KMR: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలిశ్రీనివాస్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆయనకు సాదరస్వాగతం పలికారు. కలెక్టరేట్‌కు విచ్చేసిన ఛైర్మన్‌కు కలెక్టర్ పూలమొక్కను అందించి, స్వాగతించారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం అమలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.
KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మసీదుపురం గ్రామంలో జరిగిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించారు. వాల్మీకి మహర్షి బోధనలు యువత ఆచరిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
NLG: చిట్యాల 8వ వార్డులో కరెంటు వైర్లకు కంప చెట్లు తాకుతూ ప్రమాదకరంగా ఉండడంతో ఆ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ సొంత ఖర్చులతో ఇవాళ జేసీబీ సాయంతో తొలగింపజేశారు. వార్డులో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని, వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కాలనీవాసులు మారగోని యాదగిరి, నరసింహ, పెద్దులు, లింగస్వామి అమరోజు మదన్‌లు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో వన్ టౌన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నింగి నుంచి నిఘా ఉంచుతూ విస్తృత తనిఖీలు నిర్వహించారు.
NRPT: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అర్హులైన నిరుపేదలకు గృహాల పంపిణీ కొనసాగుతోంది. ఏనుముల తిరుపతి రెడ్డి సాకారంతో పెదిరిపహాడ్ గ్రామానికి చెందిన చాకలి మల్లేశ్‌కు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. శుక్రవారం కుటుంబ సభ్యులు ఘనంగా గృహప్రవేశం నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరిందని మల్లేశ్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
GDWL: ఆడుతూ పాడుతూ పాఠశాలకు రావాల్సిన చిన్నారి.. అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వేలింది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన పేగుల గోపాల్ కుమార్తె చందు(13) శుక్రవారం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అమరవాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని మరణవార్త తెలియగానే పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.
SDPT: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామం నుంచి పూస వేర్లపల్లె వరకు తారు రోడ్డు నిర్మాణానికి 2.53 కోట్ల నిధులు మంజూరైనట్లు గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రోజున రోడ్డు పనులు ప్రారంభించారు. నిధులు మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అన్నారు. మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, వారు ఇచ్చే పిర్యాదులు సత్వరమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.
JN: రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘనపూర్లో సబ్సిడీపై అర్హులైన రైతులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని, దేశానికి వెన్నెముక రైతు అని ఎమ్మెల్యే అన్నారు.
ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరు మారనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ త్వరలోనే దీనిపై సంతకం చేయనున్నారు. అనంతరం ఈ విమానాశ్రయం పేరు మార్పునకు ఫెడరల్ ఏవియేషన్ ఆమోదం కూడా అవసరం.
NZB: జిల్లాలో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు పరీక్షా కేంద్రాలతో కుమ్మక్కై మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.
HNK: హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో మాజీ మంత్రి టీ. హరీష్ రావును శుక్రవారం వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు ప్రవర్తించిన తీరు గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, తుమ్మల యాకయ్య, కుమారస్వామి, ఏకాంతం, పిట్టల రాజు, తదితరులు పాల్గొన్నారు.
TG: మెదక్ జిల్లా రేగోడ్ కస్తుర్భా గాంధీ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఆహారం కలుషితమై 10 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో వారు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
VKB: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవలో తాండూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది. పైలెట్‌తో పాటు మరో ఏడు మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. హైకోర్టు బెయిల్ ద్వారా తాండూరు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ATP: వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియమించారు. రాయదుర్గానికి చెందిన రాజకుమార్, సుదర్శన్ రెడ్డిలకు ఈ పదవులు దక్కాయి. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటంలో వీరి సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.