• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నల్గొండలో రిటైర్డ్ హోంగార్డు మృతి

నల్గొండకి చెందిన రిటైర్డ్ హోంగార్డు వెంకటేశ్వర్లు(60) గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. వెంకటేశ్వర్లు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పోలీస్ అధికారులు కుటుంబాన్ని పరామర్శించారు.

March 4, 2026 / 01:30 PM IST

ఇంటర్ పరీక్షకు ముగ్గురు గైర్హాజరు

NZB: ధర్పల్లిలోని ఇంటర్ ద్వితీయ సంవత్సరం, మ్యాథమెటిక్స్, బాటని, సివిక్స్ పరీక్షలకు బుధవారం 290 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 287 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీనాథ్ తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారన్నారు.

March 4, 2026 / 01:30 PM IST

MNJ క్యాన్సర్ హాస్పిటల్లో 4వ రోజు ధర్నా

HYD: MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో నాల్గో రోజు వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. నిమ్స్ నుంచి డైరెక్టర్‌ను రిక్రూట్ చేయడంపై నాలుగు రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. MNJ నుంచే డైరెక్టర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్‌ను వెనక్కి తీసుకోకుంటే సహాయ నిరాకరణ చేస్తామని తెలిపారు. నిరసనకు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది.

March 4, 2026 / 01:29 PM IST

‘ఆర్&బి శాఖ నుంచి రూ.240 లక్షల నిధులు మంజూరు’

NTR: నందిగామ నియోజకవర్గానికి ఆర్&బి శాఖ నుంచి రూ.240 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రకటనలో తెలిపారు. రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీని ద్వారా వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు మరింత పురోగతి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

March 4, 2026 / 01:26 PM IST

ఇంటర్ పరీక్షకు 199 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షకు 199 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,796 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,597 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేదన్నారు.

March 4, 2026 / 01:26 PM IST

కర్నూలు ఎంపీని కలిసిన డీఈవో సుధాకర్

కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ కర్నూలు నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజును మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత, విద్యా నాణ్యత మెరుగుదలపై వారు చర్చించారు.

March 4, 2026 / 01:25 PM IST

రెవెన్యూ అంశాలపై సచివాలయం నుంచి సమీక్ష

TPT: ఏపీ సచివాలయం నుంచి రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్, మ్యుటేషన్, రిసర్వే, పీపీబి పంపిణీ అంశాలపై సీసీఎల్‌ఏ చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మితో కలిసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి నుంచి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సహా అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

March 4, 2026 / 01:24 PM IST

సూర్య కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

RJ బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న మూవీ ‘కరుప్పు’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. 2026 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.

March 4, 2026 / 01:24 PM IST

రోడ్ల మరమ్మతులకు రూ.58.05 కోట్ల నిధులు మంజూరు

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 70 రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.58.05 కోట్ల నిధులు మంజూరు చేసింది. అధికారులు పంపిన అంచనాల మేరకు ఆర్థిక అనుమతులు లభించాయి. ఇందులో అనంతపురం డివిజన్ పరిధిలో 31 రోడ్లు, ధర్మవరం డివిజన్ పరిధిలో 39 రోడ్లకు మరమ్మతులు చేయనున్నారు. ముఖ్యంగా గుంతలమయంగా మారిన గుత్తి-పత్తికొండ రహదారికి మోక్షం లభించనుంది.

March 4, 2026 / 01:23 PM IST

హోలీ వేడుకలో పాల్గొన్న నియోజకవర్గం బీజేపీ ఇంఛార్జ్

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మసీద్ బండ కార్యాలయంలో మియాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల బీజేపీ నాయకులు , మసీద్ బండ గ్రామ మహిళలు, జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి శేర్‌లింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఇంఛార్జ్ రవికుమార్ యాదవ్ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

March 4, 2026 / 01:22 PM IST

నడిగూడెంలో పరీక్షకు ఇద్దరు ఇంటర్ విద్యార్థులు డుమ్మా

SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు ఇద్దరు విద్యార్థులు హాజరుకాలేదు. పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్ విజయ నాయక్ పర్యవేక్షించారు. ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

March 4, 2026 / 01:22 PM IST

IND vs ENG: జాక్స్ ఒక్కడేనా? ఆ ఇద్దరూ ప్రమాదమే!

రేపటి T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్రదర్శన కీలకం కానుంది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల అతణ్ని బ్యాటింగ్, బౌలింగ్‌లో కట్టడి చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. అయితే కెప్టెన్ బ్రూక్, బట్లర్ వికెట్లు కూడా కీలకమే. ఇప్పటికే బ్రూక్ అదరగొడుతుండగా.. ఫామ్‌లో లేడని బట్లర్‌ని ఏ మాత్రం లైట్ తీసుకున్నా బౌలర్లందరికీ చుక్కలు కనబడటం ఖాయం.

March 4, 2026 / 01:22 PM IST

తాళాలు పగలగొట్టి చోరీ.. 30 వేలు నగదు మాయం

కోనసీమ: ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన కందుల రాజ్యలక్ష్మి, రమేశ్ దంపతుల కిరాణా షాపులో బుధవారం భారీ చోరీ జరిగింది. పాత సినిమా హాల్ సెంటర్లోని షాపు తాళాలు పగలగొట్టిన దుండగులు సుమారు రూ. 30 వేల నగదును అపహరించారు. ఉదయం పనిమనిషి గమనించి సమాచారం అందించడంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

March 4, 2026 / 01:21 PM IST

ధర్మారంలో ఇంటర్ పరీక్షకు 9 మంది గైర్హాజరు

PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 9 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అధికారులు తెలిపారు. రెండు కేంద్రాలలో మొత్తం 496 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 487 మంది హాజరయ్యారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు.

March 4, 2026 / 01:21 PM IST

అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం

AP: అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఎందుకు ఉండరని అధికారులను ప్రశ్నించారు. ఇదే విషయంలో సభలో ఛైర్మన్ కూడా ప్రస్తావించారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులందరికీ సీఎస్ ఆదేశాలు పంపారని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాలు, బిల్లుల సమయంలో అధికారులు అందుబాటులో ఉండాలన్న ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.

March 4, 2026 / 01:20 PM IST