GNTR: చట్టసభల విలువైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళికతో సభకు హాజరుకావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. సోమవారం అసెంబ్లీలోని జనసేన శాసనసభా పక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు.
డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్‌ను నిర్మాత అల్లు అరవింద్ కుటుంబ సమేతంగా కలిశారు. మార్చి 6న హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు పెళ్లికి పవన్ కళ్యాణ్ దంపతులను అల్లు అరవింద్ ఆహ్వానించారు. కాగా ఇప్పటికే దుబాయ్‌లో పార్టీస్, పసుపు దంచుడు వంటి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
MDK: కాళికా మాత ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకుని సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కాళికా మాత ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అర్చకులు ఆశీస్సులు అందజేసి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
RR: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్‌వో సంగీతకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఉన్న జిల్లానే కాకుండా తెలంగాణ ఎర్త్ వైడ్ ఫ్రీ బస్సు పాస్ ఇవ్వాలన్నారు.
AP: రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజులపాటు MLA, MLCలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. అసెంబ్లీ శాసనసభా పక్ష కార్యాలయాల్లో అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. సభ్యులు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. క్రికెట్, క్యారమ్స్, చెస్, టెన్నిస్ సహా అనేక ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.
E.G: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి చెందడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక పరిహారం అందించాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్య సేవలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
VZM: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షలు కొత్తవలస భారత్ డిఫెన్స్ అకాడమీలో సోమవారం సజావుగా జరిగింది. మొత్తం 297 విద్యార్థులు కేంద్రానికి కేటాయించగా, అందులో 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అనారోగ్యానికి బారిన పడకుండా అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ ఇవాళ హైదరాబాదులోని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్‌ను మంత్రి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్వకుర్తి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు.
సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనధికార వ్యక్తులు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు రాకుండా తనిఖీలు చేపట్టారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం మొదటి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
ATP: గుత్తి కోటలో కొలువైన శ్రీ భూనీలా సమేత నరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవాలయ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
ADB: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడిని ఖండిస్తూ జైనథ్ బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. బస్టాండ్ ఆవరణలో గంటపాటు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
MDCL: కీసర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 211వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని అధ్యక్షుడు కర్రె గణేశ్ ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ గౌడ సంఘం నాయకుడు వనందాస్ లక్ష్మి నారాయణ గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కీసర గ్రామశాఖ అధ్యక్షుడు తుడుం బాలరాజ్ పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి పంట సాగు చేస్తున్న రైతులు రైతు భరోసా పథకం నిధులు ఇంకా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట వేసే సమయంలో ఎరువులు, విత్తనాలు, కూలీలు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేలా రూపొందించిన ఈ పథకం ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి త్వరగా రైతుబంధు ఇవ్వాలని కోరారు.
SRD: కోహీర్ మండలంలోని గురుజువాడ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు బోధనాభ్యసన సామగ్రిని విరివిగా వినియోగించి విద్యార్థులకు సులభరీతిలో అర్థమయ్యే లా విద్యా బోధన చేయాలని సూచించారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించే విధంగా బోధించాలన్నారు.
NTR: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు ఎం పవన్ కుమార్‌పై విక్రమ్ సింహ అనే సీఐ దాడి చేయటం పట్ల తీవ్రంగా ఖండించారు. తక్షణం సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోని, సస్పెండ్ చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు.