• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పంచాయతీ కార్యదర్శుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

CTR: జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల పంచాయతీ కార్యదర్శుల సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా ఎంపీడీవో మనోహర్ గౌడ్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా గంగాధరనెల్లూరుకు చెందిన వి.శివయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా ముక్కళత్తూరుకు చెందిన పి. కిరణకుమార్ ఎంపికయ్యారు.

February 26, 2026 / 10:01 AM IST

నూతన ఆర్డీవోగా నరసింహారావు

JGL: మెట్‌పల్లి ఆర్డీవోగా పనిచేస్తున్న నక్క శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆర్డీవో నరసింహారావును మెట్‌పల్లికి నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

February 26, 2026 / 10:01 AM IST

మంత్రి లోకేష్‌తో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు

NDL: అసెంబ్లీ ఆవరణలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో ఇవాళ నంద్యాల జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఎంపీలు తమ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి నారా లోకేష్ బాబు వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.

February 26, 2026 / 10:01 AM IST

ధర్మారంలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష ప్రారంభం

PDPL: ధర్మారంలో గురువారం ఉదయం 9 గంటలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 333 మంది, సాధన జూనియర్ కళాశాలలో 145 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

February 26, 2026 / 10:01 AM IST

రోడ్డు ప్రమాదం.. జవాన్ మృతి

VZM: గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలో ప్రధాన రహదారి వద్ద ఇవాళ గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టడంతో ఆర్మీ ఉద్యోగి దవలసింగి చంద్రమౌళి (29) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు అతన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన వ్యక్తిగా అని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 10:00 AM IST

నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

ASR: అరకు రైల్వే ఆస్పత్రిలో నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీ నింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఆస్పత్రి పీఆఓ్వ పీ.ఆనంద్ తెలిపారు. విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే హెల్త్ యూనిట్, ఆరిలోవ మెడికవర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. శిబిరంలో బీపీ, మహిళల కోసం ప్రత్యేకంగా పాప్ స్మియర్ పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు.

February 26, 2026 / 10:00 AM IST

కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలం వన్నాం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది గురువారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

February 26, 2026 / 10:00 AM IST

జిల్లా ఇంఛార్జ్ కమిషనర్‌గా రాకేశ్ చంద్ర

కడప నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్‌గా, ప్రస్తుత అడిషనల్ కమిషనర్‌గా ఉన్న రాకేశ్ చంద్రను నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత కమిషనర్ మనోజ్ రెడ్డిని ప్రభుత్వం సరెండర్ చేయడంతో ఆయన స్థానంలో రాకేశ్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు.

February 26, 2026 / 10:00 AM IST

ప్రభాస్, బుచ్చిబాబు కాంబోలో మూవీ..!

రామ్ చరణ్‌తో ‘పెద్ది’ మూవీ చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు, తన తదుపరి మూవీని రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేయనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు ఇప్పటికే ఒక సాలిడ్ పాన్ ఇండియా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ఖాయం.

February 26, 2026 / 09:59 AM IST

జిల్లాకు నూతన కలెక్టర్

HNK: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఐఏఎస్ బదిలీలలో భాగంగా గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఇప్పటికే ఆమె గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, హనుమకొండ జిల్లా కలెక్టర్ బాధ్యతలు కూడా అదనపు బాధ్యతలుగా చేపట్టనున్నారు.

February 26, 2026 / 09:58 AM IST

దేవాలయ భూములను సంరక్షించాలి: ఎమ్మెల్యే

KRNL: దేవాలయ భూములు ప్రభుత్వ ఆస్తులు కావని, వాటిని అన్యాక్రాంతం చేసే హక్కు ఎవరికీ లేదని ఆదోని MLA పార్థసారధి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆలయ భూములను లీజులు, స్టేడియాలకు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ భూములను ప్రభుత్వం కాపాడాలని, ధార్మిక సంస్థల అభిప్రాయాలతో సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

February 26, 2026 / 09:56 AM IST

నటి రన్యా రావుకు మరిన్ని చిక్కులు

ప్రముఖ నటి రన్యా రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రూ.102 కోట్ల విలువైన భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెపై ఈడీ సంచలన ఆరోపణలు చేస్తూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏడాది కాలంలో సుమారు 127 కిలోల బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

February 26, 2026 / 09:54 AM IST

మెడకు తగిలిన కేబుల్ వైర్లు.. తప్పిన ప్రాణాపాయం

W.G: సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 26, 2026 / 09:50 AM IST

నేటి మిర్చి ధరలు ఇలా..

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.18400, క్వింటాల్ 341 (కారం కాయ) ధర రూ.21000, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ.24000, క్వింటాల్ వండర్ హాట్ మిర్చి ధర రూ.37000, క్వింటాల్ టమాటో మిర్చి ధర రూ.40000గా పలికింది. నేడు మార్కెట్లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 09:50 AM IST

స్వల్పంగా తగ్గిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,48,200గా నమోదైంది. అయితే, వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

February 26, 2026 / 09:47 AM IST