• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

VIDEO: విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఏడీఏ

ELR: ఉంగుటూరు దళితపేటలో దీర్ఘకాలికంగా విద్యుత్ సమస్య తీర్చమని విద్యుత్ శాఖ ఏడీఏ రాళ్లపల్లి భీమేశ్వరరావు అన్నారు. ఉంగుటూరులో ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఎన్నో సంవత్సరం నుంచి ఉన్న సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ సింధు ఏఈ శ్రీరామ్, లైన్‌మెన్ నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

March 5, 2026 / 09:58 AM IST

ఘనంగా జిట్టా వెంకటరమణ జన్మదిన వేడుకలు

అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన పెద్దమండెం మండల టీడీపీ అధ్యక్షుడు జిట్టా వెంకటరమణ జన్మదిన వేడుకలు పార్టీ నేతలు మదనపల్లెలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

March 5, 2026 / 09:54 AM IST

‘మహిళలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

VZM: సైబర్‌ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రాం సుందర్‌ రెడ్డి సూచించారు. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కలక్టరేట్‌లో బుధవారం పోస్టర్‌లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి డిజిటల్‌ యుగంలో మహిళలు సాంకేతికతను వినియోగించుకుంటూనే, ఆన్‌లైన్‌ వేదికలపై పొంచి ఉన్న సైబర్‌ ముప్పు పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.

March 5, 2026 / 09:53 AM IST

ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ ఆరోపణలు

WGL: వరంగల్‌లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఒకే రకమైన చికిత్సకు వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు రకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సాధారణ జ్వరం వంటి చిన్నపాటి అనారోగ్యానికి కూడా రూ.300 నుంచి రూ.500కు పైగా ఓపీ (అవుట్ పేషెంట్) ఫీజులు తీసుకుంటున్నట్లు సమాచారం.

March 5, 2026 / 09:51 AM IST

CMRF పేదలకు గొప్ప వరం: కోట్ల

NDL: డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన బాధితులకు టీడీపీ యువ నేత కోట్ల రాఘవేంద్రారెడ్డి రూ.1,52,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు CMRF గొప్ప వరమని, ఈ సాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 5, 2026 / 09:50 AM IST

జన్నారంలో నిలిచిన భూ సర్వేలు

MNCL: జన్నారం మండల తహసీల్దార్ కార్యాలయంలో గత ఏడాది కాలంగా భూ సర్వేలు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, ఏదో ఒక సాకుతో అధికారులు పనులను వాయిదా వేస్తుండటంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల ఇబ్బందులను తొలగిస్తారో లేదో వేచి చూడాలి.

March 5, 2026 / 09:50 AM IST

50% రాయితీతో మామిడి రైతులకు కవర్లు..!

KDP: చెన్నూరు మండల వ్యాప్తంగా గుర్రంపాడు, ఓబులంపల్లె గ్రామాల్లో మామిడి పంటను సాగుచేసిన రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 50% రాయితీతో మామిడి పంటకు కవర్లు ఇవ్వనున్నట్లు ఉద్యానశాఖ అధికారి రామకృష్ణ గురువారం తెలిపారు. ఎకరాకు 6,000 ఫ్రూట్ కవర్లు అవసరమవుతాయన్నారు. హెక్టారుకు 15 వేల కవర్లు రాయితీతో అందించాలన్నారు. పంటపూత పిందే దశలో ఉంటే కవర్లు వినియోగించాలని సూచించారు.

March 5, 2026 / 09:47 AM IST

IND vs ENG: తుది జట్లు(అంచనా)

భారత్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(C), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, బ్రూక్(C), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్

March 5, 2026 / 09:47 AM IST

ఈనెల 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి పాలన’

KMR: జిల్లాలో ఈనెల 6వ తేదీ నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి’ పాలన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలు, వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

March 5, 2026 / 09:46 AM IST

రామాయపట్నం పోర్టు ప్రారంభం ఎప్పుడంటే..?

NLR: రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరున కచ్చితంగా ప్రారంభమవుతాయని మంత్రి BC జనార్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాపాలు, కోర్టు కేసులతో పోర్టు పనులు సకాలంలో పూర్తి కాలేదని చెప్పారు. ఇప్పుడు వాటిని పరిష్కరించి పనుల్లో వేగం పెంచామన్నారు. ఇప్పటికే 74% పనులు పూర్తైనట్లు ప్రకటించారు.

March 5, 2026 / 09:45 AM IST

ఖమ్మం కూరగాయల మార్కెట్లో ధరలు ఇలా

KMM: ఖమ్మం సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో కూరగాయల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారి శ్వేత గురువారం విడుదల చేశారు. టమాట కేజీ రూ. 16, వంకాయ 26, గుత్తి వంకాయ 30, బెండకాయ 30, పచ్చిమిర్చి 40, కాకరకాయ 30, కంచె కాకరకాయ 36, బీరకాయ 40, పొట్లకాయ 40, దొండకాయ 40 నాటు దోసకాయ 40, బుడం దోసకాయ 66, చిక్కుడు 36, నాటు చిక్కుడు 80, ఆలుగడ్డ 20, చామగడ్డ […]

March 5, 2026 / 09:45 AM IST

BREAKING: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.900 తగ్గి రూ.1,49,900గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

March 5, 2026 / 09:44 AM IST

వాసుదేవరెడ్డిని కస్టడీకి తీసుకోనున్న సిట్

AP: మద్యం కేసులో నిందితుడు వాసుదేవరెడ్డిని సిట్ కస్టడీకి తీసుకోనుంది. గుంటూరు జైలులో కస్టడీకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. ఇవాళ, రేపు వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మద్యం కేసులో వాసుదేవరెడ్డి A2 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

March 5, 2026 / 09:43 AM IST

జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు: కలెక్టర్

BPT: జిల్లాలో రబీ సీజన్‌కు సరిపడా 8, 641 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మార్చి 25 వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ దుకాణాల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ. 266.50 మాత్రమేనని, ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

March 5, 2026 / 09:43 AM IST

హార్ట్ ఎటాక్.. జిమ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. నాగండ్ల అనిల్ చౌదరి(36) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జిమ్‌లో వ్యాయామం చేస్తూ హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. జిమ్‌లో వాష్‌రూమ్‌కి వెళ్లి అనిల్ అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. అక్కడివారు వెంటనే అతనికి CPR చేసినప్పటికీ లాభం లేకపోవడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిల్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

March 5, 2026 / 09:41 AM IST