త్రిపుర (Tripura), మేఘాలయ (Meghalaya), నాగాలాండ్ (Nagaland) వంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో సినిమా రంగంలో పనిచేసే ఓ నటిపై లైంగిక దాడి యత్నం జరిగింది. ఈ ఘటనపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు తెలిపింది. అయితే రెండేళ్ల క్రితం కూడా తనను ఓ వ్యక్తి వెంబడించి రాయితో బెదిరించి ఫోన్, పర్స్ లాక్కెళ్లాడని వెల్లడించింది.
MLA Gandra: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి మాటతీరు మార్చుకోవాలని హెచ్చరించారు. భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో జరిగిన సంఘటనలపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు.
కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావును పోలీసులు హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీ అయిన నేపథ్యంలో పోలీసులు సత్యనారాయణ ఇంటిని చుట్టుముట్టారు.
తన సోదరి ప్రీతిది ఆత్మహత్య ఏమాత్రం కాదని, హత్యేనని సోదరుడు చెబుతున్నారు. తన సోదరిది హత్య అనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆత్మహత్య అని చెప్పడానికి వారి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోందని, కానీ అలాంటిది ఏమీ లేదని విశాఖ శారదా పీఠం (visakha sarada peetham) ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు.
అమరావతి అయితే తమ పరిస్థితులు మారుతాయని.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మైలవరం ప్రజలు భావించారు. కానీ దానికి విరుద్ధంగా అమరావతిని నామమాత్రం చేసి విశాఖపట్టణం ప్రధాన రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ ప్రకటించడంపై మైలవరం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద (self-proclaimed god man Nithyananda) కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో ఐక్య రాజ్య సమితి (united nations organization) చర్చలో పాల్గొనడంపై ఐక్య రాజ్య సమితి ప్యానల్ స్పందించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలు.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల ఐక్యత ప్రదర్శనగా నిలిచాయి.
ఉన్నట్టుండి మనుషులు కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణం పొందుతున్నారు. ఇటీవల తరచూ ఇవే సంఘటనలు చోటుచేసుకుంటుండడం అందరినీ కలచి వేస్తోంది. ఇలా అకస్మాత్తుగా కూలుతున్న వారిని ఆదుకునేది సీపీఆర్ (Cardiopulmonary Resuscitation -CPR) విధానం. ఆపత్కాలంలో వారి ప్రాణం నిలిపేది సీపీఆర్.
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొత్త చిత్రం సెక్షన్ 84. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ బిగ్ బీ ప్రకటించారు. ఈ చిత్రానికి యుధ్, Te3nకి దర్శకత్వం వహించిన రిభు దాస్‌గుప్తా డైరెక్షన్ చేస్తున్నారు.
వరంగల్(Warangal) కేఎంసీ(KMC) మెడికల్ విద్యార్థిని ప్రీతి(Preethi)ని సైఫ్(saif) మానసికంగా వేధించాడని కాకతీయ మెడికల్ కాలేజీ(kakatiya medical college)లో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ(anti ragging committee) బుధవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ నివేదికను ఢిల్లీలోని యూజీసీతోపాటు ఎన్ఎంసీకి కూడా అందజేస్తామని కేఎంసీ ప్రిన్సిపల్ మెహన్ దాస్ వెల్లడించారు. ఆ తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలో రేపటి నుంచి వారం పాటు 144 సెక్షన్(144 Section) అమల్లో ఉంటుందని అక్కడి జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి(sp surender reddy) ప్రకటించారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు సహా ప్రజలు కూడా సమన్వయం పాటించాలని కోరారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మంగళవారం రేవంత్ రెడ్డి సభ జరిగిన క్రమంలో పలువురు...
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మేరకు మేకర్స్ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరోయిన్ అనుష్క, హీరో నవీన్ పోలిశెట్టి క్రేజీగా కనిపిస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంలో అభిమానుల్లో మరింత ఆసక్తి మొదలైంది.