• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించిన డీజీపీ

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసి అభివృద్ధి చేసిన పోలీస్ అతిథి గృహాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ శాఖ అధికారుల, అతిథుల వసతి సౌకర్యాలను మెరుగుపరచే దిశగా ఈ అతిథి గృహం పునర్నిర్మాణం చేపట్టినట్లు DGP తెలిపారు. CP సన్ ప్రీత్ సింగ్, తదితరులు ఉన్నారు.

March 1, 2026 / 06:26 PM IST

నర్సంపేటలో అక్రమ ఆర్థిక కార్యక్రమాలు..?

WGL: నర్సంపేట నియోజకవర్గంలో లక్కీ డ్రాలు, గొలుసుకట్టు పేరుతో అక్రమ ఆర్థిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అనుమతి లేకుండానే కొందరు నిర్వాహకులు ఆకర్షణీయ ప్రకటనలతో ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని ప్రజలను మోసగించి లాభం పొందుతున్నట్లు సమాచారం.

March 1, 2026 / 06:25 PM IST

అనుమానితుల వేలిముద్రల తనిఖీ

NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్లో అనుమానితుల వేలి ముద్రలను ప్రత్యేక పరికరంతో వేలిముద్రలను తనిఖీ చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వేలిముద్రలను తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా వస్తువులు, మనుషులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.

March 1, 2026 / 06:25 PM IST

శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

TG: నల్గొండలోని శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన రథోత్సవంలో గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ఏకమై వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

March 1, 2026 / 06:25 PM IST

‘మురికివాడల అభివృద్ధిని విస్మరిస్తే ఆందోళన తప్పదు’

కడప కార్పొరేషన్ కేవలం సంపన్నులకే సేవలు అందిస్తూ, బడుగు బలహీన వర్గాలను విస్మరిస్తోందని చేతివృత్తుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు N.పెంచలయ్య విమర్శించారు. ఆదివారం కడపలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మురికివాడల్లో కనీసం రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ తక్షణమే స్లమ్ ఏరియాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.

March 1, 2026 / 06:25 PM IST

‘కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి’

NRML: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఊట్ల కోటన్న, ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. కడెంలో వారు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా లేబర్ ఆఫీసర్ను రెగ్యులర్ అధికారిని నియమించాలని, కార్మికుల పెండింగ్ క్లైమ్‌లను వెంటనే సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 06:24 PM IST

‘రౌడీషీటర్లు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి’

KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని సీ.బెలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఎస్సై వేణుగోపాల్ రాజు నేర నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. నేర ప్రవృత్తిని విడనాడి, చట్టానికి లోబడి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

March 1, 2026 / 06:24 PM IST

సీజేఐ సూర్యకాంత్‌కు ఘన వీడ్కోలు

TPT: తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమైన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు ఘనంగా వీడ్కోలు లభించింది. కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శ్రీనివాస స్వామి కళ్యాణ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు, న్యాయమూర్తులు, అధికారులు హాజరయ్యారు.

March 1, 2026 / 06:24 PM IST

పేదలకు రంజాన్ ఈద్ కిట్లు

నంద్యాల పట్టణంలో జమీయత్ ఉలేమా హింద్, నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు 150 రంజాన్ ఈద్ కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై కిట్లు అందజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు అండగా నిలవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

March 1, 2026 / 06:22 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 11 మందిపై కేసులు నమోదు

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో పోలీసులు విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద DSP రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో భారీ వాహనాల డ్రైవర్లకు బ్రెతలైజర్ పరీక్షలు చేశారు. మొత్తం 3,150 మంది డ్రైవర్లను తనిఖీ చేయగా, 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.

March 1, 2026 / 06:21 PM IST

‘అంగన్వాడీ కార్యకర్తలకు బాసటగా కూటమి ప్రభుత్వం’

VZM: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరుఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎల్.కోటలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చరిత్రలోనే రెండుసార్లు అంగన్వాడీ కార్యకర్తలు వేతనాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబునాయుడుకు దక్కుతుందన్నారు.

March 1, 2026 / 06:21 PM IST

‘మెరుగైన వైద్యం అందించడమే కూటమి లక్ష్యం’

NDL: పేదలకు మెరుగైన వైద్యం అందించమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్య జయసూర్య అన్నారు. నేడు పాముల పాడు మండలం, బానుముక్కుల గ్రామంలో 40 లక్షలతో నిర్మించబోయే హెల్త్ సెంటర్‌కు MLA భూమి పూజ చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 06:21 PM IST

ఈ నెల 3న పుష్పగిరి ఆలయ వేళల్లో మార్పులు

KDP: వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 7.30 వరకు స్వామివారి దర్శనాలు ఉండవని ఈవో శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 7.30 తర్వాత ఆలయ శుద్ధి, విశేష అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.

March 1, 2026 / 06:19 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు క్రాస్ రోడ్ వద్ద సీఐ జనార్ధన్, ఎస్సై సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం మానుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

March 1, 2026 / 06:19 PM IST

‘అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

SKLM: అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ అంగన్వాడీలు చేసిన పలు డిమాండ్లలో తొమ్మిది డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.

March 1, 2026 / 06:18 PM IST