• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

TG: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాన్యవర్ బట్టల షోరూమ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భవనంలో పనిచేస్తున్న సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 11:41 AM IST

ఫిబ్రవరి 28న ప్రజ్ఞ డీగ్రీ కళాశాలలో జాబ్ మేళా

E.G: బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాల భర్తీ కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 19 – 30 సం. వయస్సు గలవారు అర్హులన్నారు.

February 26, 2026 / 11:41 AM IST

కురిక్యాల పీఎసీఎస్ కార్యదర్శి సస్పెండ్

KNR: గంగాధర మండలం కురిక్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యదర్శి ప్రభాకర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, ఎరువుల కొనుగోలులో అవకతవకలు, రుణాల వసూలులో పాత ఓచర్ల డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. రామడుగు కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

February 26, 2026 / 11:40 AM IST

స్వామివారి సేవకులకు టీషర్ట్స్ పంపిణీ

SRPT: మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పింగళి ఉపేందర్, కందిబండ సురేష్ కలిసి లక్ష్మీనరసింహస్వామి సేవకులకు టీషర్ట్స్‌ను ఆలయ ఛైర్మన్ సారిక చిన్న రామయ్యతో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ మాట్లాడుతూ.. స్వామివారి సేవకులకు టీషర్ట్స్ అందజేసిన ఉపేందర్, సురేష్‌ను అభినందించినారు.

February 26, 2026 / 11:38 AM IST

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి కిట్లు పంపిణీ

కోనసీమ: ఆత్రేయపురం జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలో వార్షిక పరీక్షలు రాయనున్న నేపథ్యంలో క్షత్రియ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం పరీక్ష సామాగ్రి కిట్లను అందజేశారు. ఈ సామాగ్రిని అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు సంజీవ్ అందజేశారు. 

February 26, 2026 / 11:36 AM IST

రక్షణ చట్టం కోసం న్యాయవాదుల పాదయాత్ర

NRPT: ప్రభుత్వం రక్షణ చట్టం తేవాలని న్యాయవాదులు గురువారం నారాయణపేట జిల్లా కోర్టు నుంచి రాష్ట్ర సచివాలయం వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కాళేశ్వర్, మోహన్యాదవ్, మహేష్ యాదవ్, రాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ.. రేపటిలోగా న్యాయవాదుల చట్టం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.

February 26, 2026 / 11:36 AM IST

తెనాలిలో ఎడ్ల బలప్రదర్శన పోటీలకు భూమి పూజ

GNTR: తెనాలి మార్కెట్ యార్డులో మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బలప్రదర్శన పోటీలకు గురువారం భూమి పూజ నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను ప్రారంభించారు. పశుపోషకులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

February 26, 2026 / 11:36 AM IST

నెల్లూరుకు చేరుకున్న జగన్

AP: మాజీ సీఎం జగన్ నెల్లూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి ఫంక్షన్ హాల్ వరకూ అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమికూడారు. వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి కుమారుడి వివాహానికి ఆయన హాజరుకానున్నారు.

February 26, 2026 / 11:36 AM IST

ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: MLA

HYD: ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.

February 26, 2026 / 11:34 AM IST

‘సభ్యత్వ నమోదులో రాజమండ్రిని అగ్రగామిగా నిలపాలి’

E.G: జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో రాజమండ్రిని అగ్రగామిగా నిలపాలని రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం రాజమండ్రిలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదును యజ్ఞంలా నిర్వహించాలని అన్నారు.

February 26, 2026 / 11:34 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన..మాజీ MLA

BHPL: చిట్యాల(M) నవాబుపేట గ్రామానికి చెందిన PACS మాజీ డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సతీమణి రమ క్యాన్సర్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఈ రోజు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. BRS నేతలు ఉన్నారు.

February 26, 2026 / 11:33 AM IST

నెల్లూరు కార్పొరేషన్ మేయర్‌గా దేవరకొండ సుజాత

NLR: నెల్లూరు కార్పొరేషన్ మేయర్‌గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నిక గురువారం జరిగింది. దేవరకొండ సుజాత పేరును 40వ డివిజన్ కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. పోటీ లేకపోవడంతో 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను అధికారికంగా ప్రకటించారు.

February 26, 2026 / 11:33 AM IST

MP కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన OBC మోర్చా నేతలు

RR: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలో BJP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా OBC మోర్చా నాయకుడు బోయిని మహేష్ యాదవ్ MPకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 26, 2026 / 11:32 AM IST

మార్చి 1న స్టడీ సర్కిల్ హాల్ టికెట్ విడుదల

ఆదిలాబాద్ నలంద కళాశాలలో మార్చి 1న ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత కుమారి పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు. సమాచారం కోసం 9494149416 నంబర్‌కు సంప్రదించాలని వెల్లడించారు.

February 26, 2026 / 11:31 AM IST

కుమ్మెర ఘటన.. నేడు SP సంచలన ప్రెస్ మీట్

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, చిన్నారి మృతిపై జిల్లా SP సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతుండగా, నమోదైన కేసులు, అరెస్టయిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ సున్నితమైన అంశంపై ఆసక్తి నెలకొంది.

February 26, 2026 / 11:30 AM IST