• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే చాలు

నానబెట్టిన గుప్పెడు పల్లీలు, ఒక అరటిపండు, కప్పు పాలు, తేనే కలిపి జ్యూస్‌లా తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పల్లీలను నానబెట్టడం వల్ల అవి సులభంగా జీర్ణమై, శరీరానికి ప్రోటీన్‌ను అందిస్తాయి. అరటిపండులోని పొటాషియం, పాలలోని కాల్షియం కండరాలు, ఎముకలను దృఢంగా మారుస్తాయి. డైరీ పాలకు బదులు కొబ్బరిపాలు వాడటం వల్ల శరీరం చలువ చేయడంతో పాటు మరింత పోషకాలు అందుతాయి.

March 3, 2026 / 07:27 AM IST

రాత్రి నుంచి శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం

TPT: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 75,174 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 17,734 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.4.29 కోట్లుగా నమోదైంది. ఇక ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా రాత్రి 8:30 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభమవుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు.

March 3, 2026 / 07:25 AM IST

నేడు చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత

ATP: చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు నేడు మూతపడనున్నాయి. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి, కసాపురం ఆంజనేయ స్వామి, కదిరి లక్ష్మీ నరసింహ స్వామి తదితర ఆలయాల ద్వారాలను గ్రహణ కాలంలో తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అర్చకులు ప్రకటించారు. గ్రహణం ముగిసిన తర్వాత శాంతి పూజలు, సంప్రోక్షణ అనంతరం తిరిగి భక్తులకు దర్శనం కల్పించననున్నట్లు వెల్లడించారు.

March 3, 2026 / 07:25 AM IST

అక్రమంగా పశువుల తరలింపు ఇద్దరి అరెస్ట్

SKLM: కంచిలి నుంచి విశాఖపట్నానికి ఆరు పశువులను వ్యానులో తరలిస్తుండగా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు సీఐ రామకృష్ణ నిన్న తెలిపారు. పశువుల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. పశువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

March 3, 2026 / 07:23 AM IST

చంబడి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

TPT: పెళ్లకూరు మండలంలోని చంబడి పాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు పక్కన వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్పాట్లో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనం వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

March 3, 2026 / 07:23 AM IST

ఈనెల 5న ప్రొద్దుటూరుకు YS జగన్

KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఈనెల 5న జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ CM YS జగన్ గురువారం ప్రొద్దుటూరు రానున్నారు. ఆయన బెంగుళూరు నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు వస్తున్నారు. ఈ మేరకు జగన్ పీఏ నాగేశ్వరరావు రెడ్డి ప్రొద్దుటూరు పర్యటన వివరాలను అధికారికంగా విడుదల చేశారు.

March 3, 2026 / 07:22 AM IST

‘సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి’

ASR: జిల్లాలోని ప్రాథమిక రంగాల ఆర్థిక పురోగతి, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అధికారులతో వీసీ నిర్వహించారు. ఆర్థిక పనితీరు సాధనలో వెనుకబడిన శాఖలు దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు శాఖలు లక్ష్యాలు నిర్ధేశించుకోవాలన్నారు.

March 3, 2026 / 07:22 AM IST

తలమడుగులో పర్యటించిన MP

ADB: తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ సోమవారం పర్యటించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి జక్కుల సదాశివ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నగేశ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమణ, చంద్రకాంత్, నారాయణ, వామన్ పటేల్, సదానందం తదితరులున్నారు.

March 3, 2026 / 07:22 AM IST

వృథాగా నీరు.. శివారు రైతులకు కన్నీరు..!

నెల్లూరు: వరికుంటపాడు మండలంలో గండిపాలెం జలాశయం అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. కాల్వల్లో పూడిక, కంపచెట్లు, ఆక్రమణలు తొలగించకుండానే నీరు విడుదల చేయడంతో 11 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. నీరంతా వృథాగా పోతుండగా, చివరి ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పడం లేదు. వెంటనే కాల్వలు శుభ్రం చేసి సాగునీరు అందించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.

March 3, 2026 / 07:20 AM IST

పోస్ట్ ఆఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: BPM

BHPL: గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ బొజ్జం మమత-సురేష్ ఆధ్వర్యంలో BPM నాగేశ్వరి గ్రామ ప్రజలకు పోస్ట్ ఆఫీస్ పథకాలను వివరించారు. నాగేశ్వరి మాట్లాడుతూ.. గ్రామస్తులు పోస్ట్ ఆఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక భద్రతకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కరోబార్ పవన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

March 3, 2026 / 07:20 AM IST

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

KMM: ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్, డీపీవోకు సోమవారం సర్పంచ్ పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సింగరేణి గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలని స్వయంగా కలెక్టర్కు వారు వివరించారు. అలాగే ఇతర సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

March 3, 2026 / 07:18 AM IST

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మూసివేత

MBNR: అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నేడు జరిగే చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9 గంటల నుంచి సాధారణ పూజలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు దీనిని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

March 3, 2026 / 07:17 AM IST

విజయ్ చుట్టూ ’27’ గండం!

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‌ను ’27’ నంబర్ సెంటిమెంట్ కలవరపెడుతోంది. గతేడాది SEP 27న కరూర్ తొక్కిసలాట, OCT 27న బాధితుల పరామర్శ, DEC 27న సినిమా ఆడియో లాంచ్ వివాదం.. ఇలా అన్నీ 27వ తేదీనే జరిగాయి. తాజాగా FEB 27న భార్య సంగీత 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ విడాకుల పిటిషన్ వేయడం సంచలనమైంది. MAR 27న కోర్టులో ఏం జరగనుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

March 3, 2026 / 07:17 AM IST

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హోలీ విషెస్

AP: హోలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అంటే ప్రజల్లో సోదరభావం, సద్భావనను బలోపేతం చేస్తుందని అన్నారు. సమాజంలో శాంతి, శ్రేయస్సును పెంపొందించే ఉత్సాహభరితమైన పండగ అని పేర్కొన్నారు. ఈ పండగరోజు రంగులు చల్లుకోవటం ద్వారా జాతీయ సమైక్యతపై మన నమ్మకం, విశ్వాసం బలోపేతం అవుతుందని చెప్పారు.

March 3, 2026 / 07:15 AM IST

‘సోలార్ ప్యానెల్స్‌కు దరఖాస్తు చేసుకోండి’

KMM: ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమవారం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పీఎం సూర్య ఘర్ పోస్టర్‌ను ఆవిష్కరించి, విద్యుత్ ఆదా కోసం ప్రజలు pmsuryaghar.gov.in ద్వారా సోలార్ ప్యానెల్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

March 3, 2026 / 07:13 AM IST