భారత రాష్ట్ర సమితితో (BRS) తాము దేశంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వచ్చే ఎన్నికల కంటే ముందే తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. బీజేపీకి సరైన సమయంలో బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మను కూడా అవమానించేలా మాట్లాడాతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్ చెడిపోయిందన్నారు. అంద...
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో వాస్తవాదీన రేఖ వెంట ఈ నెల 9వ తేదీన భారత్ – చైనా మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ఇరుపక్షాలు గాయపడ్డాయి. ఈ మేరకు భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఎంతమందికి గాయాలైన విషయం తెలియాల్సి ఉంది. అయితే మొదట్లో ఆరుగురికి గాయాలైనట్లుగా నివేదిక రాగా, ఆ తర్వాత ఈ సంఖ్య ఇరవైకి చేరుకుంది. అయితే గాయపడినవారు చైనా సైనికులే అధికమని తెలుస్తోంది. [&hel...
కర్నాటకలో తొలి జీకా వైరస్ కేసు వెలుగు చూసింది. రాయచూర్ జిల్లాకు చెందిన అయిదేళ్ల బాలుడిలో జీకా వైరస్ను గుర్తించారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలినట్లు ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. జీకా వైరస్ను గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. దీనిని ఎదుర్కొనేందుకు తమ శాఖ సంసిద్ధంగా ఉందన్నారు. పుణే లాబ్ రిపోర్ట్ ప్రకారం కర్నాటక రాయచూర్ జిల్లాకు చెందిన అయిదేళ్ల ...
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీ, చెపాక్-తిరువల్లికేని ఎమ్మెల్యే ఉదయనిధి. అతను ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు. ఉదయనిధికి మంత్రి పదవి ఖాయమైంది. డిసెంబర్ 14న బుధవారం ఉదయం ఆయన రాజ్ భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయనిధికి రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పించాలన్న ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యువనేత విజయం సాధించారు. గతంలోనే ఆయనను మంత...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని ఇటీవల భారత రాష్ట్ర సమితిగా(BRS) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈసీ ఆమోదం లభించడంతో, BRSను లాంఛనంగా ప్రారంభించారు. కర్నాటక సహా వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో పోటీ విషయం పక్కన పెడితే, పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పోటీపై జోరుగా చర్చ సాగుతోంది. సమైక్య ఆంధ్రప్...
జనసేనాని పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా తిరగనీయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలకు తోడు, ఇప్పడుు పవన్ ఎన్నికల ప్రచారరథం వారాహి పైన వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు. వారాహి రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ తెలంగాణలో జరిగిందని తెలిసిన అనంతరం వైసీపీ వ్యాఖ్యలు చూస్తుంటే, భ...
హిమాచల్ ప్రదేశ్‌లో ట్రెండ్‌ను మారుస్తామని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించినప్పటికీ, ఆ ఆశలు నెరవేరలేదు. గుజరాత్‌ను ఏడోసారి సునాయాసంగా దక్కించుకున్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్‌లో గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత వెనుకబడింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌దే పైచేయి. 1985 నుండి ఇక్కడ ప్రతి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీ మారుతోంది. ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈసార...
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 8) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయినప్పటికీ కాస్త ఫ్లాట్‌గానే కనిపిస్తోంది మార్కెట్. మొత్తానికి స్వల్ప లాభాల్లో ఉంది. మధ్యాహ్నం గం.11.40 సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి, 62,469 పాయి...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార, ప్రతిపక్ష స్థానానికి ఎగబాకే పరిస్థితులు కనిపించనప్పటికీ, పార్టీ ట్యాగ్ విషయంలో ఊరట దక్కే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం గుజరాత్‌లో బీజేపీ 150 సీట్ల వరకు, కాంగ్రెస్ 20 సీట్లకు పైగా గెలుస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం డబుల్ డిజిట్ దక్కించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీని వ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా ఏడోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారం దక్కించుకున్నా అది రెండు మూడు స్థానాల తేడాతోనే ఉండే అవకాశముంది. కానీ గుజరాత్‌లో మాత్రం బీజేపీకి ఎదురు లేకుండా పోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ డబుల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. పోస్ట్ పోల్ సర్వే ఫల...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వైస్ చైర్మన్ పదవి చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితా నుండి ఆయన పేరును తొలగించారు. తన పేరును ప్రకటించినందుకు తొలుత విజయసాయి రెడ్డి థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన పేరు కనిపించకపోవడం విజయసాయి రెడ్డికి షాక్ అని చెప్పవచ్చు. ఈ నెల 5వ తేదీన మొత్తం ఎనిమిది మందితో కూడిన ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితాను రాజ్యస...
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ నేడు (గురువారం, డిసెంబర్ 8) ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. పోస్ట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో గట్టి పోటీని ఎదుర్కొంటుంది. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఇప్పటికే అక్కడ బీజేపీ ఆరుసార్లు అధికారంలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయ...
ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం జగన్ ని విమర్శిస్తూ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రతిపక్ష టీడీపీ చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా…. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురు, శుక్ర, శని వారాల్లో గుంటూరు, బాపట్లలో పర్యటించనున్నారు. నేడు పెదకాకాని, నారాకోడూరు, పొన్నూరులో పర్యటన ఉంటుంది. నారాకోడూరులో రైతులతో సమావేశం కానున్నారు. రాత్రి పొన్నూరులో బస ...
జగిత్యాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్… అక్కడి ప్రజలకు వరాల జల్లు కురిపించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు.. ఇవాళ ఒక అద్భుతమైన కలెక్టరేట్ నిర్మాణం చేసుక...
ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా సీబీఐ అధికారులు కవితను విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి, వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్లనే సీబీఐ అధికారులు ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిపించి… కవితను మాత్రం ఎందుకు ఇంటికి వచ్చి మరీ విచారిస్తున్నారు అని ప్రశ్నించారు. కవితకు మాత్రమే ఆ మినహాయింపు ఎందుకు అని ఆయన ప్రశ్నించడం గ...