• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

PGRSని సద్వినియోగం చేస్కోండి: కమిషనర్

GNTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలని సూచించారు.

February 22, 2026 / 03:38 PM IST

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కార్పొరేటర్

KNR: కొత్తపల్లి 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ తన ఎన్నికల హామీని నెరవేర్చి నిబద్ధతను చాటుకున్నారు. 17వ డివిజన్‌కు చెందిన సిరిపురం స్వప్న మురళి కుమార్తె వివాహానికి హాజరైన ఆమె ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ. 10,016 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు.

February 22, 2026 / 03:36 PM IST

పేరుపాలెం బీచుకు పోటెత్తిన పర్యాటకులు

WG: మొగల్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్‌కు ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు. తీరంలోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

February 22, 2026 / 03:35 PM IST

నూతన ఆన్‌లైన్ సర్వీసెస్ షాపును ప్రారంభించిన.. జంగా

HNK: వేలేరు గ్రామంలో “శ్రీవల్లీ జీరాక్స్ & ఆన్‌లైన్ సర్వీసెస్” నూతన షాప్‌ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు జీరాక్స్, ప్రింటింగ్, ఆన్‌లైన్ సేవలు, లామినేషన్, స్పైరల్ బైండింగ్ వంటి సౌకర్యాలు ఒకే చోట అందుబాటులోకి రావడం ఆనందకరమని ఛైర్మన్ రాఘవరెడ్డి తెలిపారు

February 22, 2026 / 03:35 PM IST

సీఎం కప్‌కు హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక

JGL: సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో భాగంగా హన్మకొండలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి హ్యాండ్బాల్ స్పోర్ట్స్‌కు ఎంపికైన క్రీడాకారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సెలెక్ట్ అయిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మొత్తం 62 ఈ వెంట్లలో 1,648 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

February 22, 2026 / 03:35 PM IST

‘విలేజ్ హెల్త్ క్లినిక్‌తో పేద ప్రజలకు వైద్య సదుపాయాలు’

E.G: నల్లజర్ల మండలం పోతవరంలో ఏర్పాటు చేయనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ & వాటర్ ట్యాంకులను గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు ఆదివారం శంకుస్థాపన చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా గ్రామ ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందేలా కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు శాశ్వతంగా మంచినీరు అందించనున్నట్లు చెప్పారు.

February 22, 2026 / 03:35 PM IST

భార‌తీయ న్యాయ‌ వ్యవ‌స్థ‌పై ద‌ర్శ‌కుడి వ్యాఖ్య‌లు

ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్ హెనాల్ట్ తన పుస్తకం ‘J’avais un rêve indien’ ద్వారా గోరఖ్‌పూర్ జైలులోని దారుణాలను బయటపెట్టారు. 2023లో అక్కడ జైలు జీవితం గడిపిన ఆయన, ఖైదీలను గాలి కూడా ఆడనంతగా కుక్కేవారని పేర్కొన్నారు. ముస్లింలు, దళితులపై వివక్ష చూపుతూ, అగ్రవర్ణాలకే మెరుగైన సౌకర్యాలు ఇస్తున్నారని, సరైన వైద్యం అందక ఖైదీలు మరణిస్తున్నారని సంచలన విషయాలు వెల్లడించారు.

February 22, 2026 / 03:35 PM IST

యువతకు స్ఫూర్తి నరసింహారెడ్డి జీవితం

అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు, నరసింహారెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి సాయుధ పోరాట యోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:33 PM IST

ఉత్సాహంగా సాగిన హ్యాపీ సండే: కమిషనర్

KRNL: ప్రజల్లో ఆరోగ్యం,ఆనందాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని పునఃప్రారంభించినట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం కొండారెడ్డి బురుజు వద్దనున్న పార్కులో తొలి హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా, చెస్, కబడ్డీ, సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఉద్యవన సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపారు.

February 22, 2026 / 03:33 PM IST

చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

NLG: చౌటుప్పల్ సమీపంలోని బోర్రోల గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, నిలిపి ఉన్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దేవరకొండకు చెందిన డ్రైవర్ మల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 22, 2026 / 03:32 PM IST

తెలుగు వీరుడు నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు

NDL: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

February 22, 2026 / 03:32 PM IST

జగన్‌కు తిరుపతి పేరు ఎత్తే అర్హత లేదు: నిమ్మల

AP: లడ్డూను కల్తీ చేసిన మాజీ సీఎం జగన్‌కు తిరుపతి పేరు ఎత్తే అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. లడ్డూలో నెయ్యి లేదని సీబీఐ చెప్పినా ఏ మొహం పెట్టుకొని జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తిరుపతిలో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ తిరుమలకు వెళ్లడం మానేశారని  ఆరోపించారు.

February 22, 2026 / 03:32 PM IST

వందరోజుల ప్రణాళికను పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు ప్రభుత్వ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న “వంద రోజులు ప్రణాళిక-భవిష్యత్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో అమలవుతున్న ఈ కార్యక్రమం విద్యార్థుల ఫలితాలను మెరుగుపర్చేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 03:31 PM IST

రాచూరులో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

సత్యసాయి: రొద్దం మండలం రాచూరు గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. రొద్దం మండల టీడీపీ కన్వీనర్ నరహరి మాట్లాడుతూ.. మంత్రి సవిత ఆదేశాల మేరకు రాచూరు బస్టాండ్ నుంచి జక్కలచెరువు గ్రామం వరకు రూ.1 కోటి నిధులతో బీటీ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.

February 22, 2026 / 03:30 PM IST

దాడిని ఖండించిన బీసీ సంఘాలు

MBNR: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చాకలి కులస్తులపై రెడ్డీ కులస్తులు చేసిన దాడిని ఖండిస్తూ రజక సంఘంతో పాటు వివిధ ప్రజా కుల సంఘాలు కలిసి మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన చేశారు. ఈ మేరకు రజక సంఘం జాతీయ నేత నడి మింటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ అమానుష సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

February 22, 2026 / 03:30 PM IST