KGF చాప్టర్ 2 అద్భుతమైన బాక్సాఫీస్ విజయంతో రాకింగ్ స్టార్ యష్ గ్లోబల్ స్టార్‌గా అవతరించాడు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్2 హ్యాంగోవర్ నుంచి సినీ ప్రేమికులు ఇంకా బయటపడనప్పటికీ, మేకర్స్ శుక్రవారం KGF చాప్టర్ 3(KGF 3 movie) ఉంటుందని ప్రకటించారు.
కెజియఫ్ చాప్టర్ 2 ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ రాఖీ భాయ్‌కి ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవల్. కెజియఫ్ సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. కన్నడ ఇండస్ట్రీ నుంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్‌లో కెజియఫ్3 ఉంటుందని ప్రకటించాడు ప్రశాంత్ నీల్. దాంతో ఈ క్రేజీ సిక్వెల్ ఎప్పుడుంటుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
మరోసారి కెజియఫ్ వరల్డ్‌లోకి వెళ్లాలని తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్మ్స్ వారు. కెజయఫ్2 రిలీజ్ అయి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. కెజియఫ్3 గురించి ఊహించని అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్మ్ మేకర్స్. KGF2 స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తూ.. ఎండ్‌లో ఒక ప్రామిస్ చేసాం, ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటాం.. అని చెప్పుకొచ్చారు. దీంతో కెజియఫ్ 3 ఉన్నట్టేనని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కెజియఫ్ 3 టాప్ ట్రెండ్ అవుతోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే.. విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ప్రభాస్‌తో హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ సలార్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాతే KGF 3 ఉంటుందని చెప్పొచ్చు. దీనికి దాదాపుగా మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కెజియఫ్ 3 కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం పక్కా.