జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని ఓ పబ్ లో మ్యూజిషియన్(Musician arrested) గా పని చేసే ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో అరెస్టయ్యాడు. ఆమె ఫిర్యాదు మేరకు అతన్నిపోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ మ్యూజిషియన్ను జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు అయిన వ్యక్తి జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఉంటున్న లిలిత్ సెహగల్ (30)గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఇతను ఇదే ప్రాంతంలోని ఓ ప్రముఖ పబ్ లో గిటారిస్టుగా(Musician arrested) పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆ మహిళ అతనితో గతంలో స్నేహంగా ఉన్నట్లు తెలిసింది. పలు కారణాల నేపథ్యంలో ఆమె ప్రస్తుతం అతనితో దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే లలిత్ సెహగల్ ఆమె ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిసింది. ఆ క్రమంలో అతని ప్రయత్నాలను మహిళ అడ్డుకుని తప్పించుకుని బయటకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆ క్రమంలో ఆమె పోలీసుల(police)కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అదే నేపథ్యంలో అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యూడీషియల్ కస్టడీ కోసం రిమాండుకు పంపించారు.