»Three Children Died After Going Swimming At Godavarikhani
Three children died: ఈతకు పోయి ముగ్గురు చిన్నారులు మృతి
ఎండాకాలం నేపథ్యంలో నీటి కుంటలోకి ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారుల్లో ముగ్గురు ఆకస్మాత్తుగా మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని గోదావరిఖని జిల్లాలో చోటుచేసుకుంది.
తెలంగాణలోని గోదావరిఖని న్యూపోరట్ పల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలోకి ఈతకు పోయి ముగ్గురు చిన్నారులు మృత్యువాత చెందారు. మరోవైపు ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈరోజు అంబేద్కర్ జయంతి కావడంతో స్కూళ్లకు సెలవు ఇచ్చారు.
ఈ క్రమంలో ఎండ వేడికి తట్టుకోలేక సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులకు ప్రాణాపాయం ఎదురైంది. ఆ క్రమంలో విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఉమా మహేష్, సాయి చరణ్, విక్రమ్ గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.