HYD: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264 మంది పోకిరీలను షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై కేసులు నమోదు చేయగా.. 52 మందికి రూ.1,050ను కోర్టు జరిమానా విధించింది. నలుగురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించగా..188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.
నల్లగొండ: జిల్లా దేవరకొండ పట్టణంలో బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 కేంద్రాలలో మొత్తం 1,210 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తాగునీరు, వెలుతురు వంటి సౌకర్యాలు కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
TG: విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలు ఉల్లంఘించి విధులకు రాని 94 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు డీఎంఈ టెర్మినేషన్ నోటీసులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చిలో చేపట్టనున్న 600 మంది వైద్యుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఖాళీలను క్లియర్ చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
PDPL: పెద్దపల్లి సర్కిల్‌లో రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు, వ్యవసాయ కనెక్షన్లు వేగంగా మంజూరు చేస్తున్నట్లు ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 344 సర్వీసులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పంటల కోత అనంతరం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులను గరిష్ఠ స్థాయిలో మంజూరు చేసినట్లు SE బి. సుదర్శనం తెలిపారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 656 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేశామన్నారు.
AKP: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోటవురట్ల మండలం పాములవాక జడ్పీ హైస్కూల్ హెచ్ఎం లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
GDWL: గట్టు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వర్షపు నీరు నిలిచి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కురిసిన స్వల్ప వర్షంతో మురుగు నీరు, వర్షపు నీరు కలిసి రోడ్డు కుంటలా మారింది. ప్రధాన రహదారిపై వాహనాలు ప్రయాణించలేక అవస్థలు పడుతున్నారని, అధికారులు తక్షణమే నీటిని తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
HNK: ఉద్యమకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని క్యాంప్ ఆఫీస్‌లో పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్యేతో భేటీ అయి ఉద్యమకారులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఉద్యమకారులకు అండగా ఉంటూ వారి సమస్యలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు.
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహీన్ అఫ్రిది కోచ్ మైక్ హెస్సన్‌పై పరోక్ష విమర్శలు చేశాడు. ‘నమీబియా మ్యాచ్‌లో నన్ను తొలగించారు. కానీ, నా దృష్టి నా బౌలింగ్‌పై పని చేయడం, తిరిగి ఎలా జట్టులోకి రావాలి అనేది ఆలోచించాను. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను వెళ్లి నా జట్టుకు 100 శాతం ఇస్తాను’ అని పేర్కొన్నాడు.
MNCL: వేసవి నేపథ్యంలో ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకుని పనులు చేసుకోవాలని మంచిర్యాల డీఆర్డీఏ పిడి కిషన్ సూచించారు. బుధవారం జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ రోటిగూడ అటవీ ప్రాంతాలలో ఉపాధి పనుల ద్వారా చేపట్టిన సిప్- బండ్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి కూలికి రోజు రూ.307 వేతనం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.
MDK: తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన 4వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ పోలీసులు 6 రజత పతకాలు సాధించారు. టెన్నిస్‌లో రాథోడ్ రమేశ్ సింగిల్స్, డబుల్స్, గ్రూప్ ఈవెంట్స్‌లో హ్యాట్రిక్ రజతాలు గెలిచారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు విజేతలను సత్కరించి అభినందించారు. కబడ్డీలో భవాని, వీణ, సుష్మ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రవి పంటలకు సంబంధించి ఈ పంట నమోదు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగుస్తుందని వ్యవసాయ శాఖ జేడి త్రినాధ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పంట నమోదు తప్పనిసరిగా రైతులు చేసుకోవాలని, ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు పొందాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సత్యసాయి: పెనుకొండ పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. మరుపల్లి గ్రామ శివారులోని చెరువు సమీపంలో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై రవికుమార్ సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ బహిరంగంగా పేకాట ఆడుతున్న ఆరుగురు జూదగాళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16,120 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
ATP: బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామ సచివాలయ ఉద్యోగి కార్తీక్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఏకాంబరేశ్వరయ్య బుధవారం మీడియాకు తెలిపారు. ఇటీవల పింఛన్ నగదు రూ.96 వేలను సకాలంలో ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు.
E.G: కోరుకొండ మండలం కణుపూరులో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో మంజూరైన CMRF చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదగా బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి చెందిన కంచు మూర్తి నూకాలమ్మకి రూ 27,100, కొత్తపల్లి రత్న కుమారికి రూ.77,084 విలువగల CMRF చెక్కులను అందజేశామన్నారు.