చంపేస్తామంటూ ఓ హీరోయిన్ (Heroine)ను కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా అత్యాచారం చేస్తామని వేధింపులకు పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడింది ఓ ఫైనాన్షియర్ (Financier) కావడం గమనార్హం. తాను అంగీకరించిన వీడియోలో నటించకపోవడంతో ఆ నిర్మాత వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆ హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. ముంబైలోని (Mumbai) జూహు పోలీసుల ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra). ఓ నిర్మాతతో ఓ వీడియోలో నటించేందుకు అంగీకరించింది. అయితే వీడియో (Video) చిత్రీకరణ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఆ వీడియో నుంచి వైదొలిగింది. ముందు చేసుకున్న ఒప్పందం (Bond) ప్రకారం ఆమె నటించకపోవడంతో సదరు నిర్మాత ఆమెపై కక్ష గట్టాడు. వీడియోలో నటిస్తావా లేదా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అంతటితో ఆగకుండా అత్యాచారం చేస్తానని, చంపేస్తామని బెదిరింపులకు (Threat Call) దిగాడు.
అతడి వేధింపులకు తాళలేక షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra) భయాందోళనకు గురైంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 13న గురువారం ముంబైలోని జూహు పోలీసులను (Juhu Police Station) ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె నుంచి సవివరంగా వివరాలు రాబడుతున్నారు. ఒప్పందం ఏమిటి? వివాదం ఎందుకు వచ్చిందనే అంశాలు పోలీసులు తెలుసుకుంటున్నారు. విచారణ అనంతరం అతడి నేరం రుజువైతే పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. కాగా గతంలో షెర్లిన్ చోప్రా హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే తనపై ఇలాంటి బెదిరింపులు జరుగుతున్నాయని షెర్లిన్ వాపోయింది.