KDP: ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె సమీపంలో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అధికారుల బృందం రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బద్వేల్ నుంచి జమ్మలమడుగుకు ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తుండగా విజిలెన్స్ బృందం పట్టుకుని స్థానిక రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమారు 120 బియ్యం బస్తాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
MLG: డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై విధించిన 25% ఫెనాల్టీ, 12% వడ్డీని వెంటనే ఎత్తివేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులకు కోట్ల రూపాయల పునరావాసం ఇస్తున్న ప్రభుత్వం.. రైస్ మిల్లర్లపై కనికరం చూపకపోవడం దారుణమని మండిపడ్డారు.
NRPT: మాగనూరు మండలంలోని అచ్చంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్‌తో యువ రైతు చెందాడు. గ్రామానికి చెందిన దేవప్ప(32) తన వ్యవసాయ పొలంలో స్టార్టర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి మరణించాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఉదయం పొలం దగ్గరికి వెళ్లి చూడగా విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లు గుర్తించారు.
ELR: జిల్లాలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, బిల్లుల అప్లోడ్ ప్రక్రియను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీ పథకం మారనున్న నేపథ్యంలో, పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు.
KRNL: జిల్లా చెందిన పవనకుమార్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 297వ ర్యాంకు సాధించారు. గతేడాది 375వ ర్యాంకుతో IRSకు ఎంపికైన ఆయన, IAS సాధనే లక్ష్యంగా ఢిల్లీలో శిక్షణ పొందారు. నిన్న విడుదలైన ఫలితాల్లో 297 ర్యాంకుతో సత్తా చాటారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పవన్ తెలిపారు. మరోసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ATP: 31వ వార్డు మస్తాన్‌పేట ఏరియాలో నిలిచిపోయిన మురుగునీటి సమస్యను శనివారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను గమనించి, వెంటనే JCB ద్వారా పూడిక తీయించి డ్రైనేజీ సాఫీగా వెళ్లేలా చూడాలని వార్డు సెక్రటరీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
హనుమకొండ నగరంలోని రాంపూర్ డంప్ యార్డ్‌లో శుక్రవారం సాయంత్రం మంటలు అంటుకున్నాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న బల్దియా డీఆర్ఎఫ్, శానిటేషన్ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి మంటలను వేగంగా అదుపులోకి తీసుకున్నారు. వాటర్ ట్యాంకర్లు, సంప్‌ల ద్వారా నీటిని స్ప్రే చేసి, బయో ఎర్తింగ్ మెటీరియల్‌ను పొరలుగా మార్చి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.
E.G: దేవరపల్లి-పల్లంట్ల రహదారి పారిశుద్ధ్య లోపంతో డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. సమీపంలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం రాకపోకలు సాగించే దారిలో చెత్త పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
RR: షాద్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 9న జాతీయ అప్రెంటీస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఈ మేళా ద్వారా ITI ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే మేళాకు ఆసక్తి కలిగిన ITI పాసైన విద్యార్థులు హాజరుకావాలన్నారు.
రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘దురంధర్ 2’ ఈనెల 19న విడుదల కానుంది. దాదాపు 4 గంటల నిడివి గల ఈ సినిమా కోసం ఈనెల 18 సాయంత్రం 5 నుంచే పెయిడ్ ప్రివ్యూస్ నిర్వహించాలని జియో స్టూడియోస్ నిర్ణయించింది. షోల సంఖ్య పరిమితంగా ఉన్నందున, ముందుగానే పాజిటివ్ టాక్ తెచ్చి సినిమాకు బూస్ట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అన్నమయ్య: నీలకంటరావుపేట నుంచి రామపురం వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పాడవడంతో ప్రజా రవాణా నిలిచిపోయింది. ఇదే అదునుగా భారీ వాహనాలు కంకరతో యథేచ్ఛగా వెళ్తుండటంతో భారీగా దుమ్ము రేగుతోందని వారు తెలిపారు. దీనివల్ల ఇళ్లన్నీ ధూళితో నిండిపోయి శ్వాసకోస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
NLG: మహిళలు చదువుతో పాటు ముఖ్యంగా విద్యాశాఖలో వీరి కృషి ఆదర్శనీయం. అటు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఇటు వృత్తిలోనూ ప్రతిభ చాటుతున్నారు. చిట్యాల మండలంలోని 37 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 196 మంది ఉపాధ్యాయులు ఉండగా, వారిలో ఆరుగురు నాన్ టీచింగ్ వారితో సహ 96 మంది మహిళలే కావడం విశేషం. 13 మంది హెచ్ఎంలుగా, ఒకరు పీఈటీగా కొనసాగుతున్నారు.
ASR: గంజాయి సాగు, రవాణా, నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలని జీకేవీధి మండలం సీలేరు ఎస్సై ఎండీ.యాసిన్ ప్రజలకు సూచించారు. ఇవాళ లైకంపూర్, చింతూరుపల్లిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. అనంతరం స్థానికులతో సమావేశమయ్యి, అనుమానిత వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు
WGL: NPDCL పరిధిలో పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర సరఫరా కొనసాగించడానికి సంస్థ అహర్నిశలు కృషి చేస్తోందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెలలో 6,441 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదైనప్పటికీ ఎక్కడా అంతరాయం లేకుండా సరఫరా చేశామన్నారు. 70.23 లక్షల సర్వీసులకు పంపిణీ వ్యవస్థ ద్వారా సేవలందిస్తున్నామన్నారు.
NZB: ఆర్మూర్ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమం తొలి రోజే వివాదాస్పదమైంది. ఎన్నికైన మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలతో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ప్రతిజ్ఞ చేయించారు. మహిళా సాధికారత అంటూ ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ‘పతుల పాలన’ సాగుతోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి.