• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తెలుగు వర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్

HYD: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ సంగీత, నృత్యశాఖలో ఈ ఏడాదికి గానూ సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్షల నియంత్రణాధికారిణి ఎంవీ ఆదిలక్ష్మి సోమవారం మీడియాతో తెలిపారు. ఫైన్ లేకుండా మార్చి 10లోగా, రూ.1,000 ఫైన్‌తో మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.

February 23, 2026 / 12:18 PM IST

తిప్పనగుల్లలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

MDK: నిజాంపేట మండల తిప్పనగుల్ల గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పనులలో భాగంగా పనులు ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధి కోళ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:17 PM IST

బొట్టుగూడ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

NLG: నల్గొండ పట్టణం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సోమవారం ఉదయం సందర్శించారు. అన్ని తరగతి గదులను తిరుగుతూ పరిశీలన జరిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఆయన గణితం బోధించి విద్యార్థులను ఆకట్టుకున్నారు. నాణ్యమైన విద్యను అందించాలని సిబ్బందికి సూచించారు.

February 23, 2026 / 12:16 PM IST

కురుపాంలో బీటీ రోడ్ల పనులు ప్రారంభం

PPM: కురుపాం మండలంలోని కొండలేవిడి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కోనపాడు వరకు 2.8 కి.మీ రూ.3 కోట్లతో, గాంధీనగర్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి దొంగల బారామని వరకు 2.6 కి.మీ. రూ.2.6 కోట్ల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. NREGS నిధులతో ఈ పనులు ప్రారంభించామని ఐటీడిఏ AEE అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:15 PM IST

నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఖానాపురం సమీపంలో నేషనల్ హైవే 365 రోడ్డుపై 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక యువకుడికి తీవ్ర గాయాలు అయినట్లు ప్రయాణికులు తెలిపారు. గాయపడ్డ యువకుడిని వైద్య నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. సంఘటనపై ఎస్సై రవికుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 12:15 PM IST

‘ప్రయోగ తరగతులకు తప్పని సరిగా హాజరుకావాలి’

MBNR: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సైన్స్, కంప్యూటర్ విద్యార్థులకు ప్రయోగ తరగతులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని కోఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ తెలిపారు. తప్పని సరిగా 80% హాజరు ఉండాలని తెలిపారు. 

February 23, 2026 / 12:12 PM IST

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

అయినవిల్లి మండలంలోని అయినవిల్లి లంక గ్రామంలో లబ్ధిదారులకు సోమవారం అంబాజీపేట ఏఎంసీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షుడు వస్కా శ్యామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. డెక్క దుర్గా భవానికి రూ.62,163, జుత్తుక అరుణ కుమారికి రూ.42,142 నగదు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి నాగవాణి మాధవి లలిత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:12 PM IST

సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని ఆర్ఐవో వివరించారు.

February 23, 2026 / 12:10 PM IST

‘గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం’

SDPT: కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యుల రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో కృష్ణయ్య కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ విధులు, నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. కూరెళ్ల, మైసంపల్లి, నకిరేకొమ్ముల తదితర గ్రామాల సభ్యులు హాజరయ్యారు.

February 23, 2026 / 12:07 PM IST

‘వినాయకనగర్‌లో మౌలిక వసతులు కల్పించండి’

సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని వినాయకనగర్‌లో డ్రైనేజీ కాలువ, వీధి విద్యుత్ లైన్, వీధి కొళాయి ఏర్పాటు చేయాలని సీపీఎం, భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. సోమవారం మండల ఎంపీడీవో వెంకటలక్ష్మికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో ప్రాథమిక సదుపాయాల లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పెద్దన్న వివరించారు.

February 23, 2026 / 12:05 PM IST

ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టు.. ‘చలో HYD’ భగ్నం..!

MDK: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన ‘చలో HYD’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం HYDకు తరలివెళ్తున్న ఆశా వర్కర్లను టేక్మల్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. గౌరవ వేతనం పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

February 23, 2026 / 12:05 PM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: ఇంటర్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిపాదిత కళాశాలల కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం గద్వాలలో ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలల్లో పరీక్షల ఏర్పాటు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.

February 23, 2026 / 12:04 PM IST

కల్తీ పాల ఘటన.. జగన్ దిగ్భ్రాంతి

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆహారభద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పు అని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు.

February 23, 2026 / 12:04 PM IST

‘ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం’

MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చీఫ్ సూపర్డెంట్ బాపురావు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. బుధవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. మొదటి సంవత్సరంలో 125 మంది, రెండో సంవత్సరంలో 120 మంది మొత్తం 245 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

February 23, 2026 / 12:03 PM IST

మహిళలు కుంకుమపువ్వు తీసుకుంటే?

కుంకుమపువ్వు మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక మూలకాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ కుంకుమపువ్వును నిత్యం పాలు, టీ రూపంలో తీసుకోవాలి. చర్మం నిగారింపునకు తోడ్పడుతుంది. రోజుకు 30mg కంటే ఎక్కువ తీసుకోవద్దు.

February 23, 2026 / 12:03 PM IST