• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

T20 WC: రేపటి నుంచే ‘సూపర్-8’ పోరు

T20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ ముగిసింది. రేపటి నుంచి అసలైన సమరం ‘సూపర్-8’ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్-2లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్లు.. చెరో మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికీ సూపర్-8లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి.

February 20, 2026 / 11:25 PM IST

‘రాజకీయం కోసం శ్రీవారిని వివాదాల్లోకి లాగొద్దు’

AP: రాజకీయ పంతాల కోసం శ్రీవారిని వివాదాల్లోకి లాగవద్దని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తెలిపారు. హైందవ ధర్మాన్ని బజారుకీడ్చడం తగదని, లడ్డూ కల్తీ అంశంపై పదేపదే మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆయన పేర్కొన్నారు.

February 20, 2026 / 09:49 PM IST

ఎచ్చెర్లలో మెగా జాబ్ మేళా

SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయికుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 13 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 400 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 18–30 ఏళ్లు వయస్సు గల యువతీ యువకులు అర్హులు అని తెలిపారు.

February 20, 2026 / 09:44 PM IST

ఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల

TG: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి, రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించే అర్హ‌త ప‌రీక్ష ‘టీజీ ఎడ్-సెట్-2026’ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష నిర్వహిస్తారు.

February 20, 2026 / 09:42 PM IST

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 వినతులు

VSP: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో 20 వినతులు స్వీకరించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకరరావు తెలిపారు. ప్రధాన కార్యాలయంలో సీపీలతో కలిసి నిర్వహించిన ఫోరమ్‌లో భీమిలి–1, మధురవాడ–2, ఈస్ట్–2, సౌత్–3, నార్త్–6, పెందుర్తి–1, అగనంపూడి–1, గాజువాక–4 వినతులు వచ్చాయి. ప్రతి శుక్రవారం ఈ ఫోరమ్ నిర్వహించి ఫిర్యాదులను వేగంగా చర్యలు తీసుకుంటున...

February 20, 2026 / 09:42 PM IST

‘రూ.8 కోట్లతో శ్రీశైలం ఆలయ రోడ్ల విస్తరణ’

AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారులను విస్తరించనున్నామని MLA బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. సుండిపెంటలో రూ.8 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సున్నిపెంటలో రోడ్ల విస్తరణ మార్చి 15 లోపు పూర్తి చేస్తామన్నారు.

February 20, 2026 / 09:42 PM IST

పాఠశాలలో మాలిక వసతులు కల్పించాలి: కలెక్టర్

SRD: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రాలు, కస్తూర్బా పాఠశాలలో మరమత్తులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

February 20, 2026 / 09:42 PM IST

ఏఐ సమ్మిట్‌లో రాష్ట్ర వ్యవసాయ ప్రస్తావన: తుమ్మల

TG: రాష్ట్ర వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సాంకేతిక, డిజిటల్ మౌలిక వసతులపై ఏఐ సమ్మిట్‌లో ప్రస్తావన రావడం గర్వకారణమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించడంలో మన రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. శాటిలైట్ ద్వారా మట్టి పోషకాలను గుర్తించి, వాటిని ఏఐ మోడలింగ్ ద్వారా విశ్లేషించి పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిదన్నారు.

February 20, 2026 / 09:36 PM IST

‘అనుమతులు రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రకటన చేయాలి’

ASR: గిరిజన ప్రాంతంలో బాక్సైట్ అనుమతులు రద్దు చేస్తూ అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కే. లోకనాధం కోరారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పీ. అప్పలనర్స, నేతలు చిన్నయ్య పడాల్‌తో కలిసి జీకేవీధి మండలం బాక్సైట్ ప్రభావిత ప్రాంతం జర్రెలలో పర్యటించారు. గిరిజన హక్కులు, చట్టాలను ధిక్కరించడం ప్రభుత్వాలకు సరికాదని హితవు పలికారు.

February 20, 2026 / 09:36 PM IST

జిల్లాలో ‘శక్తి’ బృందాల విస్తృత అవగాహన

ATP: మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా జిల్లా ఎస్పీ పీ.జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం శక్తి బృందాలు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లాలోని విద్యా సంస్థలు, బస్టాండ్లు, కాలనీలలో మహిళలకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో ఎస్ఓఎస్ అలర్ట్ ద్వారా పోలీసుల సాయం ఎలా పొందాలో వివరించారు.

February 20, 2026 / 09:30 PM IST

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

కృష్ణా: కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యార్థులకు రోడ్డు భద్రత, పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది. ట్రాఫిక్ నియమాలు పాటించాలి, హెల్మెట్ తప్పనిసరి, ఓవర్‌స్పీడ్‌, ట్రిపుల్ రైడింగ్‌, మొబైల్‌తో వాహనం నడపడం మానుకోవాలని SI C. H. సురేష్ సూచించారు. అలాగే చిన్నారులపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు.

February 20, 2026 / 09:29 PM IST

BREAKING: ఆస్ట్రేలియా ‘విశ్వరూపం’

పసికూన ఒమన్‌పై ఆస్ట్రేలియా తన ప్రతాపాన్ని చూపింది. తొలుత ఒమన్‌ను 104 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఈ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 9.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ఓపెనర్లలో మార్ష్ (64*) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, హెడ్ 32 పరుగులతో రాణించాడు. ఇప్పటికే సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. విజయంతో తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగించింది.

February 20, 2026 / 11:26 PM IST

YCP అరాచకాలు మర్చిపోలేం: అనిత

AP: YCP పాలనలో జరిగిన అరాచకాలు మర్చిపోలేమని హోంమంత్రి అనిత అన్నారు. ‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అవమానించారు. పవన్‌ను రోడ్డుపై కూర్చోబెట్టారు, బయటకు రానివ్వలేదు. లోకేష్ పాదయాత్రను అడ్డుకుని దాడికి యత్నించారు. ప్రజావేదిక కూల్చి శకలాలు తీయకుండా సైకోయిజం చూపించారు. పోలీసు వ్యవస్థను శాంతిభద్రతల కోసం కాకుండా రాజకీయాల కోసం పనిచేసేలా మార్చివేశారు’ అని పేర్కొన్నారు.

February 20, 2026 / 09:26 PM IST

చైనాలో ట్రంప్ పర్యటన ఖరారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను వైట్‌హౌస్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.

February 20, 2026 / 09:25 PM IST

పన్నుల వసూళ్ల ప్రక్రియను పరిశీలించిన డివిజన్ అధికారి

కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను గుడివాడ డివిజనల్ పంచాయతీ అధికారి జి. సంపత్ కుమారి శుక్రవారం పర్యవేక్షించారు. గ్రామంలో జరుగుతున్న ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను ఆమె పరిశీలించి, వసూళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పన్నుల వసూళ్లను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు అందించారు.

February 20, 2026 / 09:23 PM IST