Bandi sanjay complaint to police for missing mobile
భాగ్యనగరం నడిబొడ్డున భారీ అంబేడ్కర్ విగ్రహం (125 ft ambedkar statue) ఏర్పాటు బీజేపీతోనే (bjp) సాధ్యమైందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ శుక్రవారం అన్నారు (bjp telangana chief bandi sanjay). కేసీఆర్ (kcr) ఎనిమిదేళ్ల క్రితం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంపై హామీ ఇచ్చారు. ఈ హామీని బీజేపీ నేతలు (bjp leaders) ఎప్పటికి అప్పుడు గుర్తు చేసారు. బండి సంజయ్ అయితే పలుమార్లు.. అంబేడ్కర్ విగ్రహం (Ambedkar statue) ఏది.. మాటల వరకేనా అంటూ డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ జయంతిలో (ambedkar jayanti) ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు. తమ పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు సంతోషమేనని, అయితే దళితులకు ఈ ప్రభుత్వం చేసింది మాత్రం ఏమీ లేదన్నారు. దళిత బంధు (dalith bandhu) పైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పారని, ఆ మాట నిలబెట్టుకోనందుకు తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాలన్నారు.
సీఎం కేసీఆర్ (cm kcr) ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు, దళితులు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ఏ రోజు అంబేడ్కర్ ను, ఆయన సిద్ధాంతాలను అనుసరించింది లేదన్నారు. దళిత సమాజాన్ని అడుగడుగునా అవమానించారన్నారు. ఇన్నేళ్లుగా అంబేడ్కర్ జయంతికి, వర్ధంతికి హాజరు కానీ కేసీఆర్ కు ఈ విగ్రహాన్ని ప్రారంభించే అర్హత మాత్రం లేదన్నారు. లేదా దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని ఇదంతా చేస్తున్నారని, ఎన్నికలు పూర్తయ్యాక దళితులను, అంబేడ్కర్ ను కేసీఆర్ పక్కన పెడతారన్నారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై శనివారం నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరుద్యోగ మార్చ్ ఉంటుందని చెప్పారు.