కాంగ్రెస్ పార్టీ (congress party) అసంతృప్త నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి (komatireddy venkat reddy) కొత్త పార్టీ (komatireddy new party) పెట్టే అవకాశాలు ఉన్నాయని మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. గత ఏడాది ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) బీజేపీలో (bjp) చేరారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో వెంకట రెడ్డి మాట్లాడుతూ… తాను తన తమ్ముడికి లేదా కాంగ్రెస్ పార్టీకి (congress party) వ్యతిరేకంగా పని చేయనని మౌనంగా ఉండి పోయారు. రాజగోపాల్ రెడ్డి తర్వాత వెంకట రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన ఎప్పటికప్పుడు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. తాను కాంగ్రెస్ వాదిని అను, మొదటి నుండి ఇదే పార్టీలో ఉన్నానని, పార్టీ నాయకుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినంత మాత్రాన పార్టీ నుండి వెళ్లిపోతానని కాదని చెబుతూ వస్తున్నారు.
మరోవైపు, బీజేపీ కూడా ఆయనకు మంచి ఆఫర్ ఇచ్చింది. పార్టీలో చేరాలని, మంచి ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ బీజేపీలో (bjp) చేరే వార్తలను ఆయన ఎప్పుడూ కొట్టి పారేస్తూ వస్తున్నారు. గత మూడు నాలుగేళ్లుగా ముఖ్యంగా రేవంత్ అధ్యక్షుడు (Telangana pcc revanth reddy) అయ్యాక ఆయన తీవ్ర నిరసన గళం వినిపిస్తున్నారు. తమ్ముడు బీజేపీలో చేరాక పార్టీతో మరింత దూరం పెరిగింది. ఆయన మాత్రం తాను కాంగ్రెస్ ను వదిలేది లేదని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన కొత్త పార్టీ అంటూ మరోసారి ప్రచారం సాగుతోంది. ఆయన రేపో మాపో కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని, ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించనున్నారని వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరేందుకు మాత్రం ఆయన మొగ్గు చూపడం లేదని అంటున్నారు.
కొత్త పార్టీ ఏర్పాటు పైన కోమటిరెడ్డి వెంకట రెడ్డి (komatireddy venkat reddy) స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని, రాజీనామా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను నిన్న మొత్తం సోనియా గాంధీతోనే ఉన్నానని చెప్పారు. తనది కాంగ్రెస్ రక్తమని, తన ముందు ఇతర పార్టీలో చేరడం లేదా కొత్త పార్టీ అంటూ ఎలాంటి ఆప్షన్స్ లేవన్నారు. తాను పార్టీలోనే ఉంటానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు లేదా పార్టీ పెడుతున్నట్లు వచ్చే వార్తలను నమ్మవద్దన్నారు.