• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12-12-2018న జరిగిన హత్య కేసులో నిందితుడు రామాపురం మల్లేశ్వర్ రావుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మృతుడు రామావత్ బాల (35)ను అక్రమ సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. శాస్త్రీయ ఆధారాలు, డీఎన్‌ఏ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు శిక్ష విధించినట్లు SP శరత్ చంద్ర పవార్ తెలిపారు.

March 3, 2026 / 03:37 PM IST

రేపు ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక

SKLM: టెక్కలి మండలం పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో 01.04.2024 నుంచి 31.03.2025 వరకు అమలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై బుధవారం సామాజిక తనిఖీల ప్రజా వేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం. రేణుక మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉ.10 కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

March 3, 2026 / 03:37 PM IST

‘2027 జనాభా లెక్కలు సమగ్రంగా నిర్వహించాలి’

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని కలజువ్వలపాడులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పాల్గొన్నారు. 2027 జనాభా లెక్కల సేకరణను ప్రభుత్వ నిబంధనల మేరకు సమగ్రంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సెన్సెస్ విభాగం అధికారులు జనాభా లెక్కలను డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు.

March 3, 2026 / 03:37 PM IST

ఆ లింకులతో జాగ్రత్త: శిఖా గోయల్

HYD: హోలీ వేళ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరే వలల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ప్రజలను హెచ్చరించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే ఉచిత బహుమతులు, భారీ డిస్కౌంట్ల వంటి నకిలీ లింకులు, ప్రమాదకరమైన (APK) ఫైళ్లను క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు. అలా చేస్తే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు.

March 3, 2026 / 03:35 PM IST

వేసవి తాగునీటి సమస్యపై సర్పంచ్ ఆవేదన

KRNL: పెద్దకడబూరు(మం) పీకలబెట్టలో ఎండాకాలంలో తాగునీటి సమస్య తీవ్రమైందని గ్రామ సర్పంచ్ లక్ష్మి మూకిరెడ్డి తెలిపారు. ఇవాళ ప్రజలకు సొంత నిధులతో తాగునీటి సౌకర్యాలు అందిస్తుంటే, MPDO, అధికారులు సహకారం అందించడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలంలో ప్రజల కష్టాలను పరిష్కరించడంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 03:35 PM IST

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం

W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం పోలీస్ స్టేషన్లో మంగళవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం, ఆరోగ్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని DSP రఘు వీర్ విష్ణు ప్రారంభించి, మాట్లాడుతూ.. పురుషులకు ధీటుగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో C.I. నాగరాజు, కనకరాజు, మురళీకృష్ణ, అల్లు శ్రీనివాస్, లాబ్ md.మురళీకృష్ణ పాల్గొన్నారు.

March 3, 2026 / 03:34 PM IST

తలకిందులుగా బోల్తాపడ్డ బొలెరో వాహనం

JNG: సింగరాజుపల్లి టోల్ గేట్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బియ్యం లోడుతో ఉన్న బొలెరో ట్రాలీ ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. దీంతో బొలెరో ట్రాలీ నడిరోడ్డుపై రోడ్డుకు అడ్డంగా పల్టీ కొట్టి తలక్రిందులుగా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలవగా.. స్థానికులు వారిని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 3, 2026 / 03:34 PM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన సర్పంచ్

SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ వెంకటరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచించారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటానన్నారు.

March 3, 2026 / 03:32 PM IST

జిల్లాకు 1,772 హెచ్‌పీవీ టీకాలు

NGKL: జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌కు 1,772 హెచ్‌పీవీ టీకా డోసులు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా, సివిల్ ఆసుపత్రుల్లో ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంగళవారం DMHO డాక్టర్ రవికుమార్ నాయక్ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

March 3, 2026 / 03:30 PM IST

‘రామచిలుక ఆకారంలో బీరకాయ’

MHBD: ఇనుగుర్తి గ్రామంలో ఎంజాల కుమారస్వామి అనే రైతు తమ సాగు చేస్తున్న కూరగాయల పంటలో కూరగాయలు తెంపుతుండగా, బీరకాయ సాగులో వినూత్నంగా రామచిలుక ఆకారంలో బీరకాయ కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. జెన్యూ మార్పిడి వల్ల కొన్ని సార్లు విత్తనాలు, చిన్న మార్పులు వస్తాయని పలువురు రైతులు పేర్కొన్నారు.

March 3, 2026 / 03:30 PM IST

మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూసివేత

MLG: ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా మంగపేట మండలం మల్లూరులో గల స్వయంభు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం స్వామి వారికి ఆరాధన, నివేదన చేసి (ద్వారా బంధనం) ఆలయ తలుపులు మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రెవెల్లి మహేష్ తెలిపారు. బుధవారం దేవాలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందన్నారు.

March 3, 2026 / 03:29 PM IST

దట్టమైన అడవుల్లో జింకలు..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అరణ్య ప్రాంతాల మార్గంలో ప్రయాణం చేస్తుంటే జింకల గుంపులు ప్రత్యక్షమై చెంగుచెంగున ఎగురుతూ వెళ్లేవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా జింకలు కనిపించడం లేదు. పోడు సాగు, చెట్ల నరికివేత, గుట్టలు పిండి చేయడంతో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి అవి దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయి స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని వన్యప్రాణి ప్రేమికులు పరిశోధించారు.

March 3, 2026 / 03:28 PM IST

సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏసీపీ

WGL: సంగెం (M) కేంద్రంలోని కాపుల కాన్పర్తి గ్రామంలో 16 నూతన సీసీ కెమెరాలను ఏసీపీ వెంకటేష్ ఇవాళ ప్రారంభించారు. గ్రామంలో భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను అరికట్టడం, ప్రజలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొంగతనాలు నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

March 3, 2026 / 03:26 PM IST

కోహ్లీ బ్యాటింగ్ నన్ను బాధిస్తుంది: రషీద్ ఖాన్

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలిపై ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ ఆటతీరు బౌలర్‌ను మానసికంగా దెబ్బతీస్తుంది. ఒక బ్యాటర్ బలాన్ని ఉపయోగించి స్లాగ్ షాట్‌తో సిక్స్ కొడితే నేను పెద్దగా పట్టించుకోను. కానీ, కోహ్లీలా టెక్నిక్‌తో గ్యాప్‌ల ద్వారా బంతిని బౌండరీకి పంపితే అది నన్ను బాధిస్తుంది’ అని పేర్కొన్నాడు.

March 3, 2026 / 03:26 PM IST

ఎస్పీ కార్యాలయంలో మహిళా ఎస్సైల నృత్యాలు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం రంగుల కేళితో పులకించిపోయింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో మహిళా ఎస్సైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజే పాటల హోరులో ఎస్పీతో కలిసి మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా స్టెప్పులేశారు. సంప్రదాయ పద్ధతిలో రంగులు పూసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

March 3, 2026 / 03:25 PM IST