• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్ ఏర్పాటు చేయాలని మార్కాపురంలో నిరసన

ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో రోడ్డు ఏర్పాటుకై MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సాలెంరాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. కంభంలో 100 కుటుంబాలు నివాసముంటున్న మదర్ తెరిసా కాలనీకి రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నిరసన ఆపేది లేదని అధికారులతో వాదించారు. కనిగిరి RDO ప్రాంతాన్ని పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

February 23, 2026 / 10:00 PM IST

మోడల్ స్కూల్ అదనపు తరగతి గదులకు MLA భూమి పూజ

NZB: రుద్రూర్ మండలం అంబంలోని మోడల్ స్కూల్లో అదనపు తరగతి గదులకు ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. మోడల్ స్కూల్ భవన ప్రాంగణంలో నాలుగు అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్, రుద్రూర్ తహ’సీల్దార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 10:00 PM IST

జూనియర్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందజేత

GNTR: అమరావతి సచివాలయంలో కొత్తగా ఎంపికైన 31 మంది జూనియర్ అసిస్టెంట్లకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న సిబ్బంది నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 10:00 PM IST

నిత్యాన్నదాన పథకానికి గుంటూరు భక్తుల విరాళం

కృష్ణా: ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి గుంటూరు భక్తులు విరాళం అందచేశారు. చెన్నంశెట్టి వెంకటేశ్వరరావు రూ.1,02,555లు చెక్కు రూపంలో దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావుకు అందచేశారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

February 23, 2026 / 10:00 PM IST

శీతల పానీయాలు తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుందా?

శీతల పానీయాలు తాగడం వల్ల గ్యాస్ తగ్గుతుందని అనుకోవడం పొరపాటని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిలోని చక్కెర, కెఫిన్ వల్ల ఆమ్లత్వం మరింత పెరుగుతుంది. కడుపు ఉబ్బరం తగ్గాలంటే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా చల్లని పాలు లేదా సోంపు గింజలు తీసుకుంటే గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు.

February 23, 2026 / 09:55 PM IST

రేపు లొంగిపోనున్న తెలంగాణ మావోయిస్టు కేడర్

TG: తెలంగాణ మావోయిస్టు కేడర్ లొంగిపోయేందుకు సిద్ధమైంది. రేపు రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ఎదుట దేవోజీ@తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి చుక్కారావు@దామోదర్, నున్నె నరసింహారెడ్డి సహా మొత్తం 18 మంది ఆయుధాలను విడిచిపెట్టనున్నారు. దీంతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుండగా.. దీనిపై రేపు DGP అధికారిక ప్రకటన చేయనున్నారు. 

February 23, 2026 / 09:50 PM IST

‘జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి’

NGKL: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు షరతులు లేకుండా, ‌పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని TWJF జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ బదవత్ సంతోష్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, వెంకటస్వామి, పరమేశ్ కోరారు.

February 23, 2026 / 09:43 PM IST

PIC OF THE DAY❤️

పైనున్న చిత్రం భాగ్యనగరపు నడిబొడ్డున వెలిసిన అందమైన దృశ్యంలా ఉంది. చారిత్రక చార్మినార్ రాత్రివేళ కాంతులతో మెరిసిపోతుంటే, దాని ముందు గాలిలో తేలుతున్న ఎర్రని బెలూన్లు ప్రేమానురాగాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ ఆ బెలున్లు పాతబస్తీ సంస్కృతికి ఆధునిక ప్రేమ సందేశాన్ని జోడించాయి. ఈ చిత్రం HYD ఆప్యాయతను, చారిత్రక సౌందర్యాన్ని ఒకే ఫ్రేమ్‌లో బంధించింది.

February 23, 2026 / 09:42 PM IST

హైడ్రా ప్రజావాణి.. ఆక్రమణలపై 59 ఫిర్యాదులు

RR: హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల ఆక్రమణలపై ప్రజల నుంచి సోమవారం మొత్తం 59 వినతులు అందాయి. హయత్‌నగర్, అమీన్‌పూర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో లేఅవుట్ స్థలాలను ప్లాట్లుగా మారుస్తున్నారని బాధితులు కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారులకు విచారణకు ఆదేశించారు.

February 23, 2026 / 09:41 PM IST

ఖమ్మం కార్పొరేషన్‌లో ప్రజావాణి కార్యక్రమం

ఖమ్మం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా పౌర కేంద్రీకృత పాలన దిశగా కీలక అడుగు పడింది. గౌరవ మేయర్ నీరజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంపై దృష్టి సారించారు. ప్రజలతో స్వయంగా ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 23, 2026 / 09:39 PM IST

బటర్‌ఫ్లై పార్కును ప్రారంభించిన కిషన్ రెడ్డి

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా మైన్ క్లోజర్ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియాను సందర్శించారు. అలాగే బటర్‌ఫ్లై పార్కును ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలతో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తవ్వకంపై చర్చించారు. మైన్ క్లోజర్ జాతీయ ప్రాధాన్యత అంశం అని పేర్కొన్నారు.

February 23, 2026 / 09:37 PM IST

తిరుపతమ్మని దర్శించుకున్న సీపీ రాజశేఖర్ బాబు

NTR: జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు సమర్పించారు.

February 23, 2026 / 09:34 PM IST

కార్మికుల బీమాను ప్రైవేటీకరించవద్దు: ఏఐటీయూసీ

SDPT: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు ప్రభుత్వం అందించే బీమా సౌకర్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 09:32 PM IST

పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకు ఏడుస్తారు?

శిశువు పుట్టిన వెంటనే ఏడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భం నుంచి బయటి ప్రపంచంలోకి రాగానే, శిశువు ఊపిరితిత్తులు తెరుచుకుని సొంతంగా శ్వాస తీసుకోవడానికి ఈ ఏడుపు సహాయపడుతుంది. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. మెదడు ఎదిగి భావాలు తెలిశాకే నవ్వు వస్తుంది. అందుకే శిశువు పుట్టగానే నవ్వకుండా కేవలం ఏడుస్తుంది.

February 23, 2026 / 09:32 PM IST

‘విద్యార్థులు లక్ష్యాలను నిర్ధారించుకోవాలి’

MDK: విద్యార్థులు లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని ఆ దిశగా కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎంఈఓ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణ పరిధి రావెల్లిలోని నర్సాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ విజయానికి తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

February 23, 2026 / 09:31 PM IST