Radhika apte:రాధికా ఆప్టే.. (Radhika apte) ఫైర్ బ్రాండ్.. ఏ విషయం అయినా సరే సూటిగా, స్పష్టం చెప్పేస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురయిన అనుభవాలను పంచుకున్నారు. ఆమె నటించిన మిసెస్ అండర్ కవర్ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన రూపం మార్చుకోవాలని ఫిల్మ్ మేకర్స్ కోరారని రాధిక ఆప్టే (Radhika apte) గుర్తుచేశారు. బిగ్ బ్రెస్ట్, స్మార్ట్ నోస్ కోసం సర్జరీ చేయించుకోవాలని అడిగారని తెలిపారు. అప్పుడు తను ఏమీ మాట్లాడలేకపోయానని పేర్కొన్నారు. ఇప్పుడు అడిగితే మాత్రం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే తప్పుకుంటానని చెప్పారు. ఒక్కో సినిమాకు ఆమె రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారట. అందుకే వెబ్ సిరీస్లో (web series) నటిస్తున్నారనే రూమర్ కూడా ఉంది. అందుకే ఆమెకు సినిమాలు లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆప్టే మాత్రం.. ఫిల్మ్ మేకర్స్ గురించి హాట్ కామెంట్స్ చేశారు.
బద్లాపూర్ మూవీలో చేసే వరకు తాను గ్రామీణ యువతిగా ఉంటానని అంతా భావించారని తెలిపారు. ఆ తర్వాత మాత్రం వైఖరి మారిందని వివరించారు. ఎక్కువ గ్లామర్ పాత్రలు చేయడం వల్ల శృంగార పాత్రలకే పరిమితం అనుకున్నారు. ఇప్పుడు బ్రెస్ట్ సైజుపై అందిరీలో అవగాహన పెరిగిందని వివరించారు. అప్పట్లో 4 కేజీల బరువు ఎక్కువ ఉండటం వల్ల సినిమా అవకాశాలు కోల్పోయానని వివరించారు.
రాధిక ఆప్టే (Radhika apte) తెలుగులో నటించి మెప్పించారు. కబాలి, లెజెండ్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మాత్రం కనిపించలేదు. ఎక్కువగా వెబ్ సిరీస్ చేస్తున్నారు. షూటింగ్ సమయం తక్కువ.. రెమ్యునరేషన్ ఎక్కువ అని కావొచ్చు.. వాటి వైపు ఆమె మొగ్గుచూపారు.