WGL: గీసుకొండ(M) కేంద్రంలోని గంగాదేవి పల్లె గ్రామంలో రెండో విడత సర్పంచుల ఓరియంటేషన్ శిక్షణ శిబిరంలో ఇవాళ అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాల నెలకొన్న సమస్యలు పరిష్కరించి సూచించారు. ఈ కార్యక్రమంలో మెరుగు సుమలత పాల్గొన్నారు.
PDPL: జిల్లాలో అగ్నివీర్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష శుక్రవారం తెలిపారు. ఈనెల 23లోపు అభ్యర్థులు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈనెల 25న మెడికల్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. మే 31 వరకు శిక్షణ ఉంటుందని, టెన్త్ పాసైన 17.5-22 సంవత్సరాల మధ్య వయసుగల పురుష అభ్యర్థులు అర్హులన్నారు.
BDK: ప్రభుత్వ ఐటీఐలో షార్ట్‌టర్మ్‌లో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వ శిక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని కొత్తగూడెం ప్రిన్సిపాల్ రమేష్ నేడు తెలిపారు. పీఎంకేవీవై ద్వారా సీఎన్సీ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, త్రీడీ ప్రింటర్ కోర్సులకు కొత్తగూడెంలో, సీఎన్సీ ప్రోగ్రామర్, ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులకు శిక్షణ ఉందన్నారు.
TG: ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. ఇండియా అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. AIలో స్టార్టప్‌లను భారత్ ప్రోత్సహించాలన్నారు. ప్రతి 6 నెలలకోసారి HYD వంటి ప్రదేశంలో ఏఐ సదస్సులు జరగాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. ఈ మేరకు HYDలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలకు పిలుపునిచ్చారు.
CTR:”ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు” అనేది ప్రతి విద్యార్థి నినాదం అవ్వాలని డీఎస్పీ సయ్యద్ మొహమ్మద్ అజీజ్ పిలుపునిచ్చారు. కార్వేటినగరంలోని ఐటీఐ కళాశాలలో నగరి డీఎస్పీ, సీఐ హనుమంతప్ప, ఎస్సై తేజస్విని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసే ర్యాగింగ్‌కు కళాశాలల్లో చోటు లేదని స్పష్టం చేశారు.
ప్రకాశం: కనిగిరి 9 వ వార్డుకు చెందిన సయ్యద్ ఆలీ కుమారుడు తౌషిక్ సింగరాయకొండలోని నవోదయ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతూ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఎంతో బాధాకరమైన ఘటనగా పేర్కొన్నారు. ఈ మేరకు తౌషిక్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
SKLM: రైతులు కిసాన్ డ్రోన్ సేవలను సులభంగా పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించిందని వ్యవసాయ శాఖ ఏడీ వెంకట మధు శుక్రవారం తెలిపారు. ప్లే స్టోర్‌లో లభ్యమయ్యే ‘డ్రీన్ మాట్’ యాప్‌ను డౌన్ లోడ్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. దీని ఆధారంగా రైతుల అవసరాలకు డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.
ADB: ఇచ్చోడ మండలం మన్నూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి లబ్ధిదారుని ఆహ్వానం మేరకు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శుక్రవారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన గృహ ప్రవేశ పూజల్లో పాల్గొని, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
SRCL: తమ డిమాండ్ల సాధన కోసం టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఉద్యోగుల ఛలో సెక్రటేరియట్ పోస్టర్‌ను శుక్రవారం వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు కాళిదాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిందని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు.
E.G: గోకవరం మండల కేంద్రంలో సర్వ శిక్షణ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత సెంటర్‌ని జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కనక బాబు శుక్రవారం అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భవిత సెంటర్లో ( మానసిక విద్యార్థుల ) యాక్టివిటీస్‌ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అలాగే ఫిజియోథెరపీ సేవలను విద్యార్థులకు ఎలా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
సత్యసాయి: లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ మద్దిపి గ్రామంలో చెరువు బోరులోని నీరు గత వారం నుంచి కలుషితమై మట్టి నీరు వస్తోంది. కనీసం కడుక్కోవడానికి కూడా వీలులేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేసిన కొత్త బోరును ప్రారంభించి ట్యాంక్‌కు నీరు అందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
HYD: గోల్కొండ, రాజేంద్రగనర్, గండిపేట మండలాల పరిధిలో మూసీ సుందరీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ భూములు, స్థలాలు సేకరించాల్సి ఉంది. అయితే స్థానికులు ఇందుకు ససేమిరా అంటున్నారు. తమ స్థలాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని స్థానికులు అధికారులకు తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉండగా భూముల సేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు దాదాపు 1000 నోటీసులు ఇచ్చారు.
GNTR: జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒకరికి ఒక రోజు వస్తుంది తనకు కూడా రోజు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఎదిగిన తాను ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తానని తెలిపారు.
TG: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పార్టీ అధిష్టానానికి కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, PCC చీఫ్ మహేష్ గౌడ్‌కు లేఖ రాశారు. ‘మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎప్పటినుంచో కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పరిస్థితులు అనుకూలించకే ఓడిపోయారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ఆయనకు అవమానం జరగకుండా చూడాలి. వారికి తగిన గౌరవం దక్కాలి’ అని అన్నారు.
SRD: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కంగ్టి మండలం చుక్కలతీర్థం మాజీ సర్పంచ్ రమేష్ పాటిల్(49) ఇవాళ మృతి చెందారు. ఈ నెల 10న పొలం పనులపై రాసోల్ వెళ్లి తిరిగి రాత్రి తడ్కల్‌కు వెళ్తుండగా ముర్కుంజాల్ శివారులో బైకు అదుపుతప్పి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఆస్పత్రిలో బ్రెయిన్ ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమించి మరణించారు.