూగ, బధిర చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రపంచ శ్రవణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ చిన్నారులకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. ఖరీదైన ఈ సర్జరీలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
NLR: అల్లూరు మండలం పురిణి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ ఛైర్మన్ మర్రిబోయిన సురేంద్ర ప్రారంభించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ-పంట నమోదు చేసుకుని, ఈకేవైసీ పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని సూచించారు.
కోనసీమ: 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే కాలేజీలోకి అనుమతించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సోమవారం సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో 60% మంది యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బైక్ ఇచ్చే విషయంలో కఠినంగా ఉండాలన్నారు. కాలేజీలు ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ విధానాన్ని అమలు చేయాలన్నారు.
AP: రాయలసీమ హక్కుల పేరుతో ప్రజలను వైసీపీ మభ్యపెడుతోందని మంత్రి మండిపల్లి మండిపడ్డారు. జగన్ హయాంలో 102 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ చేశారని విమర్శించారు. 2014-19లో టీడీపీ రూ.12,441 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. వైసీపీ కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. చంద్రబాబు దృఢ సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.