RR: చౌదరిగూడ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో గణపతి అభయ ఆంజనేయ, శివాలయం, రామాలయం, నవగ్రహాల ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా దేవాలయ అభివృద్ధికి దిలీప్ శర్మ అనే వ్యక్తి రూ. 1,50,000 విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోయే విధంగా అందించిన ఈ విరాళం ఆలయ నిర్మాణ పనులు, మహోత్సవ ఏర్పాట్లకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కూచిరాజుపల్లిలో శనివారం ఉదయం 7:00 గంటలకు కోతుల దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి ముందు బ్రష్ చేసుకుంటున్న అంబటి రాజ్ కుమార్‌పై కోతుల మంద అకస్మాత్తుగా మూకుమ్మడి దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్ కుమార్ భుజానికి, చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి.
SRPT: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని వ్యవసాయ శాఖ ఏఈ త్రివేణి అన్నారు. శనివారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. పాస్ పుస్తకం, ఆధార్, లింక్ అయిన ఫోన్ నెంబర్‌తో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. దీనివల్ల బీమా, రుణాలు తదితర ప్రయోజనాలు కలుగుతాయన్నారు.
W.G: భీమవరం మండలం యనమదుర్రులోని ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఓ ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు వారు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధి ఈడేపల్లిలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు సాయి గణేష్ అనే వ్యక్తిపై ట్యూబ్ లైట్‌తో దాడికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. సాయి గణేష్ బాగా చదువుకుంటున్నాడనే అక్కసుతో ఈ దాడి జరిగింది. గతంలో స్నేహితులుగా ఉన్న సాయి గణేష్, సోమశేఖర్, కన్నా మధ్య గొడవలు తలెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని జామియా మజీద్‌లో శనివారం రంజాన్ మాసం సందర్భంగా 3వ ఉపవాస దీక్షను ముస్లిం సోదరులు నిర్వహించారు. నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ ప్రసంగిస్తూ రోజుకు ఐదు పూటలా నమాజ్ చేయాలని, అది శారీరక-మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. మండల ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక దువా నిర్వహించారు.
AKP: మానవాళికి హాని కలిగించే ప్లాస్టిక్‌కు ప్రజలు దూరంగా ఉండాలని ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం సర్పంచ్ కర్రి సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా శనివారం తిమ్మాపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.
BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పున ప్రతిష్ట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజ, ఉత్సవ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ప్రత్యేక ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఈవో మహేష్ సమన్వయంతో చేపట్టారు.
KMM: ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావు వద్ద 2016లో రాజేంద్రప్రసాద్ రూ.10 లక్షలు అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించేందుకు ఆయన జారీ చేసిన రూ.12 లక్షల విలువైన చెక్కులు బ్యాంక్‌లో బౌన్స్ అవ్వడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ఖమ్మం న్యాయమూర్తి బిందు, నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు.
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2026 ఫిబ్రవరి 6న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయింది. సన్‌నెక్స్ట్‌లో FEB 27 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
WNP: పెబ్బేరు మున్సిపాలిటీలో పెదేంటి ఆడపిల్ల పెళ్లికి అండగా నిలబడాలనే సామాజిక బాధ్యతతో శనివారం నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఎమ్మెల్యే మెగా రెడ్డి పెళ్లి కానుక అందజేశారు. ఈ పెళ్లి కానుక లో రూ.3 వేలు, పెళ్లి వస్త్రాలను అందజేశారు. ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఎంతో కొండంత అండగా నిలిచిందన్నారు.
SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలో 13వ వార్డు కోనాయపల్లి పరిధిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నూతన వస్త్రాలు అందజేశారు. శనివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్ లబ్ధిదారులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
GNTR: పొన్నూరులో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆధ్వర్యంలో ‘ఈ-వేస్ట్’ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిబిసి రోడ్డు వద్ద ప్రతిజ్ఞ చేసిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ పొన్నూరు లక్ష్యంగా ప్రజలను చైతన్యపరచాలని సిబ్బందిని కోరారు.
కడప: దేశవ్యాప్తంగా వైట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు సరుకులు అందుతాయి. అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఉచిత రేషన్ పొందాలంటే కుటుంబ సభ్యులందరూ ఈ -కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ -కేవైసీని ఫిబ్రవరి 28వ తేదీ లోపు పూర్తి చేయకపోతే ఉచిత రేషన్ నిలిపివేయబడుతుంది.
AP: విజయవాడలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. భవానీపురంలో మేరారామ్(12), ఉమారామ్(13) గురువారం మిస్ అవ్వగా.. వారు ట్యూషన్‌కి వెళ్లకుండా బస్టాండ్ నుంచి ముంబైకి చేరారని, అక్కడి నుంచి గుజరాత్ సూరత్‌కు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన పోలీసులు.. సూరత్ వెళ్లి పిల్లలను తీసుకొచ్చి క్షేమంగా వారికి అప్పగించారు.