ELR: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించనున్నామని ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 9 గంటలకు ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, భారీ బైక్ ర్యాలీ జరుగుతుందన్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రో జిఎన్ శ్రీనివాస్ పీజీ బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్కర్లు సమయపాలన పాటించాలని, గ్రాసరీస్ నాణ్యత, ఎక్స్ పైరీ డేట్ పరిశీలించాలని సూచించారు. విద్యార్థులు హాస్టల్ సౌకర్యాలను సక్రమంగా వినియోగించుకుని తరగతులకు క్రమంగా హాజరు కావాలని తెలిపారు.
WNP: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించే అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ఇవాళ జిల్లాలోని ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలను సందర్శించి పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను, పరీక్షల నిర్వహణను, పరీక్షలకు సంబంధించిన కొశ్చన్ పేపర్ అకౌంట్, అనెగ్జర్స్ మొదలైన రికార్డులను పరిశీలించారు.
TG: చేనేత, పవర్ లూమ్స్‌పై యుద్ధ ప్రభావం పడింది. యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో 40 వేల మంది నేత కార్మికులకు ఉపాధి కరువు ఏర్పడింది. ఒక్క నల్గొండ జిల్లాలోనే రూ.30 కోట్ల ఉత్పత్తులు ఆగిపోయాయి. ఒక షిఫ్ట్‌లో మాత్రమే పవర్ లూమ్స్ నడుస్తున్నాయి.
దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని ఒక హోటల్ ఇడ్లీ, వడ ధరలతో పాటు అదనంగా గ్యాస్ ఛార్జీని కూడా బిల్లులో చేర్చడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్యాస్ ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, కస్టమర్లు సహకరించాలని హోటల్ యాజమాన్యాలు బోర్డులు పెడుతున్నాయి.
AP: తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రకటనలు చేయకుండా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేయగా.. అన్ని అంశాలు పరిశీలించాకే CBIతో సిట్ వేశామని, ఏదైనా ఉంటే సిట్ అధికారులకే చెప్పుకోవాలని CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సూచించింది. దర్యాప్తు మధ్యలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.
HNK: హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా కాజీపేటకు చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు పార్టీ శ్రేణులతో ఎమ్మెల్సీ మల్లన్న చర్చించారు. రాజ్యాధికార పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు.
MNCL: వార్డులో వ్యాధులు ప్రబలకుండా నివారణపై దృష్టి సారించామని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ శనిగారపు చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఐదో వార్డులోని వివిధ కాలనీలలో మున్సిపల్ కార్మికుల చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజీలు చెత్తతో నిండిపోతే దోమల బెడద పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.
SRD: ఆరోగ్యవంతమైన జీవితం కోసం వ్యాయామం తప్పనిసరని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి అన్నారు. కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ కార్యాలయంలో ఓ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, సొంత వైద్యాన్ని తీసుకోరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో బాలరాజు పాల్గొన్నారు.
TG: వరంగల్‌లోని భద్రకాళి చెరువలో రెండో విడత పూడికతీత పనులను MLA రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. రూ.20 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీత పనులను ప్రభుత్వం చేపట్టింది. వరంగల్, హనుమకొండ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని MLA తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వల్ల ఓరుగల్లు ముంపునకు గురైందని.. భద్రకాళి చెరువుకు రోప్ వే కోసం టెండర్లు పిలిచామని పేర్కొన్నారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని గ్యాస్ గోడౌన్‌ను పెనుకొండ RDO ఆనంద్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల స్టాక్ వివరాలను పరిశీలించి రికార్డులను సమీక్షించారు. వినియోగదారులకు సిలిండర్లను కేవలం హోమ్ డెలివరీ ద్వారానే అందించాలని గోడౌన్ డీలర్‌కు ఆదేశించారు. ఈ తనిఖీలో సోమందేపల్లి తహసీల్దార్ మారుతి పాల్గొన్నారు.
కాకినాడ సర్పవరంలో శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో వాకింగ్ ట్రాక్ వద్ద రక్త పింజరి పాము సంచరిస్తూ సందర్శకులను భయాందోళనకు గురిచేస్తోంది. వాకింగ్‌కు వెళ్లిన స్థానికులకు రక్త పింజరి పలువురి కంటపడి భయాందోళనకు గురైన నేపథ్యంలో ఈవో రాపాక శ్రీనివాస్ స్పందించి స్నేక్ క్యాచర్‌ను రప్పించి, ఉద్యానవనంలో వలలు ఏర్పాటు చేశారు.
రోజుకు కనీసం 10 నిమిషాలు మెట్లెక్కితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. వేగంగా క్యాలరీలు ఖర్చయి బరువు తగ్గుతారు. కాళ్లు, తుంటి, పొత్తికడుపు కండరాలు దృఢంగా మారుతాయి. శక్తి సామర్థ్యం పెరుగుతుంది. ఎముకల సాంద్రత పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. క్రమం తప్పకుండా మెట్లెక్కడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
అఫ్గానిస్తాన్, పాకిస్థాన్‌ల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అఫ్గానిస్థాన్‌లోని కాబూల్, కాందహార్, నంగర్హర్, పక్తికా, ఖోస్ట్ ప్రావిన్సులపై పాక్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ గజబ్-లిల్-హక్’ అని పేర్కొంది. సరిహద్దుల్లో తాలిబన్ల పోస్ట్‌లను ధ్వంసం చేసినట్లు పాక్ ప్రకటించింది. దీని అఫ్గానిస్తాన్ తీవ్రంగా స్పందించింది.
SKLM: నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం ఉపాధ్యాయులు హాల్ టికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ దేవత చరణాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించాలని అమ్మవారికి మొక్కుకున్నారు.