MHBD: సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆయన తన రాజీనామా లేఖను CSకు సమర్పించారు. అనంతరం హైదరాబాదులో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కేసముద్రం మండలానికి చెందిన నేతకు ఈ అరుదైన అవకాశం దక్కడంతో ఉమ్మడి జిల్లాలో సంబరాలు హోరేత్తాయి.
కృష్ణా: గుడివాడ ఏజీకే స్కూల్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, లబ్ధిదారులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. అన్న క్యాంటీన్లో తక్కువ ధరతో నాణ్యమైన భోజనం అందించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపాడు.
GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వాసంతి మాట్లాడుతూ.. రైతులు తమ శనగ పంటను 14 శాతం తేమ వరకు ఎండలో బాగా ఆరబెట్టిన తర్వాత రేపూడి గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు.
CTR: పుంగనూరులో వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారికి సుప్రభాతం, మహాశాంతి అభిషేకం నిర్వహించి అలంకరించారు. తర్వాత ధూప దీపం నైవేద్యాలు సమర్పించిన అనంతరం తిరుప్పావడ సేవ జరిగింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
SRCL: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డులో ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యాడ మానస ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటుండగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టారో ఆరా తీశారు.
MNCL: గల్ఫ్ దేశాలకు కార్మికులు అత్యవసరమైతేనే ప్రయాణాలు కొనసాగించాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వచ్చేవారు, పోయేవారు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. యుద్ధం దృష్ట్యా ఏజెంట్లు పెద్ద మొత్తంలో విమాన చార్జీలను వసూలు చేసే అవకాశం ఉందన్నారు.
NLG: రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ తన మొదటి సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సింఘ్వీ సతీమణి కూడా హాజరయ్యారు. నామినేషన్ అనంతరం మంత్రి కోమటిరెడ్డి సింఘ్వీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘సరస్వతి’ మూవీ పేరు ‘ఎస్.సరస్వతి’గా మారింది. సెన్సార్ బోర్డు సూచనతో చిత్ర యూనిట్ ఈ మార్పు చేసింది. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. మార్చి 6న విడుదల కానున్న ఈ చిత్రం కేవలం 2 గంటల 1 నిమిషం నిడివితో రాబోతుంది. గతంలో చాయ్ వాలా వంటి చిత్రాలు కూడా ఇలాగే పేర్లు మార్చుకున్నాయి.
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 16 వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని సుమారు 100 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు ‘రాయిటర్స్’ తన కథనంలో పేర్కొంది.
PPM: కొమరాడ మండలం విక్రమపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని, తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. పదవతరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడి, విద్యా ప్రమాణాలపై కొన్ని ప్రశ్నలను వేసి, విద్యార్థుల మేధస్సును తెలుసుకున్నారు.
AP: మంత్రి అనగాని అసెంబ్లీలో జేఎన్టీయూ చట్టసవరణ బిల్లను ప్రవేశపెట్టారు. జేఎన్టీయూ విభజించినా.. ఉద్యోగుల విభజన జరగలేదని తెలిపారు. దీంతో పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చి విభజన కోసం అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సమస్య పరిష్కారమై ఉద్యోగుల విభజన జరుగుతుందన్నారు. కాగా, జేఎన్టీయూ చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
T20 WCలో రన్స్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్న అభిషేక్‌పై క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేనప్పుడు నెట్ ప్రాక్టీస్ కంటే విరామం తీసుకోవడం మంచిదని.. అప్పుడే మానసికంగా బలం చేకూరుతుందని సూచించాడు. ఒత్తిడిని అధిగమించేందుకు బ్యాటింగ్ ప్రాక్టీస్ బదులు బైలింగ్, ఫీల్డింగ్ కోసం సాధన చేయాలని.. అంతమాత్రానికే బ్యాటింగ్ స్కీల్స్ ఏటూ పోవన్నాడు.
PPM: విలేజ్ రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం లభించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం గరుగుబిల్లి మండలంలోని గొట్టివలస గ్రామ సచివాలయంలో నిర్వహించిన విలేజ్ రెవెన్యూ క్లినిక్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ రికార్డులను పరిశీలించి, క్లినిక్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
SKLM: జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. గురువారం నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హయంలో నిరుద్యోగులకు ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు.
KMM: ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 7న గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ గావిస్తారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు కొండపై స్వాతి నక్షత్ర జ్యోతిని వెలిగిస్తారని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.