• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అరకు ఎన్టీఆర్ జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్

అల్లూరి: శుక్రవారం రాత్రి అరకు ఎన్టీఆర్ జంక్షన్ వద్ద రోడ్ అవేర్నెస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని సీఐ ఎల్.హిమగిరి తెలిపారు. వాహన తనిఖీలు నిర్వహించారు. కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. క్షేమంగా గమ్య స్థానాలకు చేరేందుకు డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.

February 21, 2026 / 07:31 AM IST

ప్రణాళికతో చదివితేనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

WNP: విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ప్రణాళికాబద్ధమైన చదువు అవసరమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలో గురుకుల విద్యార్థులకు ఆయన మోటివేషన్ తరగతులు నిర్వహించారు. చదువును భారం కాకుండా ఇష్టపడి చదవాలని, లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.

February 21, 2026 / 07:31 AM IST

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

BDK: గార్ల మండలంలో ఇల్లందు నియోజకవర్గ కోరం కనకయ్య పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనియాకుల రామారావు శుక్రవారం ప్రకటించారు. ముందుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే ITDA నుంచి గిరిజనులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెసింగ్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.

February 21, 2026 / 07:30 AM IST

హుస్సేన్‌ సాగర్‌లో గుర్తుతెలియని మృతదేహం

HYD: హుస్సేన్ సాగర్‌లో ఈరోజు ఉదయం తేలియాడుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని లేక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా మృతదేహం తేలియాడుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి వెలికితీశారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని, మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం గాంధీ మార్చురీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.

February 21, 2026 / 07:29 AM IST

ACB దాడులు.. ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

AO: లంచం తీసుకుంటూ మరో అధికారి ACBకి చిక్కాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్ పెట్టుకునేందుకు అనుమతి అడిగిన వ్యక్తి నుంచి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కంపా సురేష్ రూ.20 లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో.. శుక్రవారం సురేష్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సురేష్, అలాగే అతనికి సహాయం చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తినీ అరెస్ట్ చేశారు.

February 21, 2026 / 07:29 AM IST

ELR: వ్యభిచార గృహంపై పోలీసుల ఆకస్మిక దాడి

ELR: ద్వారకతిరుమల మండలం గొల్లగూడెంలో నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై ఎస్సై సుధీర్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. పంచవ నాగమణి, భర్త సునీల్ గృహంలోనే విటులను రప్పించి అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో ఇద్దరూ విటులను, ఒక బాధితురాలను అదుపులోకి తీసుకున్నామన్నారు.

February 21, 2026 / 07:28 AM IST

ఏనుమాముల మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన కలెక్టర్

WGL: ఎనుమాముల మార్కెట్ యార్డును నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. మిర్చి సీజన్ నేపథ్యంలో మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్న రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులో తాగునీటి సదుపాయం, తగిన షెడ్లు, తూకం ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 07:27 AM IST

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

NTR: గత రెండు నెలల క్రితం టీడీపీ సీనియర్ కార్యకర్త ఇప్పిలి రాంబాబు గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా రూ.10,000 / చెక్కును నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చిన తమను సంప్రదించాలని రాంబాబు కుటుంబ సభ్యులను కోరారు.

February 21, 2026 / 07:27 AM IST

సైబర్ నేరాలపై గూడూరులో అవగాహన

KRNL: గూడూరు నగర పంచాయతీ SC కాలనీలో SI రాజ కుళ్లాయప్ప సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, IVRS కాల్స్, నకిలీ రుణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అనుమానిత కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు.

February 21, 2026 / 07:26 AM IST

అంజలి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు: డీఎస్పి

అన్నమయ్య: ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర శుక్రవారం తెలిపారు. కేసు అత్యంత దారుణంగా జరిగినదని, మైనర్ బాలికను పరిగణనలోకి తీసుకోకుండా అగంతకుడు కులవర్ధన్ బాలికను హత్యకు గురిచేశాడని పేర్కొన్నారు. చట్టం తన పని తానే చేస్తుందన్నారు.

February 21, 2026 / 07:26 AM IST

విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: నరసాపురం సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ మధుకుమార్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాయపేట, మొగల్తూరు రోడ్డు, జేసీకిలి స్కూల్ ఏరియా, దేవునితోట, సబ్ కలెక్టర్ బంగ్లా, మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, మూడు బొమ్మల సెంటర్, క్రిస్టియన్ పేట, కప్పలపేట ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని తెలిపారు.

February 21, 2026 / 07:26 AM IST

ఓల్డ్ లుక్‌లో సత్యదేవ్.. రిలీజ్ మంత్ ఫిక్స్

సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నారు. వృద్ధుడి గెటప్‌లో సత్యదేవ్ మేకోవర్, టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మేలో విడుదల కానుందని సత్యదేవ్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించనుంది.

February 21, 2026 / 07:26 AM IST

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10:30 గంటలకు జరగనుంది. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

February 21, 2026 / 07:26 AM IST

సిద్దిపేట ఉపాధ్యాయురాలికి రాష్ట్ర పురస్కారం

SDPT: హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పప్పెట్రీ షోలో సిద్దిపేట జిల్లాకు చెందిన మాధవి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దుబ్బాక మండలం గంభీర్పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ప్రదర్శించిన బొమ్మలాట అందరినీ ఆకట్టుకుని రాష్ట్రస్థాయి కన్సోలేషన్ బహుమతిని దక్కించుకుంది. జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి రమేశ్ ఆమెను అభినందించారు.

February 21, 2026 / 07:25 AM IST

వైసీపీపై MLA ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్

PLD: భగవంతుడితో ఆటలాడినందుకే వైసీపీ పతనానికి బాటలు పడ్డాయని శుక్రవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వైసీపీ ఒక చీడ పురుగు లాంటిదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని, తన దిగజారుడు రాజకీయాలకు శాసనమండలిని వేదికగా వాడుకుంటున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 07:24 AM IST