ప్రకాశం: కనిగిరి మండలం చాకిరాలలోని రామలింగేశ్వరస్వామి సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన కందులు, శెనగలు కొనుగోలు కేంద్రాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
E.G: దేవరపల్లి మండలంలో 300 ఎకరాల్లో సాగవుతున్న జీడి మామిడి తోటల్లో ఈ ఏడాది పూత ఆశాజనకంగా ఉండటంతో మంగళవారం రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది వర్షాభావం వల్ల దిగుబడి తగ్గగా, అప్పుడు క్వింటా ధర రూ.12,000 పలికింది. ఈసారి వాతావరణం అనుకూలించి పూత బాగా రావడంతో మంచి దిగుబడి వస్తుందని, గిట్టుబాటు ధర లభిస్తుందని రైతాంగం ఆశిస్తోంది.
NGKL: ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషనను రద్దు చేయాలని, ఎర్రవల్లి గ్రామంతో పాటు తండాలను ముంపు నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 92వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీవో వచ్చే వరకు తమ నిరసనలు ఆపేది లేదని బాధితులు తెగేసి చెప్పారు. ఈ దీక్షలో ఎర్రవల్లి, తండా ప్రజలు పాల్గొన్నారు.
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టర్ ఛాంబర్‌లో 2026-27 సంవత్సరానికి నూతనంగా మంజూరైన మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ బాలాజీ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మీడియా ప్రజల మరియు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. బాధ్యతాయుతంగా, నిజనిర్ధారణతో వార్తలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.
KMM: ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ భూములను అక్రమంగా విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్న ముఠాను ఖానాపురం హవేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. OPDR భూదాన్ కమిటీ పేరుతో అమాయక ప్రజలకు ప్రభుత్వ భూములను పంచుతామని నమ్మించి, ఒక్కొక్కరి నుండి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులపై చీటింగ్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మార్చి 6 నుంచి టీమిండియా మహిళల జట్టుతో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్‌లో పింక్ బాల్‌తో జరగనుంది.AUS XI: అలీస్సా హీలీ (C), డార్సీ బ్రౌన్, గార్డ్నర్, హామిల్టన్, బెత్ మూనీ, మైట్‌లాన్, అలానా కింగ్, లిచ్‌ఫీల్డ్, మెక్‌గ్రాత్, ఎలీస్ పెర్రీ, అన్నాబెల్, జార్జియా వోల్, వారెహామ్.
TPT: తడ-వరదయ్యపాలెం రహదారి మరమ్మతులకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు మంజూరు చేసినట్టు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి అదిమూలం తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రోడ్డు గుంతలను పూడ్చి ఒక లేయర్ వేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
BDK: చుంచుపల్లి ప్రశాంత్ నగర్ పంచాయతీ పరిధిలో భవివాదం చిలికి చిలికి గాలివానలా మారి హత్యాయత్నానికి దారితీసింది. హక్కుపత్రాలున్న యజమానిని బెదిరించడమే కాకుండా, పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో టూటౌన్ సీఐ డి. ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూ దందాలకు పాల్పడితే సహించేది లేదని వారు అన్నారు.
SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎల్‌ఎన్ పేట మండలానికి చెందిన యశోదమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 70,322లక్షల వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
KDP: బద్వేల్ పరిధిలోని ఆంజనేయ నగర్ ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం రూ.7,50,000 నిధులతో డ్రైనేజ్ కాలువ పనులు ప్రారంభమైనట్లు మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి గారు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత మురుగు నీటితో పాటు వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా సాఫీగా వెళ్లే విధంగా సదుపాయం కలుగుతుందని తెలిపారు.
ASF: వాంకిడి మండలంలోని గ్రామపంచాయతీల్లో నూతన వార్డు సభ్యులకు ఈనెల 4వ తేదీ నుంచి 5రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు MPDO పాటిల్ జ్యోత్స్న మంగళవారం ప్రకటనలో తెలిపారు. విధులు, బాధ్యతలు, అభివృద్ధిలో సభ్యుల పాత్ర అనే అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వార్డు సభ్యులందరూ ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో కొత్తవలస సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో గురుదేవా చారిటబుల్ ట్రస్టు సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు మంగళవారం నిర్వహించారు. ఉచిత మెడికల్ క్యాంపులో డా. కామాక్షి పాల్గొని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకుని మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ పోలీసులు పాల్గొన్నారు.
TG: రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించాలని ఆయన కోరుకున్నారు. ప్రకృతిలో వసంత కాలానికి చిహ్నమైన హోలీ.. అందరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. సామాజిక సామరస్యం వెల్లివిరియాలని తన సందేశంలో కేసీఆర్ పేర్కొన్నారు.
TVK అధినేత విజయ్‌పై నటుడు సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయం లేని వాళ్లే.. సినిమా డైలాగులు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. పంచ్ డైలాగులు జనం చప్పట్లకు మాత్రమే ఉపయోగపడతాయని తెలిపారు. సినిమా వేరు.. రాజకీయాలు వేరని స్పష్టం చేశారు. పనికిమాలిన మాటలు.. ప్రతి నటుడూ చెబుతాడని అన్నారు. రాజకీయాలకు సిద్ధాంతాలు తప్పనిసరి అని తెలిపారు.