Delhi Govt : ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచింది. ఏకంగా 66 శాతం జీతం పెరగడంతో ఒక్కక్క ఎమ్మెల్యే నెలకు 90 వేల రూపాయలు అందుకోనున్నారు. ఇప్పటి వరకు ఈ జీతం 54 వేల రూపాయలుగా ఉండేది.
రేపు మచిలీపట్నం(Machilipatnam)లో జనసేన(Janasena party) 10వ ఆవిర్భావ సభ(10th Formation Day) జరగనుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) నాలుగు రోజుల ముందే విజయ వాడకు చేరుకుని వివిధ కులాలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. ఇక ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీని(YSRCP) గద్దె దించడమే లక్ష్యంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నేత మనోహర్(Nadendla Manohar) తెలిపారు...
భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) నిర్దేశించిన మూడేళ్ల లాక్-ఇన్(lock-in time) వ్యవధి ముగిసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లు దాదాపు 12.75% క్షీణించాయి. ఏడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంక్ షేర్లు 15.85 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
ప్రముఖ హీరో సాయి కుమార్(sai kumar) కొడుకు ఆది(Aadi sai kumar) తన సినిమాలు ఆడటం లేదని డిప్రెషన్(depression)లోకి వెళ్లారా? వరుసగా తన చిత్రాలకు కలెక్షన్లు రావడం లేదని బ్లాక్ జోన్ లోకి వెళ్లారా? అందేటో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.
నిజామాబాద్ జిల్లా(nizamabad district) చాంద్రాయణ్ పల్లి శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(road accident) సంభవించింది. కారు(car) అతివేగంతో కంటైనర్ లారీని(heavy lorry) వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు(car)లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
MLC Kavitha : రాజకీయ నాయకులకు విపరీతమైన అభిమానులు ఉంటారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజు వచ్చిందంటే.. మరింత ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటారు. తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. కాగా... తాజాగా... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేసి ఓ బీఆర్ఎస్ నేత అభిమానాన్ని చాటుకున్నాడు.
ఓ చికెన్(Chicken) షాపు(shop) నిర్వహకులు తమ ప్రాంత వాసులకు క్రేజీ ఆఫర్(offer)ను ప్రకటించారు. అరకిలో చికెన్ ఐదుపైసల(five paise coin) నాణానికే ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో అక్కడి స్థానికులతోపాటు చుట్టుపక్కల జనాలు సైతం పాత ఐదుపైసల నాణాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అవి దొరికిన వెంటనే ఆఫర్ ప్రకటించిన చికెన్ షాపుకు వెళ్లి చికెన్ తెచ్చుకున్నారు. ఈ సంఘటన ఏపీ(ap)లోని నెల్లూరు జిల్లా(nellore district)...
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(mlc elections) స్థానాలకు గాను పోలింగ్(polling) జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఓ కబేలా బేరగాడి దౌర్జన్యానికి అభం శుభం తెలియని మూగ జీవి మృత్యువాత చెందింది. ఓ రైతు తన ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ పశువుల సంతకు వెళితే.. అక్కడి వ్యాపారులు కుమ్మకై ఓ దూడ విషయంలో కర్కషంగా ప్రవర్తించి దాని మృతికి కారకులయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని కోదాడ(kodad)లో చోటుచేసుకుంది.
RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల అనేక మంది భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా ఎఆర్ రహమాన్, బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సహా పలువురు ప్రముఖులు RRR టీమ్‌ని అభినందించారు.
ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, షేర్ చాట్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో నాటునాటు పాట ట్రెండింగ్ లో కొనసాగుతున్నది. #NaatuNaatu , #RRRMovie #Teulugu ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న నాటునాటు పాట ప్రతిష్టాత్మక అవార్డు (Award) సొంతం చేసుకోవడంతో ఇక భారతీయుల ఆస్కార్ దాహాన్ని తీర్చేసింది.
95వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో 'RRR'లోని 'నాటు నాటు' ఉత్తమ ఒరిజినల్ సాంగ్(Best Original Song Award) అవార్డును గెలుచుకుంది. దీంతో దక్షణాది నుంచి అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు అందించారు.
కార్తికి గోన్సాల్వేస్(Kartiki Gonsalves) దర్శకత్వం వహించిన...గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) 95వ అకాడమీ అవార్డ్స్(Oscars Awards 2023)లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఈ కేటగిరీలోని ఇతర నాలుగు నామినీలు చిత్రాలను వెనక్కి నెట్టి భారతీయ చిత్రం అవార్డును దక్కించుకుంది.
TSPSC నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లీక్ విషయంలో ఇద్దరికి వాటా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ పేపర్ కోసం రూ.14 లక్షలకు డీల్ కుదుర్చుకుని మరికొంత మందికి ఈ పేపర్ అమ్మినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని పోలీసులు(police) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పై బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను తాను సమర్థించను అని ఎంపీ అరవింద్(MP Arvind) అన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు, అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని అరవింద్ వెల్లడించారు.