ATP: గుత్తి మున్సిపాలిటీలోని 15వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, సేవలను మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు కనిపించే విధంగా డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శించాలన్నారు. విధులకు సక్రమంగా హాజరు కావాలన్నారు.
NZB: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్య మంలో జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆదుకునేందుకు త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఆయన NZBలో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో మృతి చెందిన వారికి 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.
‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని ఎవరికి పేరు?A) గోపాలకృష్ణ గోఖలేB) దాదాభాయ్ నౌరోజీC) సర్దార్ వల్లభాయ్ పటేల్D) మదన మోహన మాలవీయ నిన్నటి ప్రశ్న: హైదరాబాద్ రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి ఎవరు?జవాబు: బూర్గుల రామకృష్ణారావు
MLG: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కన్నాయిగూడెంలో సమావేశం జరిగింది. వాసంపెల్లి నరసింహారావు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమనికి రాష్ట్ర నాయకులు వావిలాల స్వామి మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయ పార్టీల్లో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ప్రతిఘటన చేస్తామని హెచ్చరించారు.
WGL: గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఏర్పాట్లపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జాతర ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, ఫిబ్రవరి 23 నుంచి జాతర ప్రారంభం కావనున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
KRNL: ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉందని ఇవాళ నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ తెలిపారు. బీపీ, షుగర్, ఒబిసిటీ కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత కిడ్నీ మార్పిడి జరుగుతుందని, మార్పిడి అనంతరం సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. ఆదోనిలో గురు, ఆదివారాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీజీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం అచ్చుతాపురంలో ఫార్మా కంపెనీలను సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, క్వాలిటీ ఇష్యూరియన్స్ డిపార్ట్మెంట్, వాటర్ ప్యూరిఫికేషన్ డిపార్ట్మెంట్‌లను సందర్శించారు.
కడప II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీకి పథకం పన్నిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయేషా వీధిలో బుర్కాలు, కత్తులు, కారంపొడితో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విజిబుల్ పోలీసింగ్‌లో ఉన్న సిబ్బంది వారిని పట్టుకున్నారు. ముద్దాయిల వద్ద నుంచి నేరానికి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 22న విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రియాంక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి తొమ్మిదవ తరగతి వరకు గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఉదయం 11 గంటలకు సకాలంలో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ శుక్రవారం అవుకు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణతో పాటు రిసెప్షన్, స్టోర్ రూమ్, లాకప్ గదులు, రికార్డు గదులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించమని సూచించారు.
TG: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా HYDలోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది. ఛార్జ్‌షీట్‌లో లోపాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు జతపరచకపోవడంతో పోలీసులపై ఫైర్ అయింది.
MBNR: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ గ్రామంలో ఇవాళ జరిగిన బొడ్రాయి ప్రతిష్ట పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేశామని పేర్కొన్నారు.
KDP: జిల్లాలో ఏర్పాటు చేసిన 21 శనగ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. రాజుపాలెం మండలం రైతు సేవా కేంద్రం, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. కోసిన శనగ పంటను బాగా ఆరబెట్టి, తేమ శాతం 14% లోపు ఉండేలా చూసుకుని కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు.
దేశ వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు బీప్ శబ్దంతో కూడిన అత్యవసర హెచ్చరిక నోటిఫికేషన్లు వచ్చాయి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA), టెలికాం శాఖ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే సాంకేతికత పనితీరును తనిఖీ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది కేవలం పరీక్ష మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.
సత్యసాయి: శ్రీ సత్యసాయి మహాప్రస్థానంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సాయి ఆసుపత్రి సంయుక్తంగా రెండు రోజుల శస్త్రచికిత్స వర్క్‌షాప్‌ను ప్రారంభించాయి. డా. కేశవమూర్తి నేతృత్వంలో సుమారు 50 అత్యాధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ సేవలు నిరుపేదలకు మేలు చేకూరుస్తాయని నిర్వాహకులు తెలిపారు.