సల్మాన్ ఖాన్-పూజా హెగ్డే డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు గుప్పుమన్నాయి. పూజా హెగ్డే సోదరుడు వివాహానికి సల్మాన్ ఖాన్ హాజరవడంతో వీరిద్దరీ మధ్య ఏదో ఉందని అనుమానం కలిగింది.
Pooja Hegde finally reacts to dating rumours with Salman Khan
Pooja Hegde:సల్మాన్ ఖాన్(Salman khan)-పూజా హెగ్డే (pooja hegde) కలిసి నటించిన ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ మూవీ ఈ రంజాన్‌కు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ మూవీలో కలిసి నటించిన వీరిద్దరూ డేటింగ్ (date) చేస్తున్నారనే రూమర్లు గుప్పుమన్నాయి. దీనికి ఊతం ఇచ్చేట్టు పూజా హెగ్డే సోదరుడు వివాహానికి సల్మాన్ ఖాన్ (salman khan) హాజరయ్యారు. దీంతో వీరిద్దరీ మధ్య ఏదో ఉంది.. డేటింగ్ అంటూ ప్రచారం సాగింది.
మంగళూరులో (mangalore) జరిగిన పెళ్లికి (marriage) సల్మాన్ ఖాన్ వెళ్లడంతో డేటింగ్ అంటూ ప్రచారం జరిగింది. ఆ గాసిప్ గురించి పూజా (pooja) స్పందించారు. ‘చెప్పడానికి ఏమీ లేదు.. తను సింగల్, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతా.. తన ఫోకస్ అంతా కెరీర్ గురించే అని తేల్చి చెప్పింది. మరో సిటీకి వెళ్లి పనిచేయడం అనేది తన లక్ష్యం అని.. బాలీవుడ్ తన టార్గెట్ అంటూ ఇండైరెక్టుగా చెప్పేసింది. ఈ సమయంలో రూమర్ల గురించి మాట్లాడటం వేస్ట్.. తన గురించి తనకే బాగా తెలుసు’ అని పూజా హెగ్డే కుండబద్దలు కొట్టింది.
సల్మాన్ ఖాన్‌తో (salman khan) కలిసి పనిచేయడం అనేది తన కల అని చెప్పారు. షూట్ జరిగే సమయంలో ప్రతీసారి అతనిని తదేకంగా చూసేదానినని గుర్తుచేశారు. ఆ సమయంలో సల్మాన్ చిన్న పిల్లాడిలా, అద్భుతంగా కనిపించేవారు అని తెలిపారు.
గత ఏడాది పూజా హెగ్డేకు (pooja hegde) అంతగా కలిసి రాలేదు. ఆమె చేసిన సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. ప్రభాస్‌తో (prabhas) కలిసి చేసిన రాధేశ్యామ్ (Radheshyam) ఆకట్టుకోలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్‌తో చేసిన ఆచార్య (acharya) కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సో.. పూజా ఆశలు అన్నీ సల్మాన్ ఖాన్ మూవీపైనే పెట్టుకుంది. మరీ ఆ మూవీ హిట్ అవుతుందో లేదో చూడాలీ మరీ.