హనుమంతుడు బీజేపీకి స్ఫూర్తి అని, బజరంగ్ బలి వంటి శక్తి ఇప్పుడు భారత్ లో కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
BJP MLA Rupjyoti Kurmi : తాజ్ మహల్ కూల్చేసి, ఆ స్థానంలో గుడి కట్టాలంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు. తాజ్ మహల్, కుతుబ్ మినార్ లను కూల్చివేయాలని అస్సోమ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రుపియోటి కుర్మి డిమాండ్ చేశారు. అసలు షాజహాన్ తన భార్య ముంతాజ్ ని నిజంగానే ప్రేమించాడా అన్న దానిపై ‘దర్యాప్తు’ జరగాలని కూడా ఆయన కోరాడు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
తాను కొత్త పార్టీ పెడుతున్నానంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి కొట్టి పారేసారు.
ఉగాదిని పురస్కరించుకుని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ ఉద్యోగాల ప్రకటన విడుదలైంది.
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి గుడి వరకు జరుగుతుంది.
Actor Rana : విరాట పర్వం తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు దగ్గుబాటి రానా.. కానీ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లో రానా హాట్ టాపిక్ అవుతునే ఉన్నాడు. 2020లో కరోనా సమయంలో బ్యాచ్ లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి.. మిహీక బజాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రానా.
పద్మ అవార్డుల ప్రదానోత్సవం దేశ రాజధాని న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా రంగాల్లో పురస్కారాలు పొందిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి పద్మభూషణ్ చినజీయర్ స్వామి పొందారు. ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు స్వీకరించాడు.
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పైన మూడోసారి రాళ్ల దాడి జరిగింది.
ఇప్పటికే రాయితీల్లో కోత విధించిన హైదరాబాద్ మెట్రో రైల్వే, త్వరలో చార్జీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీపీఆర్ తో 23 రోజుల పసిపాపకు పునర్జన్మ దక్కడం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిదర్శనంగా బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సీపీఆర్ తో పాపను కాపాడిన వీడియో వైరల్ గా మారింది.
ఖమ్మంకు చెందిన హర్షవర్ధన్ తనకు వచ్చిన క్యాన్సర్ కారణంగా చనిపోతానని తెలిసి.. అంత్యక్రియలకు కూడా సిద్ధం చేసుకున్న బాధాకర సంఘటన జరిగింది.
పోలీసులు మిమ్మల్ని కొట్టారా అని న్యాయమూర్తి అడిగారు. దీనికి బండి సంజయ్ ఏసీపీ, సీఐలు కొట్టారంటూ చొక్కా తీసి గాయాలను చూపించారు.
నిన్న జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్... రాజస్థాన్ రాయల్స్ పైన 5 పరుగుల తేడాతో గెలిచింది.
కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు పలకడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, తన మనసు గాయపడిందన్నారు నటుడు ప్రకాశ్ రాజ్.