Andhrapradesh: సీఎం జగన్ కీలక ప్రకటన..వారికి రూ.2500 సాయం
ఏపీ సీఎం జగన్ తుఫాను బాధితులకు రూ.2500 సాయాన్ని ప్రకటించారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో కూడిన విత్తనాలను అందిస్తామన్నారు. రోడ్లను పునరుద్దరించి వాహన రాకపోకలకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ (Michaung Cyclone) తీవ్ర అలజడి రేపింది. ఈ తుఫాను వల్ల భారీ ఆస్తి నష్టం వాటిళ్లింది. ముఖ్యంగా వ్యవసాయదారులు (Formers) పంటలను నష్టపోయారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) కీలక ప్రకటన చేశారు. తుఫాను బాధితులకు రూ.2500 సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. నష్టపోయిన వారిని ఆదుకుంటామని, బాధితులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అన్నీ రకాలుగా ప్రభుత్వం మీకు తోడుగా అండగా ఉంటుంది ❤️
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. తుఫాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, వారం రోజుల్లో అందరికీ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐదురోజుల్లో కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల చర్యలు చేపట్టామన్నారు.
తిరుపతి జిల్లా వాకడ తూఫాన్ ప్రభావిత ప్రాంతంలో సీఎం జగనన్న ఏరియల్ సర్వే
బాధితుల సాయం కోసం 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. అలాగే వాలంటీర్ల ద్వారా బాధిత కుటుంబాలకు రూ.2500 అందజేస్తామన్నారు. ఇప్పటి వరకూ 60 వేల మంది బాధితులకు 25 కేజీల బియ్యాన్ని సరఫరా చేసినట్లు వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో కూడిన విత్తనాలను అందిస్తామన్నారు. రోడ్లను పునరుద్దరించే పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు సీఎం జగన్ తెలిపారు.