ELR: జిలుగుమిల్లిలో ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి చిట్టి బొమ్మ కొండలరావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలు అమలు చేయాలని కోరారు. సహజంగా చనిపోయిన కార్మికులకు రూ.60 వేలు ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు. ఈ ఆర్థిక సహాయం మరింత పెంచాలని కోరారు.
ATP: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై ఏపీ విభిన్న ప్రతిభావంతుల సంస్థ ఛైర్మన్ గడుపూటి నారాయణస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ అనంతపురంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం తమ జీవితాల్లో వెలుగు నింపిందని ఛైర్మన్ పేర్కొన్నారు.
కర్నూలు: రాష్ట్ర డీజీపీ హారీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను ప్రారంభించామని కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు. మార్చి 8వ తేదిన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వారోత్సవాలను ప్రారంభించామన్నారు.
KMR: బీర్కూరు మున్నూరు కాపు సంఘ భవనంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ.. ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మిన్న అని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు సామాజిక సేవలో ముందుండటం అభినందనీయమని కొనియాడారు.
HNK: వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక విజన్‌తో ముందుకు వెళ్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ వివేక్ నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల గౌరవం పెంచే విధంగా పనిచేస్తునని తెలిపారు. గతంలో పోలీస్ అధికారిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నానన్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ‘ఫిల్మ్ సిటీ’కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ దాదాపు 500 ఎకరాల్లో హాలీవుడ్ హంగులతో దీని నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ వస్తే పర్యాటకం, ఉపాధి పెరగడమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ సినిమా షూటింగ్‌లకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
NZB: బోధన్ పట్టణంలోని 15వ వార్డులో హోలీ పండుగ పురస్కరించుకొని కుస్తీ పోటీలకు రంగం సిద్ధమైందని కౌన్సిలర్ అశోక్ రెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రసిద్ధ మల్లయోధులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
NGKL: కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ క్యాంపు కార్యాలయంలో తిమ్మాజీపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు ఆదివారం చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
NLG: నల్గొండలో న్యాయవాద పరిషత్తు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు జాతీయ అధ్యక్షులు విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. న్యాయవాదులు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని, యువ న్యాయవాదులు నిరంతరం అధ్యయనం చేస్తూ సేవాభావం పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
MLG: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ పేదవారి కలలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని SLN గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
KRNL: కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో అక్షిత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అభయఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ మహా రాజ్య శ్యామలదేవి హోమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆలూరు ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివ ప్రసాద్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం SC వర్గీకరణ పోరులో ప్రాణాలర్పించిన అమరవీరులకు MRPS నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా MRPS మండల అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నాటి నుంచి కొనసాగిన ఉద్యమం సాధించిన ఫలితాలను గుర్తుచేశారు.
WNP: రాజాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని కదిరేపాడులో నూతన విద్యుత్ ఫీడర్‌ను సర్పంచ్ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఇంతకుముందు పలు తండాలు, గ్రామాలకు ఒకే ఫీడర్ ఉండటంతో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తేవని తెలిపారు. కొత్త ఫీడర్‌తో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించి సాగులో ఇబ్బందులు తగ్గుతాయని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై పడింది. దీంతో విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనపై పీవీ సింధు పోస్టు చేసింది. తాము బస చేస్తున్న ప్రాంతానికి సమీపంలో పేలుడు జరిగిందని, దీంతో వెంటనే అక్కడినుంచి పారిపోయామని తెలిపింది. భయానక పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది.
PLD: వినుకొండలో ఆదివారం శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.