KMM: కామేపల్లి మండలంలోని కామేపల్లి, పాత లింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఏవో తారాదేవి తెలిపారు. నిషేధిత హెచ్ టీ పత్తి సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. సాగులో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు వివరించారు.
VZM: ఈ నెల 28న చీపురుపల్లిలో జరగనున్న గ్రామసభల ఏర్పాట్లపై అదికారులతో సోమవారం డీడీఓ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్యక్రమాలు సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. గ్రామసభలకు ప్రజల హాజరు పెరిగేలా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
HYD: మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. HMWSSB ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకుంది. రూ. 282 కోట్లతో ఉస్మాన్‌సాగర్ మంచినీటి పైప్‌లైన్ ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలంచెల్లిన పైపులు, పంప్ హౌస్‌ల కారణంగా దాదాపు 30% నీటి సరఫరాలో నష్టం వాటిల్లుతోంది.
VSP: కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో పరమశివుడి ఆయుధమైన 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు త్రిశూల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్ట్‌కు సుమారు రూ.1.55 కోట్ల వ్యయం, LED లైట్లతో రాత్రిపూటనూ మెరవనీయంగా ఉంటుంది. క్రేన్ సాయంతో విడి భాగాలు అమర్చగా, సందర్శకులు కూర్చొని ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నారు.
KRNL: ఓర్వకల్లు మండల పరిధిలోని కొంతలపాడులోని యాగంటయ్య ఉత్సవాలు రేపటి నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. 25, 26 తేదీల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 27వ తేదీన పాలపండ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలే ఓటమికి పాల్పడ్డారని వారిపై పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అనంతరం గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే నాటుసారా తయారీకి, విక్రయాలకు దూరంగా ఉంది సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
SKLM: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిందని పలాస మండలం బొడ్డపాడులోని ఉపాధి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరగా పనులు కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు స్థానిక సచివాయల సిబ్బందికి ఏఐసీసీటీయూ నాయకులు కుత్తుం దుష్యంత్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు ఉన్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు సింహ వాహనంపై తిరువీధుల్లో విహరించారు. స్వామివారిని, అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి మాడవీధుల్లో ఊరేగింపు సేవ కొనసాగించారు. భక్తుల జయ జయ ద్వానాలతో, కళాకారుల నృత్యాలు మేళా వాయిద్యాలతో కన్నులవిందుగా కొనసాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.
NLG:హైదరబాద్‌లో సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.
MDK: రామాయంపేటలోని దామరచెరువు చౌరస్తా వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు సదాశివనగర్ మండలం విసనపల్లి గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. స్థానికులు స్పందించి 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
NZB: తెలంగాణ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీశ్ తేజ సిల్వర్ మెడల్ సాధించాడు. HYD లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 65 కేజీల కేటగిరిలో హరీశ్ తేజ కోచ్ రాజ్ కుమార్ సహకారంతో స్నాచ్లో 96, క్లీన్ అండ్ జెర్క్111 కేజీల బరువెత్తి మొత్తం 207 కేజీల బరువుతో ద్వితీయ స్థానంలో నిలిచారు.
WGL: ఖిలా వరంగల్ ఏబీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ సత్య శారద సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సౌకర్యాలు, బోధన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
KMR: కామారెడ్డిలో నేడు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.