BJP MLA Rupjyoti Kurmi : తాజ్ మహల్ కూల్చేసి, ఆ స్థానంలో గుడి కట్టాలంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు. తాజ్ మహల్, కుతుబ్ మినార్ లను కూల్చివేయాలని అస్సోమ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రుపియోటి కుర్మి డిమాండ్ చేశారు. అసలు షాజహాన్ తన భార్య ముంతాజ్ ని నిజంగానే ప్రేమించాడా అన్న దానిపై ‘దర్యాప్తు’ జరగాలని కూడా ఆయన కోరాడు.
తాజ్ మహల్ కూల్చేసి, ఆ స్థానంలో గుడి కట్టాలంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు. తాజ్ మహల్, కుతుబ్ మినార్ లను కూల్చివేయాలని అస్సోమ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రుపియోటి కుర్మి డిమాండ్ చేశారు. అసలు షాజహాన్ తన భార్య ముంతాజ్ ని నిజంగానే ప్రేమించాడా అన్న దానిపై ‘దర్యాప్తు’ జరగాలని కూడా ఆయన కోరాడు. ఈ రెండు కట్టడాల స్థానే ఆలయాలను నిర్మించాలని ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశాడు. ఇందుకు అవసరమైతే తన ఏడాది వేతనాన్ని విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.
తాజ్ మహల్, కుతుబ్ మినార్ లను కూల్చి వేసిన వెంటనే ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయాలను అక్కడ నిర్మించాలని.. వీటి నిర్మాణం ఎలా ఉండాలంటే.. మరే ఇతర కట్టడాలు కూడా వీటి ముందు సాటి రాకూడదని అన్నాడు. ముంతాజ్ మరణం తరువాత షాజహాన్ మూడు సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నాడని ప్రశ్నించిన కుర్మి .. నిజానికి హిందూ సంపదతోనే తాజ్ మహల్ ని నిర్మించాడన్నారు.
షాజహాన్ ఏడుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. ముంతాజ్ ఆయన నాలుగో భార్య. ఆయన ఆమెను అంతగా ప్రేమించి ఉంటే మరికొంతమందిని ఎందుకు పెళ్లాడాడు అని ఈ బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించాడు.