• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి

AKP: కసింకోట మండలం ఉగ్గినపాలెంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు సీఐ అల్లు స్వామి నాయుడు తెలిపారు. రోడ్డు దాటుతున్న మహిళను ఎలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న వాహనం ఢీకొన్నట్లు తెలిపారు. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మృతురాలి వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందన్నారు. ఈ ఘటనపై పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.

March 8, 2026 / 07:46 AM IST

నేటి నుంచి HYDలో ప్రపంచకప్ క్వాలిఫైయర్స్

హైదరాబాద్ వేదికగా ఇవాళ్టి నుంచి మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ టోర్నీ జరగనుంది. ఇందులో భాగంగా ఇవాళ భారత జట్టు ఉరుగ్వే తలపడనుంది. ఈ ఏడాది ఆగస్ట్ 14-30 తేదీల్లో బెల్జియం-నెదర్లాండ్స్‌లో జరిగే వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు తలపడనుండగా.. ఇప్పటికే 9 బెర్తులు ఖాయమయ్యాయి. ఈ క్వాలిఫైయర్స్‌లో తొలి 3 స్థానాల్లో నిలిచిన జట్లు టోర్నీకి అర్హత సాధిస్తాయి.

March 8, 2026 / 07:45 AM IST

నేడు చికెన్ ధరలు ఎంత అంటే..?

నంద్యాల: జిల్లాలో చికెన్ ధరలు షాకిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఆధివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. డ్రస్‌డ్ చికెన్ ధర రూ. 260 నుంచి రూ.270 వరకు, స్కిన్ లెస్ చికెన్ రూ. 290 నుంచి 300 వరకు పలుకుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు.

March 8, 2026 / 07:45 AM IST

గద్వాల కీర్తి పతాక.. మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ

GDWL: సంస్థానపు చివరి పాలకురాలు మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ మహిళా లోకానికి స్ఫూర్తిప్రదాత. 1946-49 మధ్య పాలన సాగించిన ఆమె, నిజాం నవాబును ఎదిరించి న్యాయపోరాటం ద్వారా సంస్థానాన్ని నిలబెట్టుకున్నారు. సాహిత్య పోషణలో గద్వాలకు ‘విద్వద్గద్వాల’గా కీర్తి తెచ్చారు. ఆమె స్మరణార్థం కోటలో ఏర్పాటు చేసిన MALD డిగ్రీ కళాశాల జిల్లాలోనే మొదటిది. 1953 ఆగస్టు 18న మరణించే వరకు జనానికి సేవ చేశారు.

March 8, 2026 / 07:45 AM IST

మరో స్టార్ హీరోతో నయనతార ప్రాజెక్ట్!

లేడీ సూపర్ స్టార్ నయనతారకు మరో భారీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ఒక క్రేజీ ప్రాజెక్టులో ఆమెకు అవకాశం దక్కిందని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ద్వారా ఈ ఇద్దరు స్టార్స్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

March 8, 2026 / 07:44 AM IST

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రాన్ని 2026 జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే మార్చి 19, 2026న రిలీజయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ధురంధర్ 2’ సినిమాల థియేటర్లలో ఈ టీజర్‌ను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.

March 8, 2026 / 07:44 AM IST

ఉమ్మడి జిల్లాలో మహిళా నాయకత్వం

WGL: ఉమ్మడి జిల్లాలో మహిళలు పాలన, రాజకీయ రంగాల్లో సత్తా చాటుతున్నారు. ముగ్గరు కలెక్టర్‌‌లుగా పరిపాలనలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇద్దరు మహిళా మంత్రులు, ఒక్క MP ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి నాయకత్వం మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది.

March 8, 2026 / 07:44 AM IST

సొంతింటి కల నెరవేర్చుతున్న రాష్ట్ర ప్రభుత్వం

SRCL: రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చుతుందని, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో ప్రభుత్వ విప్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

March 8, 2026 / 07:43 AM IST

మహిళా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న జిల్లావ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ సందర్బంగా భీమవరంలోని విష్ణు కళాశాలలో జిల్లా స్థాయి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

March 8, 2026 / 07:42 AM IST

పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

PDPL: రామగుండం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ శ్రీహర్ష శనివారం సుడిగాలి పర్యటన చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్, పశు వైద్య శాఖ అధికారి కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుందనపల్లిలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాల వంటగదిని పరిశీలించారు. లింగాపూర్‌లో జరుగుతున్న R&B రోడ్డు, పైప్‌లైన్ పనులను పరిశీలించారు.

March 8, 2026 / 07:42 AM IST

‘రైతులు ఉద్యాన పంటల వైపు దృష్టి సారించేలి’

VZM: రైతులను ఉద్యాన పంటల వైపు దృష్టి సారించే విధంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టామని గంట్యాడ వ్యవసాయ అధికారి బి.శ్యామ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులను అధిక లాభాలు వచ్చే ఉద్యాన పంటల వైపు దృష్టి మళ్ళించేందుకు ప్రత్యేక ఆవగాహన కార్శకమాలు నిర్వహిస్తునామని ఆయన తెలిపారు.

March 8, 2026 / 07:42 AM IST

మెతుకు సీమలో అన్నింటా ‘ఆమె’

MDK: అన్నిరంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ఆయా నుంచి కలెక్టర్ వరకు తమ మార్కు  చూపిస్తున్నారు. మెతుకుసీమలోని మూడు జిల్లాల కలెక్టర్లు, సీపీ మహిళలే. ప్రభుత్వ కీలక శాఖల్లో, పల్లెలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులుగా,  ప్రధాన పార్టీల జిల్లా అధ్యక్షురాళ్లుగా మహిళామణులు రాణిస్తున్నారు. అటుపరిపాలనలో.. ఇటూ రాజకీయాల్లో రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు.

March 8, 2026 / 07:40 AM IST

డివిజన్లలో పర్యటించిన మేయర్, కమిషనర్

KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 3, 4, 5, 6, డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శనివారం పర్యటించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గల్లీల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను, డ్రైనేజీలను నిశితంగా పరిశీలించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి తాగునీరు, వీధి దీపాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

March 8, 2026 / 07:39 AM IST

SIRపై ఢిల్లీలో BJP వర్క్‌షాప్

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)పై BJP నిన్న వర్క్‌షాప్ నిర్వహించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌కి పార్టీ AP చీఫ్ మాధవ్, T.BJP ప్రెసిడెంట్ రాంచందర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా SIR నిర్వహించనున్న వేళ పార్టీ నేతలు ఎలా వ్యవహరించాలో నబీన్ దిశానిర్దేశం చేశారు.

March 8, 2026 / 07:39 AM IST

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మాజీ సీఎం

KDP: మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన పురోగతి సాధించినట్లు అవుతుందని వైసీపీ అధినేత YS జగన్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారికత లక్ష్యంగా 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించామన్నారు.

March 8, 2026 / 07:39 AM IST