TG: జగిత్యాల జిల్లాకు చెందిన సంగీత, బద్దీ పవన్ 2023లో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో వారిని పెద్దలు కులబహిష్కరణ చేశారు. ఊరిలో ఏ శుభకార్యాలకు రానివ్వకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా.. అధికారులు స్పందించలేదన్నారు.
WNP: వీపనగండ్ల మండలంలోని సర్వే నెంబర్ 721లో 16 ఎకరాల 20 గుంటల భూమిని రాజకీయ నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని వనపర్తి ప్రజావాణిలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి వినతి పత్రాన్ని అందజేశారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష దాడి, శిశువు మృతి ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ.. నిందితుడైన సర్పంచిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించి, భారీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
దేశంలో ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు అత్యంత కీలకం. ఇందులో ఉండే 10 అంకెల కోడ్‌లో మొదటి మూడు అక్షరాలు సిరీస్‌ను.. నాలుగో అక్షరం వ్యక్తి లేదా సంస్థను సూచిస్తే, ఐదో అక్షరం ఇంటి పేరును తెలియజేస్తుంది. పన్ను చెల్లింపులు, బ్యాంక్ పనులకు ఇది తప్పనిసరి. ఆర్థిక లావాదేవీల పారదర్శకతకు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ గుర్తింపు పత్రం చాలా ముఖ్యం.
NLG: జిల్లా డైట్ కాలేజీలో స్టాఫ్ ట్యూటర్‌గా జి.ప.పాఠశాల ఉపాధ్యాయుడికి ‘అపాయింట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్’ ఇవ్వడాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) తప్పుబట్టింది. ప్రభుత్వ పోస్టుల్లో స్థానిక సంస్థల ఉపాధ్యాయులను నియమించడం చట్టవిరుద్ధమని తెలిపింది. కోర్టు తీర్పులు, సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న బదిలీని రద్దు చేయాలని కలెక్టర్‌కు ఇవాళ వినతి ఇచ్చారు.
ADB: 102 అంబులెన్సు సేవల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన పైలట్లకు సోమవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న పైలట్లు హరి ఓం, ధన్ సింగ్ల సేవలను ప్రశంసించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని పీవో పేర్కొన్నారు.
KMM: ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని కలెక్టర్‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు కోరారు. ఖమ్మంలోని నూతన బస్టాండ్‌కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు.
BPT: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ప్రకాశం: పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పర్యావరణ విద్యలో భాగంగా ‘పాములు-పర్యావరణ హితకారులు’ అనే అంశంపై సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాము కుట్టినప్పుడు భయపడకుండా తీసుకోవలసిన ప్రథమ చికిత్స గురించి వివరించారు.
TPT: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నిరంతరం శ్రమించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్‌కు సూచించారు. నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్ ను ఎంపీడీవో ఇమ్రాన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పాఠశాలలో హాజరు, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యార్థి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
MNCL: చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట సోమవారం గోల్డ్ లోన్ బాధితులు ఆందోళన నిర్వహించారు. బ్యాంక్ అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. గత ఏడు నెలల నుంచి తమ బంగారం తమకు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాధితులకు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
AP: అనకాపల్లి ఏటీఎం డైవర్షన్ కేసును పోలీసులు చేధించారు. ఈ క్రమంలో నిందితుడు మువ్వా వీరయ్యచౌదరిని అరెస్ట్ చేశారు. రూ.15 వేల నగదుతో పాటు 9 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 19 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 21వ వార్డు కార్పొరేటర్ అధ్యక్షతన సుజాతనగర్‌లో నాయకులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గ్రంథాలయానికి కావలసిన మౌలిక వసతులపై చర్చించారు. జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొని మండల ప్రజల సహకారంతో త్వరలోనే గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
AKP: పరవాడ మండలం గొర్లవానిపాలెంలో ఈనెల 26వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులను పునఃప్రారంభిస్తున్నట్లు ఎంపీడీవో రమేష్ నాయుడు తెలిపారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో ఉపాధి పనులు నిలిపివేయడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సోమవారం ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లారు.