WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, గిరిజనుల ఆత్మగౌరవానికి ఆయన జీవితమే ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
CTR: ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు పేర్కొన్నారు. పుంగనూరులోని అగ్నిమాపక కార్యాలయంలో శుక్రవారం ఆయన కేసి టీవీతో మాట్లాడారు. వేసవి ఎండలు ప్రారంభమవుతున్నాయని, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువని, వాటి నివారణకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రమాదాలు జరిగితే 08581-253101 సమాచారం ఇవ్వాలన్నారు.
జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఒక ఉసిరి తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల జుట్టు బలంగా, వత్తుగా పెరుగుతుంది. ఉసిరి పొడి, నిమ్మరసం మిశ్రమాన్ని తలకు పట్టించి 40 నిమిషాల తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. కొబ్బరి నూనెలో ఉసిరి రసం కలిపి నెలకు 4 సార్లు మాడుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
VZM: రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డా. వై కళ్యాణ్ చక్రవర్తి పోలియో నిర్మూలనే రోటరీ ధ్యేయమని శుక్రవారం తెలిపారు. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేపట్టి బొబ్బిలిలో ర్యాలీ నిర్వహించారు. భారతదేశాన్ని 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటించారని, దీనిపై అప్రమత్తత అవసరమన్నారు. అనంతరం క్లబ్ కార్యక్రమాలు సమీక్షించి రోటరీ బస్ బే ప్రారంభించి, విద్యార్థులకు టీ షర్టులు పంచారు.
KDP: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఎస్సై హారిక అన్నారు. శుక్రవారం సిద్ధవటం పోలీస్ స్టేషన్ వద్ద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాల్యవివాహా విముక్తి ప్రచార రథాన్ని ఎస్సై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లలకు బాల్య వయసులో వివాహాలు చేయడం పట్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు.
AP: హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. చెప్పులేసుకుని దేవుడి ఫొటోలతో సభలోకి రావడం క్షమించరాని నేరమని విమర్శించారు. దేవుడి ఫొటోలు విసిరేయడం అవమానకరమన్నారు. హిందువులను అవమానించినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడు అంటే జగన్‌తో సహా వైసీపీ నేతలకు భయం, భక్తి లేవన్నారు.
NLR: దగదర్తి మండలం పెదపుతేడు గ్రామంలో పంట నమోదు కార్యక్రమంను సీహెచ్ నాగరాజు సహాయ వ్యవసాయ సంచాలకులు కావలి శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పంట వేసిన ప్రతి రైతు పంట నమోదు కార్యక్రమంలో నమోదవ్వాలన్నారు. తద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పంట అమ్ముకోవచ్చన్నారు. ప్రభుత్వం ద్వారా లభించే ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర ప్రభుత్వ పథకాలన్నిటికీ అర్హులవుతారని ఆయన తెలిపారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా.. దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన హరీష్.. తాము ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ వాటిని నిర్వహించలేకపోతోందన్నారు. ఇక్కడ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల జనగామ, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
E.G: కడియం మండలం మాధవ రాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై నిందలు వేస్తే సహించేది లేదని ఆ గ్రామానికి చెందిన SC, ST ఐక్యవేదిక నాయకులు శుక్రవారం హెచ్చరించారు. చైతన్యనగర్లో తలెత్తిన భూ వివాదం ఆయన వ్యక్తిగతం కాదన్నారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు సర్పంచ్‌పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలవురు నాయకులు పాల్గొన్నారు.
GDWL: ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల సముదాయ సమావేశం జరిగింది. ఎంఈవో రవీంద్రబాబు మాట్లాడుతూ… ప్రతి పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల కనీస సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని.. మధ్యాహ్న భోజన పథకం వివరాలను ప్రతిరోజూ ఎస్ఎంఎస్ ద్వారా పంపించాలని సూచించారు.
విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా కోహ్లీకి ఉందని కొనియాడాడు. ఆసీస్ జట్టులో కోహ్లీ వంటి ఆటగాడు లేడని, అందుకే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడికి లోనై ఓడిపోయామని పేర్కొన్నాడు. విరాట్ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయని వ్యాఖ్యానించాడు.
NRPT: మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల నిర్మాణాత్మక మూల్యాంకన (FA) మార్కుల పరిశీలన కొనసాగింది. ఉపాధ్యాయులు నరసింహారావు, లక్ష్మారెడ్డి, సంధ్య బృందం విద్యార్థుల అంతర్గత మార్కులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు పక్కాగా సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
WNP: బీఆర్ఎస్ హయాంలో కేవలం పార్టీ కార్యకర్తలకే ఇళ్ల పట్టాలు ఇచ్చారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కొత్తపల్లిలో లబ్ధిదారురాలు గొల్ల శంకరమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొని ఆయన నూతన వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కడితే కమిషన్లు రావనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వాటిని పెట్టిందని ఆరోపించారు.
KMR: జుక్కల్ మండలం సావర్గవ్ గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు శుక్రవారం సర్పంచ్ రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బోరుబావుల మరమ్మతులు చేపట్టాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టి నీటి వృథాను అరికట్టాలని నిర్ణయించారు. తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా మోటార్లకు మరమ్మతులు చేయించాలని తీర్మానించారు. అలాగే దళితవాడలో మురుగుకాలువల నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు.
AP: YCP సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. దేవుడి ఫొటోలు పట్టుకుని చెప్పులతో సభలోకి వచ్చారని ధ్వజమెత్తారు. సభలో ప్రతిరోజూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా YCP తీరు ఉందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడమేంటని నిలదీశారు. హిందూ సమాజానికి YCP సభ్యులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.