SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు ఆలయ ఈవో రంగాచారి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ శర్మ, కృష్ణమాచార్యులు, సుధాకర్ పాల్గొన్నారు.
ADB: లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5న నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని గంగాధర్ కోరారు. సిరికొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1976 ఓటర్ లిస్టు ప్రకారం లంబాడీలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. అలాగే టీటీడీని లంబాడీలకు అప్పగించి బతుకమ్మ చీరల స్థానంలో ఘూగ్రో కచోళి ఇవ్వాలన్నారు.
GNTR: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సోమవారం జరిగిన జీఎంసీ సమీక్షలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. నార్ల ఆడిటోరియం పనులు మార్చి 16న ప్రారంభమవుతాయని, డ్రెయిన్లలో పూడికతీత పనులు మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ముస్లింల కోసం ఖబరస్థాన్ స్థల కేటాయింపు, వీధి కుక్కల నియంత్రణ, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆదేశించారు.
NGKL: జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై ఏళ్లుగా పని చేస్తూ, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని, పలు అంశాల గురించి వివరించినట్లు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా నీటి యాజమాన్య సంస్థ రూపొందించిన వికసిత్ భారత్ జీరాంజీ ఉపాధి హామీ గోడ పత్రికలను కలెక్టర్ బాలాజీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరాంజీ పథకం 2026-2027 ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల్లో జల జీవన్ మిషన్ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ నిధుల మంజూరుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రూ.90 కోట్లకు పైగా వ్యయంతో జరుగుతున్న ఈ పనుల ద్వారా 50 గ్రామాలకు తాగునీరు అందుతుందని వివరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ నుంచి సెవెన్ రోడ్స్ వరకు జరిగిన ర్యాలీని SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.
W.G: భీమవరం చినరంగనిపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పరీక్షలను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాల్ టిక్కెట్లు, సీటింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలు నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
GDWL: రంజాన్, హోలీ పండుగలు ఒకే సమయంలో వస్తున్న తరుణంలో ప్రజలందరూ ఐక్యతతో, సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలి అని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కులమత బేధాలు అతీతంగా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై నిఘా ఉంచామని, ప్రజల రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు.
NRML: సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామానికి చెందిన అంధుడు కాసారం రాజేశ్వర్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాడు. మెరిట్ ఉన్నప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 2015 నుంచి హెల్త్ వర్కర్, అటెండర్‌గా పనిచేసినా వయోపరిమితి పేరుతో తొలగించారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరాడు.
కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు హోలి పండుగ సెలవును మార్చినట్లు డీఈవో సుధాకర్ సోమవారం తెలిపారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 4న ఉన్న సెలవును 3కి మార్చినట్లు పేర్కొన్నారు. 3న సెలవు, 4న 10వ తరగతి గ్రాండ్ టెస్ట్, 9వ తరగతి SA-2 పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.
HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కు మడికొండ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మడికొండలోని డంపింగ్ యార్డులో నిరంతరం చెత్త కాల్చడంతో వెలువడే దట్టమైన పొగ గ్రామమంతా కలుషితమై గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నట్లు బాధితులు తెలిపారు. యార్డును తక్షణమే తరలించాలని కలెక్టర్‌ను కోరారు.
VSP: మురళీనగర్‌లోని బొత్స కన్వెన్షన్‌లో 15వ ఏపీ రాష్ట్ర వడోకై కరాటే ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వైసీపీ పార్టీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి హాజరయ్యారు. ఈ వేడుకలో సినీ నటుడు సుమన్ తల్వార్, బీజేపీ నాయకుడు బొత్చా సురేష్ కుమార్ పాల్గొన్నారు.
KMR: వారం రోజుల క్రితం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను సోమవారం కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. తమ నేతలను కాపాడుకోవడమే కాకుండా తమ స్వార్థ జీవితాన్ని వదిలి సమాజహితంలో భాగంగా జైలుకు వెళ్లిరావడం అభినందనీయమేనని కేంద్ర మంత్రి అన్నారు.
TPT: మార్చి 03 నుంచి 05 వరకు తిరుపతి-తిరుమలలో ఎన్‌ఎస్‌జీ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. మార్చి 03న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, 04-05 తేదీలలో తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో డ్రిల్ జరుగుతుంది. ఇది కేవలం భద్రతా సాధన కార్యక్రమమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.