PLD: రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌ను రూరల్ సీఐ సుబ్బారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం నిఘా ఉంచాలని ఎస్సై లోకేశ్వరరావును ఆదేశించారు.
AKP: గొలుగొండ మండలం సాలికమల్లవరం పంచాయతీ పొగచెట్లపాలెం రెవెన్యూ గ్రామంలో భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. తహసీల్దార్ కాకర నూకరాజు ఆదేశాల మేరకు ఈ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని సర్వే డీటీజీ కొండబాబు, వీఆర్వో పడాల్ తెలిపారు. అనంతరం పాసుపుస్తకాల ఉపయోగాలను రైతులకు వివరించారు.
CTR: బాల్యవివాహలను అరికట్టడంలో అందరు భాగస్వామ్యలు కావాలని ఐసీడీఎస్ పర్యవేక్షకులు శ్యామల పేర్కొన్నారు. గురువారం విజయపురం(మం) శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు బాల్యవివాహాలు అంశంపైన అవగాహనా శిబిరం నిర్వహించారు. బాల్యంలోనే వివాహం చేసుకున్న అమ్మాయిలకు ఉజ్వల భవిష్యత్తు ఉండదని పర్యవేక్షకులు లక్ష్మి చెప్పుకొచ్చారు.
MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో గురువారం రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు చర్చ గోష్టి నిర్వహించారు. రైతులు ప్రస్తుత వ్యవసాయంలో గమనిస్తున్న చీడ పీడల గురించి తెలుపగా శాస్త్రవేత్తలు, అధికారులు యాజమాన్యం పద్ధతులు వివరించారు. DAO సురేఖ మాట్లాడుతూ.. రైతులు సాగులో మెలకువలపై కేవీకే శాస్త్రవేత్తలను, అధికారులను సంప్రదించాలన్నారు.
BDK: గ్రామ స్థాయిలో చేపట్టవలసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై ఎంపీడీవో శ్రీనివాసరావు చర్చించారు. అశ్వాపురం మండల రైతు వేదికలో గురువారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యచరణపై ఎంపీడీవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు పలు సూచనలు చేశారు.
NZB: చందూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్ పథకం క్రింద మంజూరైన వ్యవసాయ యంత్రాంలను సర్పంచ్ మద్దూరి మాధవ రెడ్డి అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు .
సౌతాఫ్రికాతో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ స్పందిస్తూ.. ఫిన్ అలెన్ అద్భుతం చేశాడని ప్రశంసించాడు. ‘సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చునేలా చేస్తాయి.. అయితే ఫిన్ మనం సర్దుకుని కూర్చునేలోపే మ్యాచ్ పూర్తిచేశాడు’ అని పేర్కొన్నాడు.
పార్వతీపురం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను జిల్లా సంయుక్త కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
హీరో నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. నాగచైతన్య వేదికపైకి వచ్చి తన కోసం కేటాయించిన సీటులో కూర్చోగానే, ఆ కుర్చీ వెనక భాగం ఒక్కసారిగా విరిగిపోయింది. ఊహించని విధంగా కుర్చీ బ్యాలెన్స్ తప్పడంతో చైతన్య వెనక్కి పడిపోయారు. పక్కనే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ని పట్టుకున్నారు.
హీరో నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. నాగచైతన్య వేదికపైకి వచ్చి తన కోసం కేటాయించిన సీటులో కూర్చోగానే, ఆ కుర్చీ వెనక భాగం ఒక్కసారిగా విరిగిపోయింది. ఊహించని విధంగా కుర్చీ బ్యాలెన్స్ తప్పడంతో చైతన్య వెనక్కి పడిపోయాడు. పక్కనే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ని పట్టుకున్నాడు.
AP: తిరుమల లడ్డూ అంశంపై మండలిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టీటీడీ విషయంలో వైసీపీ నేతలు మహాపాపం చేశారు. కల్తీ నెయ్యి కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడ్డారు. సీబీఐ ఛార్జిషీట్‌లో 36 మందిని నిందితులుగా చేర్చారు. హిందూమత విధ్యంసానికి కుట్ర చేశారు’ అని ఆయన ఆరోపించారు.
WNP: పదో తరగతి విద్యార్థులు గణితంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకుండా మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ వనపర్తి గర్ల్స్ హైస్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించారు.
KDP: మైదుకూరు చెందిన మారుతి కుమారుడు మహిధర్ (25) అదృశ్యమైనట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల కిందట పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఎంతకు రాకపోవడం, బంధువులు దగ్గర లేకపోవడంతో తండ్రి మారుతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మంగారిమఠంలో సంచారం చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
HNK: ఐనవోలు మండలం నందనం గ్రామంలో నాబార్డ్ సహకారంతో నందనం సొసైటీ ఆధ్వర్యంలో రైతుల కోసం డ్రోన్ సేవలను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా పంటలకు ఎరువులు, పురుగు మందులు సమర్థంగా పిచికారీ చేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గడం, సమయం ఆదా కావడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
TPT: జిల్లా స్థాయి సెన్సస్ శిక్షణ కార్యక్రమంలో మూడవ రోజు సెన్సస్ ప్రాముఖ్యత, ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా లెక్కించే అవసరం, డిజిటల్ విధానం, కుల సెన్సస్‌పై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర జనగణన కార్యకలాపాల డైరెక్టర్, పౌర నమోదు డైరెక్టర్ జే. నివాస్, కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గోన్నారు.