హిమాలయాల (Himalayas) మంచు కొండల్లో కొలువైన అందమైన ప్రదేశం. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా నిలిచే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గిన్నీస్ రికార్డు బదలయ్యేలా ఓ క్రీడా సంబురానికి వేదిక కానుంది. ప్రస్తుతం చలికాలంలో మంచుగడ్డగా మారిన సరస్సులో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు (Athletes) దూసుకెళ్లనున్నారు.
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంప బాధిత మృతుల సంఖ్య 34 వేలు దాటింది. ఇంకోవైపు ఆదివారం టర్కీ దక్షిణ ప్రాంతమైన కహ్రమన్మరాస్ లో 4.7 తీవ్రతో భూకంపం వచ్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది. అంతేకాకుండా భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా నిర్మించిన భవనాలు కూడా కూలడం పట్ల 131 మంది భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు.
ఈ లీగ్ కు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారిలో పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద వాళ్లు సీసీఎల్ కు దూరంగా ఉంటారు. అందుకే సీసీఎల్ గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. బాలీవుడ్, కోలీవుడ్ తదితర సినీ పరిశ్రమలో పెద్ద స్టార్లు కూడా బరిలోకి దిగుతారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఐడీఎల్ చెరువు సమీపంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఓ ట్రావెల్ బస్సుతోపాటు రెండు వ్యాన్లు కాలిపోయాయి.
జల్సా సినిమా విడుదలైన సమయంలో టిక్కెట్ల కోసం చాలా ఇబ్బంది పడినట్లు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుర్తు చేసుకున్నారు. తాను హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తిరుపతిలో జరిపిన క్రమంలో ఈ మేరకు వెల్లడించారు. మరోవైపు అనేక సినిమాలు స్కూల్ గోడ దూకి చుశానని గుర్తు చేసుకున్నారు.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతీయువకులకు వివాహానికి ముందే వివాహా సామగ్రి (తాళిబొట్టు, పట్టువస్త్రాలు, బాసింగాలు, మేకప్ కిట్ సహా కొన్ని వస్తువులు) అందిస్తారు. నిర్ణయించిన ముహూర్తానికి బంధువులతో కలిసి వధూవరులు వస్తే చాలు. కొత్త జంటలకు కాపురానికి కావాల్సిన బీరువా, మంచం, పరుపు, దుప్పట్లు, 2 కుర్చీలు, వంట సామగ్రి, కుక్కర్, మిక్సీ తదితర సామగ్రి అందించారు.
తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ ఆఫీసుకు రూ.11,41,63,672 కరెంట్ బిల్లు వచ్చింది. ఇది చూసిన అక్కడి గ్రామ సర్పంచ్, సిబ్బంది అంత బిల్లు రావడమెంటని విద్యుత్ అధికారులను ప్రశ్నించారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ బిల్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఏసీడీ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీలో ఈటల రాజేందర్ గురించి పలు మార్లు సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఘర్ వాపసీ అంటూ నినాదాలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కూడా రాజేందర్ స్పందించారు. నా మీద చేసిన దాడిని మరిచిపోలేను. నేను పార్టీ మారలేదు
అదే స్కూల్ హాస్టల్ లో ఉంటున్న బాలిక పదో తరగతి చదువుతోంది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు
అసోంలో భూకంపం(Assam Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని నాగావ్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ భూకంపం(Earthquake) సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 4.18 గంటలకు నాగావ్ పరిధిలో భూమి కంపించింది.
రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశీ ఖన్నా తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ లో ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ లో రాశీ ఖన్నా అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
భారత్ త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందంటున్నారు కదా.. అది చాలా తక్కువ. ఎందుకంటే అభివృద్ధి సూచి తీసుకుంటే తలసరి ఆదాయంలో భారత్ 138వ స్థానంలో ఉంది. చిన్న దేశాలు అయిన బంగ్లాదేశ్...
ప్రముఖ ఫుడ్ డెలివరీ(Food delivery App) టెక్ కంపెనీ అయిన జొమాటో(Zomato) షాకింగ్ విషయం చెప్పింది. తమ సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు జొమాటో(Zomato) తెలిపింది. ఈ నష్టాల వల్ల దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
ఆ తర్వాత కొత్త సచివాలయం, ప్రగతి భవన్ పై విపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ ను కూలగొడితే చూస్తూ ఊరుకుంటామా? కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారు. ప్రజలే చూసుకుంటారు ఆ తమాషాలు అన్నారు
google maps new feature:గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ (new feature) తీసుకొచ్చింది. నావిగేషన్ యాప్ (navigation app) వాడేవారికి మరింత ఆకట్టుకునేలా కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇమ్మర్సివ్ వ్యూ (immersice view) అనే సరికొత్త ఫీచర్‌ను (new feature) గూగుల్ మ్యాప్స్‌లో జత చేసింది. యూరప్‌లో గల ఐదు నగరాల్లో (5 cities) ఈ ఫీచర్ తీసుకొచ్చింది.