• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్రీడలు శారీరక ధృడత్వానికి, పట్టుదలకు దారితీస్తాయ: ఏజీఎం జ్యోతి

BHPL: క్రీడలు ఆనందాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి, పట్టుదలకు దారి తీస్తాయని సింగరేణి భూపాలపల్లి ఏరియా ఐఈడీ ఏజీఎం జ్యోతి అన్నారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలో డబ్ల్యూపీఎస్, జీఎ 26వ వార్షిక క్రీడా పోటీలలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ పోటీలకు వారు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ మారుతి పాల్గొన్నారు.

September 6, 2025 / 12:24 PM IST

నూతన భవనాలు ప్రారంభించిన పెడన ఎమ్మెల్యే

కృష్ణా: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సమర్థవంతంగా అమలు చేస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బంటుమిల్లి మండలం మణిమేశ్వరంలో 60 వేల లీటర్ల సంపు, రూ.43.60 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనం, రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్ర భవనం ప్రారంభించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

September 6, 2025 / 12:23 PM IST

వినాయకుడి లడ్డుకు వేలం పాటలు

SRD: వట్ పల్లి మండలం నిర్జప్ల గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల అనంతరం వినాయకుడి వద్ద లడ్డు వేలం పాటలు నిర్వహించగా గెరిగంటి మహేష్ రూ. 17,000లకు సొంతం చేసుకున్నాడు.

September 6, 2025 / 12:22 PM IST

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న హర్షవర్ధన్ రెడ్డి

MBNR: సర్వేపల్లి రాధాకృష్ణన్ చూపిన బాటలో పయనిద్దామని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఇవాళ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో ఆయన విగ్రహానికి మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భగవంత చారి, అధ్యాపకులు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

September 6, 2025 / 12:21 PM IST

వామ్మో.. ఎంత పెద్ద అస్థిపంజరమో..!

ప్రకాశం: దేశంలోనే పూర్తిస్థాయి స్పెర్మ్ వేల్ అస్థిపంజరం ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని జంతుశాస్త్ర ప్రయోగశాలలో ఉంది. 1983, డిసెంబర్ 9న పెదగంజాం తీరానికి కొట్టుకొచ్చిన 35 అడుగుల పొడవు, 30 టన్నుల బరువున్న ఈ తిమింగలం కళేబరాన్ని విద్యార్థుల అవగాహన కోసం కళాశాలకు తరలించారు. దీన్ని ప్రభుత్వం సంరక్షించాలని అధ్యాపకులు కోరుతున్నారు.

September 6, 2025 / 12:19 PM IST

ఎల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు

HYD: BHEL కార్మిక నాయకుడు ఎల్లయ్య అంత్యక్రియలు ఈరోజు దుండిగల్లో నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఈ అంత్యక్రియల్లో పాల్గొని ఎల్లయ్య భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం ఎల్లయ్య చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

September 6, 2025 / 12:19 PM IST

క్షేత్రస్థాయిలో GHMC పారిశుద్ధ్యపనులు

HYD: గణేశ్ మహా నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్విఘ్నంగా స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారు. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో చెత్త, పూలమాలలు, కలర్ పేపర్స్, ఇతర వ్యర్థాలను తక్షణమే తొలగిస్తూ, పారిశుద్ధ్యాన్ని కాపాడుతున్నారు. 15 వేల మంది సానిటేషన్ సిబ్బంది 24×7 విధుల్లో ఉండగా, అధికారులు స్వయంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.

September 6, 2025 / 12:17 PM IST

నూతన ఏటీఎంను ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రి నగరంలోని కోటగుమ్మం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్యాపురం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఏటీఎం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏటీఎం సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

September 6, 2025 / 12:17 PM IST

గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

SKLM: రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శనివారం సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస వద్ద ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి గాను శంకుస్థాపన చేశారు. దీనికోసం రూ. 4 కోట్ల 36 లక్షల రూపాయలు నిధులు కేటాయించామని అన్నారు.

September 6, 2025 / 12:17 PM IST

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఫిరోజ్

ప్రకాశం: ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కనిగిరి మున్సిపాలిటీలో టీడీపీ బోలోపేతానికి కృషి చేస్తానని టీడీపీ కనిగిరి పట్టణ నూతన అధ్యక్షులు షేక్ ఫిరోజ్ అన్నారు. కనిగిరి టీడీపీ అధ్యక్షునిగా నియమితులైన ఫిరోజ్‌ను శనివారం పలువురు టీడీపీ కార్యకర్తలు కలిసి అభినందించారు. టీడీపీ బలోపేతంపై ఫిరోజ్ వారితో చర్చించారు.

September 6, 2025 / 12:15 PM IST

భీంగల్‌లో నూతన రేషన్ కార్డుల పంపిణీ

NZB: భీంగల్ మున్సిపాలిటీలోని శనివారం ఒకటవ డివిజన్‌లో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జేజే. నర్సయ్య, డివిజన్ అధ్యక్షుడు వాకా మహేష్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త కార్డుదారులకు సన్నబియ్యం కూడా అందించారు.

September 6, 2025 / 12:11 PM IST

తాండూర్-గానుగపూర్ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం

VKB: తాండూర్ నుంచి గానుగాపూర్ వరకు నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల డిమాండ్ మేరకు ఆర్టీసీ ఈ బస్సు సర్వీసును ప్రారంభించిందని, మరిన్ని రూట్లలో కొత్త బస్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

September 6, 2025 / 12:09 PM IST

ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలకు 24 కుర్చీల వితరణ

TPT: చిన్నబజారు స్ట్రీట్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భీమా జ్యూవెల్స్ సంస్థ 24కుర్చీలను అందజేశారు. శనివారం పాఠశాలలో టీచర్స్, విద్యార్థుల సమక్షంలో కుర్చీలను అందజేశారు. టీచర్స్ డే సందర్భంగా భీమా జ్యూవెల్స్ తరఫున 24కుర్చీలు, టీచర్లకు చిరు కానుకలు అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీచర్లు, విద్యార్థులు భీమా జ్యూవెల్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

September 6, 2025 / 12:09 PM IST

జంబుకేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎండోమెంట్ ఇన్‌స్పె క్టర్

ATP: రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ రాణి సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొత్తగా ఎన్నికైన పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జంకేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు.

September 6, 2025 / 12:08 PM IST

గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: పొన్నలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నమని కాలేజీ ప్రిన్సిపాల్ రాజేంద్రబాబు తెలిపారు. ఫిజిక్స్ బోధనకు 50% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 9 తేదీకి పూర్తి అర్హత పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

September 6, 2025 / 12:08 PM IST