• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కంబాల శివలీలకు ‘కళామతల్లి’ పురస్కారం

NLG: కనగల్ మండలానికి చెందిన కంబాల శివలీలకు ‘కళామతల్లి ముద్దు బిడ్డ’ ఆత్మీయ సత్కారం వరించింది. గత కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవలు, కళా రంగంలో కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నేడు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

March 2, 2026 / 08:30 AM IST

వెంకన్న ఆలయంలో పండిత సదస్యం

AKP: నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పండిత సదస్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై ఉభయదేవేరులను అదిష్టింప చేసి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పలువురు వేతపండితులను ఘనంగా సత్కరించారు.

March 2, 2026 / 08:29 AM IST

మేనేజర్‌పై వేధింపుల ఆరోపణలు

మహబూబ్‌నగర్‌లోని ఓ సంస్థ మేనేజర్ మధుకర్ రెడ్డిపై ఉద్యోగం కోసం వచ్చిన మహిళను వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో బీసీ సమాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యుడిపై తక్షణ చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై సోమవారం మెట్టుగడ్డలోని సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ తెలిపారు.

March 2, 2026 / 08:28 AM IST

శ్రీకాకుళంలో 214కు చేరిన డయేరియా కేసులు

శ్రీకాకుళం నగరంలో ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 214కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. 116 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా ప్రస్తుతం 94 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటి వరకు 135 కేసులు నమోదైనట్లు, 89 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు.

March 2, 2026 / 08:26 AM IST

అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:MLA

VZM: అంగన్వాడీల వర్కర్స్,హెల్పర్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు తెలిపారు.గత ప్రభుత్వాల హయాంలో రెండుసార్లు అంగన్‌వాడీల జీతాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిదే అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు 50 కోట్ల రూపాయలతో G5 స్మార్ట్‌ఫోన్‌లు అందించారు. ఆధునీకరణకు 50 కోట్లు మంజూరు చేశారని అన్నారు.

March 2, 2026 / 08:25 AM IST

పాదాచారిని ఢీకొన్న లారీ.. అక్కడికక్కడే వ్యక్తి మృతి

PPM: మన్యం పట్టణంలో సోమవారం (ఇవాళ) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. స్దానికుల వివరాల ప్రకారం.. స్దానిక అగ్రహారం వీధి మెయిన్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గంటా రామకృష్ణ ని లారీ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 2, 2026 / 08:25 AM IST

క్రీడ ప్రాంగణం.. బోర్డుకే పరిమితం

ADB: బేల మండలంలోని సాంగ్వి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. యువతను క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో నిర్మించిన క్రీడలు, ఆట పోటీలు నేర్చుకునే స్థలం కేవలం బోర్డుకే పరిమితమైంది. ఇలా ఉంటే ఏమాత్రం పిల్లలు ఆటలు నేర్చుకుంటారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి దీన్ని వినియోగానికి తిసుకురావాలని ప్రజలు కొరారు.

March 2, 2026 / 08:25 AM IST

విత్తన ఆవిష్కరణలతో.. నూనె గింజల రంగం బలోపేతం

HYD: విత్తన ఆవిష్కరణల ద్వారా నూనె గింజల రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు సంక్షేమ కమిషనర్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. ICAR ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో నిర్వహించిన సమావేశంలో అధిక దిగుబడి, వాతావరణ మార్పులకు తట్టుకునే కొత్త రకాల అభివృద్ధిపై చర్చించారు. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, రైతుల ఆదాయం పెంచడం లక్ష్యమని స్పష్టం చేశారు.

March 2, 2026 / 08:25 AM IST

అకాల వర్షం.. రైతుకు తీరని కష్టం..!

JGL: ఇబ్రహీంపట్నం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో 285 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఈదురు గాలులు భారీ వర్షంతో, మండలంలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతినగా దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. 335 మంది రైతులకు చెందిన 285 ఎకరాలలో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు.

March 2, 2026 / 08:24 AM IST

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు..!

ASF: బెజ్జూర్ మండలం ముంజంపల్లికి చెందిన గౌత్రే తిరుపతి ఈనెల 16 నుంచి అదృశ్యమైనట్లు SI సర్తాజ్ పాషా ప్రకటనలో తెలిపారు. తల్లి కమల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 5 అడుగుల ఎత్తు, తెల్లని వర్ణం కలిగిన తిరుపతి అదృశ్య సమయంలో నీలం రంగు చొక్కా, నలుపు స్వెటర్ ధరించి ఉన్నాడు. ఇతని ఆచూకీ తెలిసిన వారు 8712670541 నంబర్ సమాచారం అందించాలని SI కోరారు.

March 2, 2026 / 08:23 AM IST

రేపు వేంకటేశ్వరస్వామి ఆలయం మూసివేత

TPT: తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు.

March 2, 2026 / 08:21 AM IST

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు స్పాట్ డేడ్..!

KNR: స్నేహితుడి అంత్య క్రియలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి చెందించారు. పోలీసుల ప్రకారం.. శనిగరానికి చెందిన వినయ్, నాగరాజు స్నేహితుడు చనిపోవడంతో బైకుపై అంత్యక్రియలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో లక్ష్మీపురం వద్దకు రాగానే బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు వారు తెలిపారు. రోడ్డుపై ఎగిరిపడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించినట్లు పేర్కొన్నారు.

March 2, 2026 / 08:21 AM IST

‘నకిలీ పత్రాలతో బురిడీ.. రూ.28 లక్షలు కాజేశాడు’

VSP: పెందుర్తిలో రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఒడిశాకి చెందిన నిందితుడు నబీనా బాఘాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు ప్రసాద్ బాబుకు నకిలీ పత్రాలతో స్థలం అమ్ముతామని నమ్మించి రూ.28 లక్షలు కాజేశారు. ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ సూచనలతో SI భాస్కరరావు బృందం నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఆదివారం తెలిపారు.

March 2, 2026 / 08:21 AM IST

స్వల్పంగా పెరిగిన ఆర్టీసీ డైలీ పాస్ ధర

HYD: ఆర్టీసీ డైలీ బసు పాస్ ధర స్వల్పంగా పెరిగింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డైలీ పాస్ చార్జీలను రూ.150 నుంచి రూ.130కి తగ్గించగా.. తాజాగా ఈ రాయితీని ఆర్టీసీ ఉపసంహరించుకుంది. దీంతో యథావిధిగా డైలీ పాస్ చార్జీ రూ.130 నుంచి రూ.150కు పెరిగింది. ఈ పాస్ పైన ప్రయాణికులు ఏ బస్సుల్లోనైనా 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చు.

March 2, 2026 / 08:19 AM IST

అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA

GNTR: అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వేతనాల పెంపు, గ్రాట్యూటీ, 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ వంటి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్‌ కోసం రూ. 86.68 లక్షలు విడుదల చేశామని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

March 2, 2026 / 08:19 AM IST